Connect with us

Business

గోల్డ్ లోన్స్ పై RBI ఆంక్షలు

Published

on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ మంజూరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. IIFL ఫైనాన్స్ బంగారు రుణాలపై ఆంక్షలు విధించింది. ఈ రోజు ఆర్బీఐ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 45L(1) కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించి, IFL ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ సేవలు నిలిపివేయాలని, బంగారం తకట్టు పెట్టుకొని రుణాలు మంజూరు ప్రక్షళల చేయాలని ఆదేశించింది.

ప్రస్తుతం ఉన్న పోర్ట్ ఫోలియోకు అనుగుణంగా లోన్స్ ఇవ్వడం, రికవరీ సర్వీసులు జరపవచ్చని ఆర్బీఐ ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 31, 2023 నాటికి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన ఆర్బీఐ ఆశ్చర్యపోయింది. కొత్తగా మంజూరు చేసే లోల్డ్ లోన్స్ పై రూల్స్ పాటించాలని హెచ్చరించింది.
బంగారం తీసుకున్నప్పుడు, లోన్ రికవరీ సమయాల్లో గోల్డ్ ప్యూరిటీ, క్వాలిటీ టెస్ట్ చేయడం, వివరాలు నమోదు చేయడంలో తేడాలు జరుగుతున్నట్లు ఆర్బీఐ కంపెనీని హెచ్చరించింది. లోన్ టూ వాల్యూ రేషియో ఉల్లంఘిస్తు్న్నట్లు, రూల్స్ వ్యతిరేకంగా తక్కువ బంగారానికి ఎక్కువ లోన్ ఇచ్చి లోన్ తీసుకున్న వారి నుంచి ఎక్కువ వసూలు చేయడం వంటి అవకతవకలు జరుతున్నాయని కంపెనీ యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆర్బీఐ గోల్డ్ లోన్ కంపెనీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వేలం ప్రక్రియకు రూల్స్ పాటించడం లేదని, కస్టమర్స్ నుంచి వసూలు చేసే ఛార్జీలలో పారదర్శకత లోపించిందని ఆర్బీఐ గోల్డ్ లోన్స్ కంపెనీల లోటుపాటులను ఎత్తిచూపింది.కంపెనీలు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉండే విధంగా వెంటనే లిమిటేషన్ రూల్స్ విధించాలని కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్లను ఆదేశించింది. ప్రామాణిక వేలం ప్రక్రియకు కట్టుబడి ఉండకపోవడం; మరియు కస్టమర్ ఖాతాలకు విధించే ఛార్జీలు మొదలైన వాటిలో పారదర్శకత లోపించిందని RBI తెలిపింది.

Business

Wipro: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. విప్రో జాక్‌పాట్.. అమెరికా కంపెనీతో రూ.4500 కోట్ల డీల్‌!

Published

on

Wipro: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో టెక్ కంపెనీలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టెక్, ఐటీ కంపెనీలకు పెద్ద డీల్స్ అంతంమాత్రంగానే ఉంటుండడంతో చాలా కంపెనీలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, ఇటీవల భారతీయ టెక్ కంపెనీలకు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి కంపెనీలు బిగ్ డీల్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో చేరిపోయింది దేశీయ టెక్ దిగ్గజం విప్రో.

ఐటీ సర్వీసెస్ మేజర్ విప్రో తాజాగా అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి సుమారు 550 మిలియన్ డాలర్ల ఆర్డర్ అందుకుంది. ఈ డీల్‌పై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ కాంట్రాక్టు 5 ఏళ్ల పాటు ఉంటుందని, అమెరికా కంపెనీతో 550 మిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది విప్రో. భారత దేశ కరెన్సీలో చూసుకుంటే ఈ డీల్ విలువ సుమారు రూ.4500 కోట్లకుపైగా ఉంటుంది. ఈ డీల్ ద్వారా 5 ఏళ్ల పాటు అమెరికా కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్‌కు కొన్ని ప్రొడక్టులు, పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాల కోసం నిర్వహించే సేవలను అందిస్తుందని ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, ఈ డీల్‌కి సంబంధించిన ఇతర విషయాలేమీ విప్రో బహిర్గతం చేయలేదు.

ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అనిశ్చితిలో ఉన్న క్రమంలో భారీ డీల్ కుదుర్చుకోవడం కంపెనీతో పాటు అందులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సైతం శుభవార్తగానే చెప్పవచ్చు. ప్రాజెక్టులు పెరగడం ద్వారా ఉద్యోగుల తొలగింపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరింత మందికి ఉపాధి లభిస్తుంది. మరోవైపు.. ఈ డీల్‌పై పూర్తి విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు పలు విషయాలు వెల్లడించారు. ఇది 5 ఏళ్ల టైమ్ పీరియడ్ కాంట్రాక్ట్ అని తెలిపారు. ఎంపిక చేసిన ప్రొడక్టులు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్దిష్ట సొల్యూషన్స్ కోసం సర్వీసులు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్టేజీలో మిగిలిన వివరాలను కంపెనీ బహిర్గతం చేయాలనుకోవట్లేదని వెల్లడించారు.

500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉండే పెద్ద డీల్స్, కాంట్రాక్టులు అనేవి టాప్ టైప్ ఐటీ సర్వీసెస్ సంస్థలకు చాలా కీలకంగా ఐటీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్స్ నేరుగా కంపెనీల రెవెన్యూ వృద్దిపై ప్రభావం చూపుతాయి. గత ఆర్థిక ఏడాది క్యూ4లో విప్రో ఇప్పటికే అతిపెద్ద డీల్ 1.2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన కంపెనీ రెవెన్యూ వృద్ధిని 9.5 శాతం మేర పెంచింది.

Continue Reading

Business

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Published

on

వర్క్‌ ఫ్రం హోమ్‌ను పూర్తి స్థాయిలో తొలగించి.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు విభిన్న మార్గాలు అవలంభిస్తున్నాయి. ఆ వివరాలు.

కరోనా వచ్చిన దగ్గర నుంచి పని చేసే విధానం, వాతావరణం పూర్తిగా మారిపోయింది. కోవిడ్‌కు ముందు.. జాబ్‌ అంటే కచ్చితంగా ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఆఫీసు ప్రాంగణంలో నిర్దిష్టమైన పని గంటలు గడపాల్సిందే. అయితే కోవిడ్‌ విజృంభణ తర్వాత.. ఐటీ కంపెనీలు సహా.. చాలా రంగాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఇంటి నుంచే పని విధానం అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్‌ విధింపు, ఆంక్షల నేపథ్యంలో కంపెనీలు మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు తమ ఓటు వేశాయి. సుమారు మూడేళ్లుగా ఐటీ కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం కొనసాగుతోంది. ఇప్పుడు కరోనా భయం తొలగిపోయింది.. వ్యాక్సినేషన్‌ కూడా పూర్తయ్యింది. దాంతో ఇన్నాళ్లు వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతిచ్చిన కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా కోరుతున్నాయి. చాలా కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను పూర్తిగా తీసేశారు.

కానీ ఐటీ కంపెనీల్లో మాత్రం ఇది ఇంకా కొనసాగుతేనే ఉంది. ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులను కోరుతున్నప్పటికి వారు పెద్దగా స్పందించడం లేదు. దాంతో హైబ్రీడ్‌ మోడల్‌ను అమలు చేస్తున్నారు. అంటే వారంలో కచ్చితంగా మూడు రోజులు ఆఫీసుకు రావల్సిందే. ఇక నెమ్మదిగా దీన్ని కూడా తొలగించే ప్రయత్నాల్లో ఉన్నాయి ఐటీ కంపెనీలు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రప్పించడం కోసం అనేక మార్గాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని కంపెనీలు అయితే ఏకంగా జీతంలో కోతలు విధించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు..

కాగ్నిజెంట్‌..
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌.. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఓ యాప్‌ను తీసుకువచ్చింది. ఉద్యోగుల రాకపోకలను గమనించడానికి ఉద్దేశించి.. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లెక్సీసీట్‌ అనే యాప్‌ను తీసుకుంచ్చింది. దీని ద్వారా మేనేజర్స్‌.. టీమ్‌, పని అవసరాల మేరకు రోస్టర్‌ తయారు చేస్తారు. అలనే కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు కనీసం వారంలో మూడు రోజులైనా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది అని తెలిపారు

టీసీఎస్‌..
వర్క్‌ ఫ్రం హోమ్‌ను పూర్తి స్థాయిలో మాన్పించి.. ఉద్యోగులను ఆఫీసుకు వచ్చేలా చేయడం కోసం టీసీఎస్‌ కాస్త కఠిన నిర్ణయమే తీసుకుంది. గత నెల వరకు కూడా హైబ్రీడ్‌ విధానం.. అంటే వారంలో మూడు రోజులు ఆఫీసు పద్దతిని అవలంభించిన కంపెనీ.. దాన్ని పూర్తి స్థాయిలో ఎత్తి వేసింది. ఇకపై ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు రావల్సిందేనని.. లేదంటే జీతంలో కోతలు విధిస్తామని హెచ్చరించింది.

