Connect with us

Spiritual

కృష్ణా నదిలో ప్రత్యక్షమైన రాముడి విగ్రహాలు! అచ్చం అయోధ్యలోలా!

Published

on

సాధారణంగా హిందువులకు పురాతన దేవతామూర్తుల విగ్రహాలు అంటే చాలా మక్కువ. అలాంటి విగ్రహాలు ఇటీవలే తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కృష్ణా నదిలో అనేక సార్లు బయటపడ్డాయి.
ఈ విగ్రహాలను వేటకు వెళ్లిన మత్సకారులకు దొరకడంతో.. వారు వాటిని బయట పెట్టేవారు. ఇప్పటికే పలు సార్లు నాగదేవత విగ్రహాలు, శివలింగం, విష్ణుమూర్తి, నంది ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించడంతో.. ఆ విగ్రహాలు బయటపడేవి. వీటిని చూడటానికి ప్రజలు, తండోపతండాలుగా తరలి వచ్చేవారు. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణ -కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదిలో జరిగింది. అక్కడ వంతెన పనులు జరుగుతున్న సందర్భంగా..సాక్ష్యత్తు ఆ దేవతామూర్తి విగ్రహాం బయటపడింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా నదికి సంబంధించి వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం వంతెన పనులు చేపడుతుండాగా.. నదిలో కొన్ని విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాటిని అలా తవ్వుతుండగా.. సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం దర్శనమిచ్చింది. దీనిని అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి విగ్రహాలుకు ఎటువంటి దెబ్బతినకుండా బయటకు తీశారు. వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా.. అది ఇటీవలే అయోధ్య రామలయంలో ప్రతిష్టించిన రామ్‌ లల్లా విగ్రహంలా ఉంది. పైగా ఆ విగ్రహాలు శతాబ్దాల చరిత్ర చెందినవిలా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా శ్రీమహా విష్ణువుని చూస్తే.. నాలుగు చేతులతో నిలబడిన ఆకారంలో ప్రత్యేకంగా కనిపించింది. అలాగే పై చేతుల్లో శంఖు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్త, వరద హస్త ఉన్నాయి. విష్ణువు చుట్టూ మత్య్స, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి వంటి దశావతారాలు కలిగి ఉన్నాయి. ఇది అచ్చం వేంకటేశ్వర స్వామి పోలిక మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే విష్ణువు విగ్రహంలో ఉండే గరుడుడు ఈ విగ్రహంలో లేకపోవడం విశేషం. ఇక ఈ విగ్రహంపై పూలమాలలు కూడా ఉండడం విశేషం. దీంతో ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. స్థానిక ప్రజలు దీనిని చూడటానికి చాలా ఆసక్తి కనుబరుచుతున్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం

Published

on

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈఓ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్. శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్‌ను పునఃప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టోకెన్ల స్కానింగ్‌ను పునఃప్రారంభించాలని ఐటీ విభాగానికి టీటీడీ ఈవో జె. శ్యామలరావు సూచించారు.
టీటీడీ రెవెన్యూ-పంచాయతీ రాజ్, రిసెప్షన్, ఐటి విభాగాలపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్‌లతో కలిసి ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు. అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు.

ఏపీఎస్‌ఆర్‌టీసీ, టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

అదే విధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదేపదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులని ఆదేశించారు. నారాయణగిరి షెడ్‌ల వద్ద వైకుంఠం కంపార్ట్‌మెంట్‌ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు

రెవెన్యూ-పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షించిన ఆయన, తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనర్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.

యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూలైన్‌లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ)ని ప్రత్యేకంగా నియమించాలని ఈఓ ఆదేశించారు

Advertisement

ఆరోగ్యం, అన్నప్రసాదం, శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏఈఓతో ఎప్పటికప్పుడు సమన్వయించుకుంటూ ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని ఆయన చెప్పారు.

Continue Reading

Spiritual

సతీదేవి దంతం పడిన క్షేత్రం.. వినాయకుడు స్త్రీ రూపంలో దర్శనం.. ఈ మహామానిత్వ క్షేత్రం ఎక్కడంటే..

