OTT Movies
Onavillu OTT: ‘అనంతపద్మనాభ స్వామి’ ఆలయంపై డాక్యుమెంటరీ.. ఈ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్..
ఓటీటీల్లో సినిమాలు, సిరీస్ లతో పాటు అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంటరీలు కూడా రిలీజవుతుంటాయి. గతంలో గోదావరి నది మీద ఆహాలో వచ్చిన డాక్యుమెంటరీ అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడిదే బాటలో మరో ఆసక్తికరమైన డాక్యుమెంటరీ అందుబాటులోకి వచ్చింది. తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ ఆలయంలోని నేలమాళిగల్లోని వెలకట్టలేని సంపదలు, నిధులు ఉన్నాయని, ఇంకా ఒక గదిని తెరవలేదని వార్తలు వచ్చాయి.
నాగ బంధనం వేసి ఉండడంతో ఆ గది తెరవడానికి సాధ్యపడదని పండితులు చెబుతున్నారు. ఈ గదిలో అనంతమైన సంపద ఉందని తెలుస్తోంది. ఇలా ఎన్నో రహస్యాలు, విశేషాలతో కూడిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి చాలా మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడీ ఆలయం విశేషాలను, రహస్యాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చింది. అదే ‘ఒనవిల్లు: ది డివైన్ బో’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా ఈ డాక్యుమెంటరీని ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. మార్చి 8 నుంచి ఈ ఒనవిల్లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం మలయాళం భాషలో మాత్రమే ఈ డాక్యుమెంటరీ అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండడం వల్ల ఇతర భాషల వారు కూడా ఈ డాక్యుమెంటరీని చూసేయవచ్చు.
ప్రముఖ నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఒన విల్లు.. ది డివైన్ బ్రో డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, అలాగే యంగ్ హీరో ఉన్ని ముకుందన్‌లు ఈ డాక్యుమెంటరీకి తమ వాయిస్ ను అందించడం విశేషం. ఒక ఒనవిల్లు అనే పేరు విషయానికి వస్తే.. పద్మనాభస్వామి ఆలయ స్వామికి ‘ఓనవిల్లు’ అనే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరినే ‘ఒన్వవిల్లు కుటుంబం’ అంటారు. సంప్రదాయం ప్రకారం ఈ విల్లును తయారుచేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందుకు 41 రోజుల కఠిన తపస్సు చేస్తారట. ఇలాంటి ఎన్నో విశేషాలు, వింతలను ఈ డాక్యుమెంటరీలో వీక్షించవచ్చు.
Entertainment
Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ వర్కౌట్ అయింది.. కొత్తగా చేరిన 9.33 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు..!
Netflix Subscribers : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన తర్వాత 2024 మొదటి త్రైమాసికంలో 9.33 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందింది. గ్లోబల్ యూజర్ బేస్‌లో ఇదే గణనీయమైన పెరుగుదలగా చెప్పవచ్చు. స్ట్రీమింగ్ దిగ్గజం పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధం నేపథ్యంలో కొత్త సబ్‌స్క్రైబర్‌లు భారీ సంఖ్యలో పెరిగారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ అంచనాలను మించిపోయింది. విశ్లేషకుల అంచనాలను కూడా దాదాపు రెట్టింపు చేసింది.
మార్చి నాటికి 269.6 మిలియన్లు :
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు మార్చి నెలాఖరు నాటికి 269.6 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి కొత్త కస్టమర్లతో నెట్‌ఫ్లిక్స్ పుంజుకుంది. సగటున ప్రతి ఇంటికి ఇద్దరు కన్నా ఎక్కువ మంది యూజర్లతో అర బిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారని కంపెనీ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంతకు ముందు ఏ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఈ స్థాయిలో రాణించలేదని తెలిపింది. అనధికారిక అకౌంట్ల వినియోగాన్ని పరిష్కరించడంలో నెట్‌ఫ్లిక్స్ దృఢమైన వైఖరి ఈ అద్భుతమైన విజయానికి కారణమని నివేదిక తెలిపింది.
దాదాపు 100 మిలియన్ల మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు నేరుగా సబ్‌స్క్రైబ్ చేయకుండా వేరొకరి అకౌంట్లను ఉచితంగా ఉపయోగిస్తున్నారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఆదాయపరంగా, చెల్లింపు చందాదారులను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగ్ విధానంపై పరిమితులు విధించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం సబ్‌స్క్రైబర్ కాకుండా కంపెనీ ఆదాయం, ఆపరేటింగ్ మార్జిన్‌లపై దృష్టి పెట్టాలని పెట్టుబడిదారులను కోరినట్లు రాయిటర్స్ నివేదించింది.
OTT Movies
OTT Releases this week: ఈ వారమే ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఆ హారర్ వెబ్ సిరీస్ కూడా..
OTT Releases this week: వచ్చే లాంగ్ వీకెండ్ లో ఓటీటీ ప్రేక్షకులకు టైంపాస్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఇందులో సూపర్ హిట్ మలయాళం మూవీ ప్రేమలు కూడా ఉంది. ఇక ప్రైమ్ వీడియోలో ఇన్‌స్పెక్టర్ రిషి అనే కొత్త వెబ్ సిరీస్ కూడా వస్తోంది. శుక్రవారం (మార్చి 29) గుడ్ ఫ్రైడే హాలిడే కూడా ఉండటంతో ఈ లాంగ్ వీకెండ్ ఓటీటీల్లోని ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ చూసేయండి.
