National
Lok Sabha Elections : బీజేపీని బీజేడీ అడ్డుకోగలదా? ఒడిశాలో కాంగ్రెస్‌కు ‘టాటా- బైబై’ తప్పదా!
Odisha Lok Sabha elections 2024 : ఒడిశాలో బీజేడీ- బీజేపీ పొత్తుకు తెరపడింది. మరి ఈసారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీని.. బీజేడీ అడ్డుకోగలుగుతుందా? కాంగ్రెస్ పరిస్థేంటి?
2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులు- ఎత్తులు- పైఎత్తులతో పార్టీలన్నీ బిజీబిజీగా గడుపుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఒడిశా రాజకీయాలు గత కొన్ని రోజులుగా రసవత్తరంగా మారాయి. బీజేడీ- బీజేపీ మధ్య పొత్తు కుదిరినట్టే కుదిరి.. చివరి నిమిషంలో ఆగిపోయింది! ఈ పరిణామాలు లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపిస్తాయి? రాష్ట్రంపై వేగంగా పట్టు సాధిస్తున్న బీజేపీని.. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అడ్డుకోగలరా?
2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు..
లోక్‌సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో ఒడిశా రాష్ట్రంలో 21 సీట్లు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. నవీన్ పట్నాయక్‌కి చెందిన బీజేడీ (బిజు జనతాదళ్).. 12 సీట్లల్లో గెలిచింది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి ఒక్క సీటు దక్కింది.
వాస్తవానికి.. ఒడిశాలో అనాదిగా.. నవీన్ పట్నాయక్ పాలన సాగుతోంది. 2 దశాబ్దాల పాటు రాష్ట్రంపై ఆయన పట్టు కొనసాగుతూ వస్తోంది. కానీ 2019లో బీజేడీకి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి! ‘మోదీ మేనియా’.. ఒడిశాపై ఊహించని విధంగా పనిచేసిందనే చెప్పొచ్చు. 2014లో బీజేపీ కేవలం ఒక్కటే సీటులో గెలిచింది. కానీ.. 2019 వచ్చేసరికి 8చోట్ల కాషాయ జెండాను ఎగరవేసింది. ఇది బీజేడీకి తలనొప్పిగా మారిన విషయం.
ఇంకా చెప్పాలంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటు షేరు విషయంలోనూ బీజేడీకి గట్టిపోటీనిచ్చింది కమలదళం. నవీన్ పట్నాయక్ పార్టీకి 42.8శాతం ఓట్లు దక్కాయి. 38.4శాతంతో ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఉంది.
ఇక ఒడిశాపై కాంగ్రెస్ పట్టు అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. 2014లో యూపీఏ ఖాతా తెరవలేదు. 2019లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే సీటు దక్కింది.
బీజేడీ వర్సెస్ బీజేపీ..
2024 Odisha assemebly elections : బీజేడీ, బీజేపీలు వాస్తవానికి చాలా కాలం పాటు కలిసే ఉన్నాయి. 1998 నుంచి 2009 వరకు.. అటు రాష్ట్ర ఎన్నికలు ఇటు లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. 1990 దశకంలో.. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు నవీన్ పట్నాయక్. కానీ 2009 వచ్చేసరికి రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. చివరికి.. కూటమికి బీజేడీ గుడ్‌బై చెప్పేసింది.
కానీ 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది! తొలుత.. ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తున్నాయని వార్తలు వచ్చాయి. బీజేపీ నేతలు కూడా మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ సీటు సద్దుబాటు దగ్గర రెండు పార్టీలకు విభేదాలు ఎదురయ్యాయని సమాచారం! చివరికి.. రాష్ట్రం ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు.. బీజేడీతో కలవడం లేదని, ఒంటరిగా పోటీ చేస్తున్నామని బీజేపీ ప్రకటించింది.
రూమర్స్ ప్రకారం.. 21 లోక్‌సభ సీట్లల్లో 14 చోట్ల పోటీ చేయాలని బీజేపీకి భావించింది. ఇది బీజేడీకి నచ్చలేదు. ఇక 147 సీట్లు ఉండే ఒడిశా అసెంబ్లీలో 100కుపైగా సీట్లల్లో పోటీ చేయాలని నవీన్ పట్నాయక్ బీజేడీ అనుకుంది. ఇది.. బీజేపీకి నచ్చలేదు! చివరికి.. బీజేడీ- బీజేపీ కలయిక సాధ్యపడలేదు!