Published

on

సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాయి. అలాంటి శక్తి పీతాల్లో ఒకటి సుచింద్రం శక్తి పీఠం. ఇది హిందువులకు ప్రధాన మతపరమైన ప్రదేశం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉంది. సుచింద్రం శక్తి పీఠాన్ని తనుమలయన్ లేదా స్థనుమలయ దేవాలయం అని కూడా అంటారు. సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్ని స్థనుమలయం అని పిలుస్తారు. ఈ ఆలయం శైవ, వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. స్థనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్ధం.. స్తను అంటే శివుడు, మాల్ అంటే విష్ణువు, ఆయ అంటే బ్రహ్మ. ఏడు అంతస్థుల అద్భుతమైన తెల్లని ఆలయ గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తూ సుచింద్రం ఆలయం దీని నిర్మాణ నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

సతిదేవిపై దంతం ఇక్కడ పడినట్లు స్థల పురాణం
ఈ ఆలయం సతీదేవి 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో శక్తి నారాయణి రూపంలో పూజించబడుతోంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు, బట్టలు లేదా నగలు పడిపోయిన ప్రదేశాలు శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. వీటిని చాలా పవిత్రమైన తీర్థ స్థలాలుగా భావించి హిందువులు పూజిస్తారు.

పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞ కుండలో దూకి ప్రాణత్యాగం చేసింది. అప్పుడు శంకరుడు సతీదేవి మృతదేహాన్ని మోస్తూ విశ్వమంతా ప్రదక్షిణ చేస్తున్నాడు.. ఆ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృత దేహాన్ని ఖండించాడు. అప్పుడు 51 భాగాలుగా సతీదేవి శరీరం విభజించబడింది. ఇలా సతిదేవి పై దంతాలు పడిన ప్రదేశం సుచింద్రం శక్తి పీఠం అని నమ్మకం.

గణపతికి స్త్రీ రూపంలో పూజ
విఘ్నాలకధి పతి గణపతిని రకరాకాల భంగిమలో పుజిస్తారు. అయితే ఈ శక్తిపీఠంలో అమ్మవారు నారాయణి రూపంలో పూజించబడుతుండగా.. గణపతి.. స్త్రీ రూపంలో అంటే విఘ్నేశ్వరి రూపంలో పూజిస్తారు. ఇలా గణపతిని స్త్రీ రూపంలో పూజించడం దేశంలో మరెక్కడా ఉండదు.

ఆలయ వాస్తుశిల్పం విశిష్టత
ఆలయంలో దాదాపు ముప్పై చిన్న, పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒక చోట విష్ణుమూర్తి అష్టధాతువు విగ్రహం ఉంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీత, రాముల విగ్రహం కుడి వైపున ప్రతిష్టించబడుతుంది. సమీపంలో గణేష్ ఆలయం.. దాని ముందు నవగ్రహ మండపం ఉంది. ఈ మంటపంలో తొమ్మిది గ్రహాల విగ్రహాలు అందంగా నిలబడి ఉన్నాయి. అలంగర్ మండపంలో నాలుగు సంగీత స్తంభాలు ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న అలంగార మండపంలో ఒకే గ్రానైట్‌తో చెక్కబడిన నాలుగు సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు మృదంగం, సితార, తంబురా, జలతరంగ వంటి విభిన్న వాయిద్యాల ధ్వనులను ఇస్తుంది.

Advertisement

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని infoline.one ధృవీకరించడం లేదు.

Continue Reading

Spiritual

యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?

