National
Indian Railways: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఏదో తెలుసా.? ఈ స్టేషన్ నుంచి..
దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది.? ఏ రాష్ట్రంలో ఉంది.? అక్కడి నుంచి ఏయే ప్రాంతాలకు సేవలు అందుబాటులో ఉన్నాయి లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి…
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతీయు రైల్వే వ్యవస్థ. దేశంలో ప్రతిరోజూ లక్షల మందిని రైల్వేలు గమ్య స్థానానికి చేరవేస్తున్నాయి. ఎక్కు దూరం ప్రయాణించడానికి దేశంలో ఎక్కువ మంది ఉపయోగించేది రైళ్లేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా దేశంలో వేలాది మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే కావడం విశేషం, దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రానికి రైల్వే అందుబాటులో ఉంది. ఇక ఎన్నో విశేషాలకు ఇండియన్ రైల్వే పెట్టింది పేరు.
ఇదిలా ఉంటే దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది.? ఏ రాష్ట్రంలో ఉంది.? అక్కడి నుంచి ఏయే ప్రాంతాలకు సేవలు అందుబాటులో ఉన్నాయి లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్లో మీరు 24 గంటలూ రైల్లు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడి నుంచి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశం వైపు వెళ్లే ప్రతీ రైలు ఈ స్టేషన్ మీదుగా వెళుతుంది.
అంతేకాకుండా ఇక్కడి నుంచి జమ్మూ-కశ్మీర్, కన్యాకుమారి వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. 1875లో మధుర జంక్షన్లో మొదటిసారిగా రైల్వే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మధుర రైల్వే స్టేషన్ ఉత్తర మధ్య రైల్వేలో భాగం. ఈ రైల్వే స్టేషన్ నుంచి 7 మార్గాల్లో రైళ్లు నడుస్తాయి, వీటిలో దాదాపు అన్ని దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఉన్నాయి. మధుర చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, దీని గుండా రైళ్లు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైళ్లు మధుర జంక్షన్ గుండా వెళుతాయి. దేశంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్‌నుగా పేరు గాంచిన మధుర స్టేషన్ నుంచి ప్రతి గంటకు ఒక రైళ్లు అందుబాటులో ఉంటుంది.. ఇది చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, ప్రతి గంటకు ఒక రైలు ఒక దిశలో లేదా మరొక వైపు వెళ్లడాన్ని చూడవచ్చు. మథుర చుట్టుపక్కల నగరాల నుండి కూడా రైలు కోసం మధుర రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.
National
స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…
కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Kerala – National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK
— Shilpa (@shilpa_cn) August 16, 2024
ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.
National
Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
National
ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?
Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్‌తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.
పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు.
-
Business5 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career5 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News5 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
National6 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business5 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business5 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education5 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
International6 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National5 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh4 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh5 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Crime News5 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Telangana5 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual5 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National5 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways5 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National5 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National5 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh5 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National5 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh5 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh5 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh5 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political5 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political5 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh5 months ago
ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే మంత్రులు వీరే…
-
National5 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
National6 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Business5 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema8 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Weather5 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education5 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh9 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh5 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International6 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh5 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways4 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh5 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
News6 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News5 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News5 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh5 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Cinema5 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Andhrapradesh5 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International5 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh4 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International5 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Spiritual5 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!