Advertisement

విప్రో..
ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడం కోసం విప్రో సరికొత్త విధానాన్ని ఎంచుకుంది. వారు ఇంటి వద్ద నుంచి పని చేసే వీలు లేకుండా.. కేవలం ఆఫీసు నుంచే పని చేసేలా సరికొత్త విధానాలను అమలు చేయడానికి రెడీ అవుతోంది. ఈమేరకు చీఫ్‌ హెచ్‌ఆర్‌ఓ సౌరభ్‌ గోవిల్‌ దీనిపై ప్రకటన చేశారు.

ఇన్ఫోసిస్‌..
ఇక ఇన్ఫోసిస్‌.. ఉద్యోగుల అనుభవాలును వెల్లడించే ప్లాట్‌ఫామ్‌ ఇన్ఫిమీ ద్వారా.. కొన్ని విభాగాల ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌ను అనుమతించేందుకు రెడీ అయ్యింది. గత ఏడాది ఇన్ఫోసిస్‌.. కొందరు జూనియర్లు. మిడ్‌ లెవల్‌ ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందిగా కోరింది.

Continue Reading

Business

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Published

on

ముఖేష్ అంబానీ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పాడు. కేవలం 299 రూపాయలు చెల్లించి.. ఏడాదంతా సర్వీసు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇంత తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకురావడం సంచలనంగా మారింది.

ఇంతకు అంబానీ తెచ్చిన ప్లాన్‌ దేని గురించి.. ఎవరికి వర్తిస్తుంది.. దీనిలో లభించే సేవలు ఏంటి అనే పూర్తి వివరాలు మీకోసం..

ఇక ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న జియో.. ఓటీటీ రంగంలో కూడా దూసుకుపోవాలని భావిస్తోంది. ఇందుకోసం తన పాత స్ట్రాటజీనే వినియోగిస్తుంది. జియో టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉచిత సిమ్ములు.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా, కాలింగ్‌ ప్యాక్‌లను తీసుకువచ్చి.. అప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌లకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఇక జియో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలు కూడా దిగి రాక తప్పలేదు. దాంతో కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా అందుబాటులోకి వచ్చింది. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఓటీటీల రంగంలో అమలు చేయడానికి రెడీ అవుతోంది జియో.

ఈ క్రమంలో ఇప్పటికే ఓటీటీ రంగంలో ముందు వరుసలో ఉన్న నెట్‌ఫ్లిక్స్-అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ సరికొత్త ప్లాన్‌ వేశారు. దీనిలో భాగంగా రిలయన్స్ జియో తన ఓటీటీ వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ ప్రీమియం యాన్యువల్ పేరుతో కొత్త యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇక ఈ ప్లాన్ వార్షిక ధర కేవలం 299 రూపాయలు మాత్రమే కావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వార్షిక ప్లాన్‌లకు వేలకు వేలు ఖర్చవుతుండగా, ముఖేష్ అంబానీ కేవలం రూ. 299కి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా వార్షిక ప్లాన్‌ను ప్రారంభించడం.. ఈ కంపెనీలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

రూ.299తో ఏడాదంతా..

Advertisement

జియో 299 యాన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ గురించి ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం.. రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం.. కొత్త యాడ్‌ ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తక్కువ ధరకే తీసుకువచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ కొత్త యాడ్ ఫ్రీ ప్లాన్ ధర 12 నెలల కాలానికి గాను కేవలం రూ.299 మాత్రమే. ప్రకటన రహిత కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.

జియో ప్రీమియం వార్షిక ప్రణాళిక

కొత్త ప్రీమియం వార్షిక ప్లాన్‌తో మీరు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రకటనలు లేకుండా ‘ప్రీమియం’తో సహా మొత్తం కంటెంట్‌ను చూడవచ్చు. ఇది కాకుండా మీరు 4కే నాణ్యతతో కూడిన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. మీరు మొబైల్ యాప్‌లో ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్‌లో కనెక్ట్ చేయబడిన టీవీతో సహా ఏదైనా గాడ్జెట్‌లో ప్రత్యేకమైన సిరీస్‌లు, చలనచిత్రాలు, హాలీవుడ్ కంటెంట్, పిల్లల షోలు, టీవీ కార్యక్రమాలు చూసే సదుపాయం ఉంది.