Published

on

Spirituality In Youth : ఉరుకుల, పరుగుల జీవితం.. ఏ వృత్తిలో అయినా తప్పని ఒత్తిడి… ఆర్థిక, వృత్తి పరమైన లక్ష్యాల సాధనలో నిరంతరం మునిగి తేలాల్సిన పరిస్థితులు. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. యువతపై ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే కుదిరినప్పుడల్లా వీలైనంత ప్రశాంతంగా గడిపేందుకు, మనసును సాంత్వన పరుచుకునేందుకు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు.. భగవంతుడే అంతిమ సత్యం అన్న విషయాన్ని గ్రహించేందుకు మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కరోనా సృష్టించిన కల్లోలాన్ని అనుభవించిన తర్వాత …జీవితంలోని కల్లోల పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శన తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తుల రద్దీ..
కృష్ణారామా అనుకుంటూ తీర్థయాత్రలు చేయాల్సిన వయసు అని.. వృద్ధాప్యం గురించి తెలుగు నాట ఓ సామెత ఉంది. బాధ్యతలన్నీ తీరిపోయి.. పిల్లలు, వారి పిల్లలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమవ్వడంతో శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు, మరణం తర్వాత ఏమవుతుందన్న సందేహాలకు దూరం జరిగేందుకు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరే వారు. కానీ ఇప్పుడా సామెత మార్చి రాయాల్సిన సందర్భం వచ్చేసింది. ఖాళీ దొరికితే ఆలయాలకు పరుగులు తీస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రత్యేక పూజలు, పొర్లు దండాలు, ఉపవాసాలు, మొక్కులు అంటూ ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తుల కనిపిస్తూనే ఉన్నారు.

పుణ్యక్షేత్రాల సందర్శనకు యువత పోటీ..
ఒకప్పుడు వెకేషన్ అంటే ఏ గోవానో ఇంకేదో బీచ్‌కు వెళ్లడమో అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఈ వేసవికాలంలో దేశంలో ఎక్కువమంది ప్రజలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులన్నీ ఆలయాల సందర్శనకు సంబంధించినవే. దక్షిణ భారతదేశంలో ఆలయాలతో పాటు చార్ ధామ్, అయోధ్య, వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించేందుకు యువత పోటీ పడింది. పుణ్యక్షేత్ర దర్శనం, పర్యాటక ప్రాంతాల సందర్శనం కలిపి ఉన్న టూరిజం ప్యాకేజీలతో కొన్ని కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. మన దేశంలోనే కాదు విదేశాల నుంచీ భక్తులు మన ఆధ్యాత్మిక క్షేత్రాలకు భారీగా తరలివస్తున్నారు.

ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా లాభాలు..
ఆధ్యాత్మిక పర్యాటకం, మతపరమైన పర్యాటకంగా పిలుస్తున్న ఈ ట్రెండ్‌తో ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా లాభాలు వస్తున్నాయి. ఏటికేడు ఆదాయం రెట్టింపవుతోంది. ఆధ్యాత్మిక భావంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకునే పరిస్థితులుండడం, ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త ఉపశమనం లభించడం, జీవితంలో ఎదురైన సమస్యలకు సావధానంగా ఆలోచించి పరిష్కారాలు పొందవచ్చన్న అభిప్రాయం, ఆలయాలకు వెళ్తే మానసికంగా కలిగే ప్రశాంతత, ఆలోచనల్లో వచ్చే సానుకూల మార్పు, ఆధ్యాత్మిక సంతృప్తి వంటివి పెద్ద వాళ్లతో పాటు యువతనూ ఆధ్యాత్మిక పర్యటనల వైపు ఆకర్షిస్తోంది. సహజంగానే భారతీయుల్లో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం మారిన సామాజిక పరిస్థితులతో భక్తి.. మనసుకు సాంత్వన కలిగించే సాధనంగా మారింది.

కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టుగా మారిపోయిన మనిషి జీవితం..
కరోనా సమయంలో అడుగుతీసి అడుగు బయటపెట్టాలన్నా అందరూ భయపడ్డారు. అయినప్పటికీ ఎంతో నష్టం జరిగింది. కొందరు ఆప్తులను పోగొట్టుకున్నారు. మరికొందరు ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఎన్ని డబ్బులున్నా, ఇంకెన్ని రకాల సౌకర్యాలున్నా కళ్లముందు అయిన వారు చనిపోతుంటే మరికొందరు నిస్సహాయంగా చూస్తుండి పోవాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మిగిల్చిన అనారోగ్యం చాలామందిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలా భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టుగా మనిషి జీవితం మారిపోయింది.

Advertisement

ఆధ్యాత్మిక చింతన పెంచిన కరోనా పరిస్థితులు..
కల్లోల కాలంలో ఎదురైన జీవితానుభావాలు భారత్‌లో ఎక్కువమంది ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాయి. విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్‌ఆర్‌ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు. భగవంతుని సన్నిధిలో మనసును ప్రశాంతంగా మార్చుకుని.. జీవితంలోని కష్టనష్టాల భారాన్ని దేవునిపై వదిలేస్తున్నారు.

