Connect with us

National

Lok Sabha Election 2024 : ఆరో విడత పోలింగ్ షురూ.. ఓటింగ్ జరిగే రాష్ట్రాలు, నియోజకవర్గాలు ఇవే ?

Published

on

Lok Sabha Election 2024 Phase 6 Voting : దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఆరో విడత శనివారం కొనసాగుతుంది. ఇవాళ మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆరో విడత పోలింగ్ ప్రక్రియ పూర్తయితే 486 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది.

ఇదిలాఉంటే.. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన అనంతనాగ్ -రాజౌరీ స్థానంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఈసీ బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు.. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది.

పోలింగ్ జరిగే రాష్ట్రాలు.. నియోజకవర్గాలు..

  • ఆరో విడత పోలింగ్ 58 స్థానాల్లో జరుగుతుంది. వీటిలో యూపీలో 14, హర్యానాలో 10, బీహార్ లో ఎనిమిది, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, జార్ఖండ్ లో నాలుగు, జమ్ము కశ్మీర్ లో ఒక స్థానంకు పోలింగ్ జరుగుతుంది.
  • బీహార్ : వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివహర్, వైశాలి, గోపాల్ గంజ్, సివాన్, మహారాజ్ గంజ్.
  • హర్యానా : అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ – మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్.
  • ఝార్ఖండ్ : గిరిడి, ధన్ బాద్, రాంచీ, జంషెడ్ పూర్.
  • ఒడిశా : సంబల్ పూర్, కియోంజర్, దెంకనల్, కటక్, పూరి, భువనేశ్వర్.
  • ఉత్తరప్రదేశ్ : సుల్తాన్ పూర్, ప్రతాగఢ్, ఫుల్ పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి. దమారియాగంజ్, బస్తర్, సంత్ కబీర్ నగర్, లాల్ గంజ్, అజంగఢ్, జౌన్ పూర్, మచ్లిషహర్, భదోహి.
  • పశ్చిమ బెంగాల్ : తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్గ్రామ్, మేదినీపూర్, పూరూలియా, బంకురా, బిష్ణుపూర్.
  • ఢిల్లీ : చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ.
  • జమ్మూ అండ్ కశ్మీర్ : అనంతనాగర్ – రాజౌరి.
  • పోటీలో ప్రముఖులు ..

  • ఆరో దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రముఖులు కూడా పోటీలో ఉన్నారు.
  • ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్.
  • కర్నాల్ నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.
  • ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ.
  • న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్.
  • హర్యానాలోని సిర్సా నుంచి కుమారి శైలజ.
  • హర్యానాలోని రోహ్ తక్ నుంచి దీపేంద్ర సింగ్ హుడా.
  • ఢిల్లీలోని చాందినీచౌక్ నుంచి జేపీ అగర్వాల్.
  • ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్.
  • న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి పోటీలో ఉన్నారు
  • National

    స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

    Published

    on

    కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


    ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.

    Continue Reading

    National

    Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

    Published

    on

    భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్‌-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్‌-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.

    పోస్టుల వివరాలు ఇలా..
    లెవెల్‌-4/5 పోస్టులు: 5
    లెవెల్‌-2/3 పోస్టులు: 16
    లెవెల్‌-1 పోస్టులు: 43
    ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    Continue Reading

    National

    ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

    Published

    on

    Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్‌తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.

    పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు.

    Continue Reading
    Andhrapradesh2 weeks ago

    విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

    Latest2 weeks ago

    ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

    Education2 weeks ago

    ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

    Spiritual2 weeks ago

    తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

    Andhrapradesh2 months ago

    Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

    Andhrapradesh2 months ago

    TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

    Andhrapradesh2 months ago

    Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

    Spiritual2 months ago

    కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

    National2 months ago

    స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

    National2 months ago

    Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

    National2 months ago

    ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

    Andhrapradesh2 months ago

    NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

    International2 months ago

    యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

    Hashtag2 months ago

    Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

    International2 months ago

    రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

    National2 months ago

    78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

    National2 months ago

    UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

    Andhrapradesh2 months ago

    AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

    International2 months ago

    ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

    International2 months ago

    ‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

    International2 months ago

    Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    Technology2 months ago

    WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

    National2 months ago

    2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

    National2 months ago

    ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

    International2 months ago

    Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

    National2 months ago

    PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

    Telangana2 months ago

    Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

    Andhrapradesh2 months ago

    PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

    Andhrapradesh2 months ago

    Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

    Cricket2 months ago

    Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

    Business5 months ago

    Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

    Career5 months ago

    విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

    National6 months ago

    IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

    News5 months ago

    జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

    Business5 months ago

    ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

    Business5 months ago

    ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

    Education4 months ago

    వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

    International5 months ago

    ‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

    National4 months ago

    Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

    Andhrapradesh4 months ago

    జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

    Andhrapradesh4 months ago

    ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

    Crime News4 months ago

    జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

    Spiritual4 months ago

    Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

    Telangana5 months ago

    Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

    National5 months ago

    అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

    Railways4 months ago

    పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

    Andhrapradesh4 months ago

    పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

    National4 months ago

    నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

    National4 months ago

    కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

    National4 months ago

    ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

    Andhrapradesh4 months ago

    250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

    Political4 months ago

    పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

    Political4 months ago

    కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

    Andhrapradesh4 months ago

    వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

    Andhrapradesh4 months ago

    సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

    Andhrapradesh4 months ago

    SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

    Andhrapradesh4 months ago

    ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

    National5 months ago

    Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

    Weather4 months ago

    జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

    Education4 months ago

    ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

    Trending