Andhrapradesh

అందరూ అండగా ఉండాలి..వైసీపీతోనే రాష్ట్ర ప్రగతి – ఇంటింటి ప్రచారంలో ‘బూచేపల్లి’

Published

on

వైసీపీతోనే రాష్ట్ర ప్రగతి జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. సంక్షేమ పథకాలు పొందిన వారందరూ అండగా ఉండాలని కోరారు. మంగళవారం దర్శిలోని కొత్తపాలెం రెండో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సతీమణి నందిని, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై వెంకాయమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి జరిగిందని, ప్రతి ఇంటికీ ఏదొక పథకం అందుతుందని, అర్హులైన వారందరూ పథకాలు పొందారని అన్నారు. దర్శిలో తమను గెలిపిస్తే ప్రజలందరికీ అండగా ఉంటా నని వైసీపీ ఇన్ఛార్జీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు.. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. తన హయాంలో, తన తండ్రి హయాంలో అనేక సేవా కార్య క్రమాలతో పాటు అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. తనను మరలా గెలిపిస్తే దర్శిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఇంటింటి వద్ద బూచేపల్లికి పూలతో స్వాగతం పలికారు. గజ మాలతో సన్మానించారు. మేళతాళాలతో కొత్తపాలెం లో ఇంటింటికి తిరిగారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్ లు చంద్రగిరి గురవారెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరక్టర్ డాక్టర్ ఎస్ఎం భాషా, నాయకులు కేవీ రెడ్డి, సద్ది పుల్లారెడ్డి, మధు, నారాయణరకెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కురిచేడు మండలంలో…
కురిచేడులో మంగళవారం సాయంత్రం డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ప్రచారం చేశారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు
అభిమానులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ నుండి రూ.15 లక్షలకు పైగా నిధులతో చేపట్టిన ముస్లిం శ్మశానవాటిక పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పిటిసి నుసుం వెంకటనాగిరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ యన్నాబత్తుల సుబ్బయ్య, ఏ.యం.సి. వైస్ చైర్మన్ కండె గంగయ్య, మండల సచివాలయ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరక్టర్ యస్.యం. బాషా, మేరువ పిచ్చిరెడ్డి, కురిచేడు సర్పంచ్ కేశనపల్లి క్రిష్ణయ్య , గోగులమూడి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version