Continue Reading
International4 hours ago

‘మౌస్ జిగ్లింగ్‌’కు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ.. ‘మౌస్ జిగ్లింగ్‌’ అంటే ఏంటో తెలుసా?

National4 hours ago

నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. ఎఫ్ఐఆర్ నమోదు

National4 hours ago

నకిలీ కరెన్సీతో గిరిజనులకు మావోల మోసం- పెద్దఎత్తున డబ్బులు స్వాధీనం

National4 hours ago

కల్తీసారా బాధితులు కేర్​ లెస్​- లిమిట్​కు మించి తాగడం వల్లే!: కమల్ హాసన్​

National4 hours ago

సోమవారం నుంచే లోక్‌సభ తొలి సెషన్​- మోదీ ప్రమాణస్వీకారం అప్పుడే- తెలుగు ఎంపీలు ఎప్పుడంటే? – 18th Lok Sabha First Session

Andhrapradesh4 hours ago

సామాన్యులకు కూర’గాయాలు’ – vegetables prices in AP

National4 hours ago

Reservation Cancel: 65 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు.

Andhrapradesh4 hours ago

Andhra Pradesh: మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన

Political4 hours ago

బీఎస్పీ ఛీఫ్ కీలక నిర్ణయం.. వారసుడిని ప్రకటించిన మాయావతి

Cricket4 hours ago

IND vs AUS Pitch Report: డారెన్ సామీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ చూస్తే పరేషానే.. ఎందుకో తెలుసా?

Technology5 hours ago

విజయవంతమైన పుష్పక్ విమానం

Railway20 hours ago

వృద్ధులు గర్భిణులకు గుడ్ …న్యూస్ రైల్వే ప్రయాణాల్లో వెసలు బాటు

National1 day ago

కేంద్రం సంచలన నిర్ణయం ….సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.

Andhrapradesh1 day ago

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి

National2 days ago

కేజ్రీవాల్​కు మళ్లీ షాక్​- బెయిల్​పై దిల్లీ హైకోర్టు స్టే – Delhi HC stays Arvind Kejriwal Bail

International2 days ago

చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

International2 days ago

Overseas Indians: డాలర్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తేసిన ఎన్నారైలు – ఒక్క నెలలో రూ.9 వేల కోట్లు డిపాజిట్‌

Andhrapradesh3 days ago

ఋషికొండ నాకే ఇవ్వండి చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చిన సుకేష్

Cinema3 days ago

Anupam Kher : బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు.. వీడియో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్

National3 days ago

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

National3 days ago

Infosys Offered: ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు.!

National3 days ago

మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం – international yoga day

National3 days ago

‘నీట్​ పేపర్​ లీకేజీ నిజమే- పరీక్ష ముందురోజే విద్యార్థుల చేతికి ప్రశ్నాపత్రాలు- రూ.30లక్షలకు బేరం’ – neet ug 2024 controversy

Andhrapradesh3 days ago

అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు నుండి

Andhrapradesh3 days ago

Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం

Andhrapradesh4 days ago

కొత్త సలహాదారుల నియామకం… ఏ బి తో సహా

Andhrapradesh4 days ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

Weather4 days ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

Technology4 days ago

WhatsApp AR Features : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఏఆర్ ఫీచర్లు.. వీడియో, ఆడియో కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు..!

Andhrapradesh4 days ago

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! – AP MINISTERS

Business4 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career4 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business4 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business4 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

News4 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

National2 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Education2 weeks ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Crime News2 weeks ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

National2 weeks ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National2 weeks ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh2 weeks ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National4 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh2 weeks ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh2 weeks ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

National2 weeks ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Telangana4 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 weeks ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh2 weeks ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 weeks ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Political2 weeks ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Political7 days ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Spiritual2 weeks ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Business4 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh2 weeks ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

National2 weeks ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 weeks ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh4 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

Spiritual4 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

News2 weeks ago

Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Andhrapradesh2 weeks ago

AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!

Trending