“10 కన్నా తక్కువ లోక్‌సభ సీట్లల్లో పోటిచేస్తే.. అది సూసైడే అవుతుంది,” అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు.. లోక్‌సభతో పాటు రాష్ట్ర ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన చేస్తామని బీజేపీ చాలా నమ్మకంతో ఉంది. తమ పార్టీకి చెందిన 80 ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని కమలదళం ప్రచారాలు చేస్తోంది. అందుకే.. బీజేడీ ఇచ్చిన సీట్లను తిరస్కరించినట్టు తెలుస్తోంది.
అయితే.. ఒడిశా ‘రాజకీయా’ల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ- బీజేడీలు కూటమిగా లేకపోయినా.. కేంద్రంలో మోదీకి నవీన్ పట్నాయక్ అనేకమార్లు మద్దతుగా నిలిచారు. నవీన్ పట్నాయక్- మోదీలు ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది.. వారిద్దరి మధ్య బలమైన బంధాన్ని స్పష్టం చేస్తోంది.
నవీన్ పట్నాయక్ మనసులో ఏముంది?
BJP BJD alliance Odisha : ఓ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు సీఎంగా పనిచేసిన వారి జాబితాలో రెండోస్థానంలో ఉన్నారు నవీన్ పట్నాయక్. త్వరలో జరగనున్న 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారాన్ని చేపడితే.. నెం.1 స్థానానికి చేరుకుంటారు. కానీ రాష్ట్రంలో బీజేపీ శక్తివంతంగా ఎదుగుతుండటం.. ఆయనకు కచ్చితంగా తలనొప్పిని తెచ్చిపెట్టే విషయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరీ ముఖ్యంగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలంగా పుంజుకున్న తీరు.. బీజేడీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా.. భువనేశ్వర్‌లో కాషాయ జెండా తొలిసారిగా ఎగరడటం.. నవీన్ పట్నాయక్‌కి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఆయన కూడా.. దానిని వ్యక్తిగత నష్టంగానే తీసుకున్నారట. ఈసారి చర్చలు విఫలమవడంలో ఈ భువనేశ్వర్ లోక్‌సభ సీటు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. భూవనేశ్వర్ సీటు తమకు కావాలని బీజేడీ తేల్చిచెబితే.. అస్సలు ఇవ్వమని బీజేపీ స్పష్టం చేసేసిందట. మరి బీజేపీపై గెలిచేందుకు నవీన్ పట్నాయక్.. ఈ సారి ఎలాంటి అస్త్రాలను రూపొందిస్తారో చూడాలి.
కాంగ్రెస్ పరిస్థితేంటి..?
ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభ ఎన్నికలైనా ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు బీజేడీ, బీజేపీ. రాష్ట్రంలో.. కాంగ్రెస్ ఉనికిని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో.. పార్టీకి చాలా తక్కువ ఓటు పర్సెంటేజ్ నమోదైంది. 147 సీట్లు ఒడిశా అసెంబ్లీలో కూడా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది తొమ్మిది మాత్రమే!
బీజేపీ- బీజేడీలు కలిసినా, విడిపోయినా.. తమకే మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతొందని అంటున్నారు. కానీ.. ఆ రెండు పార్టీలపై ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మార్చుకోవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో మొదటి రెండు పార్టీలు, కాంగ్రెస్ ఓట్ల శాతం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఏది ఏమైనా.. ఈసారి ఒడిశాలో రాజకీయాలు వాడీవేడీగా ఉండనున్నాయి! ఇందులో విజయం ఎవరు సాధిస్తారు? బీజేడీ పుంజుకుంటుందా? లేక బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందా? ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తారా? అనేది వేచి చూడాలి!
National
స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…
కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Kerala – National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK
— Shilpa (@shilpa_cn) August 16, 2024
ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.
National
Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
National
ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?
Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్‌తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.
పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు.
-
Business6 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career6 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News6 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business6 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business6 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International6 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education6 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National6 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh5 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News6 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana6 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National6 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National6 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh6 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National6 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National6 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh6 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political6 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National6 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
National6 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh6 months ago
ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Business6 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International7 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh6 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways5 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh5 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh6 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
International6 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh5 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Business6 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Spiritual6 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!