Political

ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠత: ఈసీ ఉన్నతస్థాయి సమీక్ష

Published

on

Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వేడి క్రమంగా నెలకొంటోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం నాటికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్.. ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. షెడ్యూల్ విడుదల చేయడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల తమ సమీక్ష సమావేశాలను మరింత ముమ్మరం చేశారు. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్- స్వీప్ విభాగం డైరెక్టర్ సంతోష్ అజ్మీరా, ఇతర అధికారులు వెలగపూడి సచివాలయంలో నోడల్ అధికారులతో సమీక్షను నిర్వహించారు. అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేయాలని సంతోష్ అజ్మీరా ఆదేశించారు. షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

పోలింగ్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అజ్మీరా అన్నారు. ప్రత్యేకించి కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలను తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, వారిని ఆ దిశగా చైతన్యవంతులను చేయాలని సూచించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, వీవీప్యాట్‌పై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అజ్మీరా సూచించారు.

ఎన్నికల నిర్వహణకు సంబందించిన
మార్గదర్శకాలన్నింటినీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని ముఖేష్ కుమార్ మీనా గుర్తుచేశారు. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని చెప్పారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version