ప్రేమలు – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రేమలు మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు శుక్రవారం (మార్చి 29) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగుతోనూ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది.
ఇన్‌స్పెక్టర్ రిషి -ప్రైమ్ వీడియో
నవీన్ చంద్ర నటించిన హారర్, క్రైమ్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఈ మధ్యే ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన తమ ఒరిజినల్స్ లో ఇదీ ఒకటి. శుక్రవారం (మార్చి 29) నుంచి ఈ కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో క్రైమ్ డ్రామా థ్రిల్లర్ కథాంశంతో ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ తమిళంలో తెరకెక్కింది. ఈ వెబ్‌సిరీస్‌కు సుఖ్‌దేవ్ లహిరి దర్శకత్వం వహించాడు. తమిళంతోపాటు తెలుగు, మరో ఇతర మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
లవర్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
తమిళ సూపర్ హిట్ మూవీ లవర్ కూడా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. పట్నా శుక్లా – డిస్నీ పస్ల్ హాట్‌స్టార్
బాలీవుడ్ సీనియర్ రవీనా టండన్ నటించిన పట్నా శుక్లా మూవీ శుక్రవారం (మార్చి 29) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ తిరిగే కథతో మూవీ రాబోతోంది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో – నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కొత్త షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే ఆదివారం (మార్చి 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్లు వస్తాయి.
లూటేరే – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
లూటేరే వెబ్ సిరీస్ గత శుక్రవారమే (మార్చి 22) హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. అయితే తొలి రెండు ఎపిసోడ్లను మాత్రమే ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. మూడో ఎపిసోడ్ గురువారం (మార్చి 28) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా బుధవారం (మార్చి 27) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Entertainment
Netflix: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్.. 18 దేశాల్లో ట్రెండింగ్
Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ది ఇంద్రాణి ముఖర్జియా బరీడ్ ట్రూత్ సిరీస్ దూసుకెళుతోంది. ట్విస్టులతో కూడిన ఈ డాక్యు సిరీస్‍కు వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. చాలా దేశాల్లో ట్రెండ్ అవుతోంది.
ఇటీవలి కాలంలో ఓటీటీల్లో డాక్యుమెంటరీ సిరీస్‍లకు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్‍లపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్‍కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. అందులోనూ ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండడంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.
ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ సిరీస్‍పై మొదటి నుంచే చాలా మందికి ఆసక్తి నెలకొంది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సిరీస్ ఫిబ్రవరి 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ప్రారంభం నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
గ్లోబల్ రేంజ్‍లో..
ది ఇంద్రాణి ముఖర్జియా డాక్యు సిరీస్‍కు నానాటికీ వ్యూస్ పెరుగుతున్నాయి. భారత్‍తో పాటు కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‍లో టాప్-7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యు సిరీస్‍కు 2.2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది.
మొత్తంగా అంచనాలకు మించి ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ దుమ్మురేపుతోంది. షీనా బోరా హత్య కేసులో చాలా ట్విస్టులు ఉండడం, దాన్ని ఈ సిరీస్‍లో ఎఫెక్టివ్‍గా చూపించడంతో భారీ ఆదరణ దక్కించుకుంటోంది.
కోర్టులో కేసు తర్వాత..
ది ఇంద్రాణి ముఖర్జియా సిరీస్ కోర్టు కేసులను ఎదుర్కొంది. షీనా బోరా కేసు విచారణ దశలో ఉండటంతో ఈ సిరీస్‍ను ఆపాలని కోర్టుకు వెళ్లింది సీబీఐ. కింది కోర్టు నిరాకరించడంతో బాంబే హైకోర్టుకు కూడా వెళ్లింది సీబీఐ. ముందుగా సీబీఐ అధికారులకు స్క్రీనింగ్ తర్వాత.. ఈ సిరీస్ ఎట్టకేలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. వారం ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. 2012 ఏప్రిల్‍లో షీనా హత్యకు గురయ్యారు. అయితే, మూడేళ్ల తర్వాత 2015లో ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. వేరే కేసులో పట్టుడిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ ఈ హత్య గురించి సమాచారం పోలీసులకు చెప్పాడు. దీంతో షీనా హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను 2015లో అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్య సంజీవ్ ఖన్నా, డ్రైవర్ సహా మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ సాగిన కొద్దీ నెవ్వెర పరిచే విషయాలు బయటికి వచ్చాయి. దీంతో దేశం దృష్టిని ఈ కేసు ఆకర్షించింది. ఇంద్రాణి ముఖర్జియా సుమారు ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. 2022లో ఆమెకు బెయిల్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె బయటే ఉన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు కూడా బెయిల్ మంజూరైంది. అయితే, సీబీఐ ఈ కేసు విచారణను కొనసాగిస్తోంది.
-
Business6 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career6 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News6 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business6 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business6 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International6 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education6 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National6 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh5 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News6 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana6 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National6 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National6 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh6 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National6 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National6 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh6 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political6 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National6 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
National6 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh6 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Business6 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International7 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh6 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways5 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh5 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh6 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
International6 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh5 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Business6 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Spiritual6 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!