ఈ 299 వార్షిక ప్రీమియం జియోసినిమా ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీరు జియోసినిమా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా దీనిని సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక స్క్రీన్ లేదా అంతకంటే ఎక్కువ వాటికి యాక్సెస్‌ను అందిస్తుందా లేదా అనే దాని గురించి జియో న ఉంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇ​క నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే.. వీటి నెల వారి సబ్‌స్క్రిప్షన్ పొందడానికి రూ.99-రూ.149 వరకు చెల్లించాలి. దీని తర్వాత, ఫీచర్లు, వీడియో నాణ్యత ప్రకారం ప్లాన్ ధర పెరుగుతూనే ఉంటుంది. వీటితో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే జియో ఏడాది పాటు కంటెంట్‌ చూసే అవకాశం కల్పిస్తోంది.

Advertisement
Continue Reading
International5 hours ago

‘మౌస్ జిగ్లింగ్‌’కు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ.. ‘మౌస్ జిగ్లింగ్‌’ అంటే ఏంటో తెలుసా?

National6 hours ago

నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. ఎఫ్ఐఆర్ నమోదు

National6 hours ago

నకిలీ కరెన్సీతో గిరిజనులకు మావోల మోసం- పెద్దఎత్తున డబ్బులు స్వాధీనం

National6 hours ago

కల్తీసారా బాధితులు కేర్​ లెస్​- లిమిట్​కు మించి తాగడం వల్లే!: కమల్ హాసన్​

National6 hours ago

సోమవారం నుంచే లోక్‌సభ తొలి సెషన్​- మోదీ ప్రమాణస్వీకారం అప్పుడే- తెలుగు ఎంపీలు ఎప్పుడంటే? – 18th Lok Sabha First Session

Andhrapradesh6 hours ago

సామాన్యులకు కూర’గాయాలు’ – vegetables prices in AP

National6 hours ago

Reservation Cancel: 65 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు.

Andhrapradesh6 hours ago

Andhra Pradesh: మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన

Political6 hours ago

బీఎస్పీ ఛీఫ్ కీలక నిర్ణయం.. వారసుడిని ప్రకటించిన మాయావతి

Cricket6 hours ago

IND vs AUS Pitch Report: డారెన్ సామీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ చూస్తే పరేషానే.. ఎందుకో తెలుసా?

Technology7 hours ago

విజయవంతమైన పుష్పక్ విమానం

Railway22 hours ago

వృద్ధులు గర్భిణులకు గుడ్ …న్యూస్ రైల్వే ప్రయాణాల్లో వెసలు బాటు

National1 day ago

కేంద్రం సంచలన నిర్ణయం ….సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.

Andhrapradesh1 day ago

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి

National2 days ago

కేజ్రీవాల్​కు మళ్లీ షాక్​- బెయిల్​పై దిల్లీ హైకోర్టు స్టే – Delhi HC stays Arvind Kejriwal Bail

International2 days ago

చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

International2 days ago

Overseas Indians: డాలర్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తేసిన ఎన్నారైలు – ఒక్క నెలలో రూ.9 వేల కోట్లు డిపాజిట్‌

Andhrapradesh3 days ago

ఋషికొండ నాకే ఇవ్వండి చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చిన సుకేష్

Cinema3 days ago

Anupam Kher : బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు.. వీడియో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్

National3 days ago

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

National3 days ago

Infosys Offered: ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు.!

National3 days ago

మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం – international yoga day

National3 days ago

‘నీట్​ పేపర్​ లీకేజీ నిజమే- పరీక్ష ముందురోజే విద్యార్థుల చేతికి ప్రశ్నాపత్రాలు- రూ.30లక్షలకు బేరం’ – neet ug 2024 controversy

Andhrapradesh3 days ago

అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు నుండి

Andhrapradesh3 days ago

Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం

Andhrapradesh4 days ago

కొత్త సలహాదారుల నియామకం… ఏ బి తో సహా

Andhrapradesh4 days ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

Weather4 days ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

Technology4 days ago

WhatsApp AR Features : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఏఆర్ ఫీచర్లు.. వీడియో, ఆడియో కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు..!

Andhrapradesh4 days ago

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! – AP MINISTERS

Business4 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career4 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business4 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business4 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

News4 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

National2 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Education2 weeks ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Crime News2 weeks ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

National2 weeks ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National2 weeks ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh2 weeks ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National4 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh2 weeks ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh2 weeks ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

National2 weeks ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Telangana4 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 weeks ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Andhrapradesh2 weeks ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Spiritual2 weeks ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Political2 weeks ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Political7 days ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Spiritual2 weeks ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Business4 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh2 weeks ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

National2 weeks ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 weeks ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh4 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

Spiritual4 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

News2 weeks ago

Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Andhrapradesh2 weeks ago

AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!

Trending