Connect with us

Cricket

IND vs PAK: చరిత్ర సృష్టించిన రోహిత్ సేన.. టీ20ల్లో డేంజరస్ టీంగా రికార్డ్.. అదేంటంటే?

Published

on

న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏ పోరులో టీమిండియా ఉత్కంఠ విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో టీ20ల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది. అంతకుముందు 2012లో 133/9 అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. అయితే, న్యూయార్క్‌లో ఈ అత్యల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో సఫలమైంది. దీంతో టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరుగా నిలిచింది.

టీ20ల్లో 130 ప్లస్ లక్ష్యాన్ని భారత్ ఎప్పుడూ డిఫెండ్ చేయలేదు. 2016లో జింబాబ్వేపై 138 పరుగులతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో డిఫెండ్ చేసిన అత్యల్ప టార్గెట్‌గా నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌లలో, 2016లో బంగ్లాదేశ్‌పై 146 పరుగులతో భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప మరో అత్యల్ప స్కోరు.

టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా అత్యల్ప స్కోర్లు.. (పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు)
138 — vs జింబాబ్వే (హరారే; 2016)

144 — vs ఇంగ్లాండ్ (నాగ్‌పూర్; 2017)

Advertisement

146 — vs బంగ్లాదేశ్ (బెంగళూరు; 2016)

152 — vs దక్షిణాఫ్రికా (కొలంబో; 2012)

153 — vs దక్షిణాఫ్రికా (డర్బన్; 2007)

టీ20ల్లో టీమిండియా అత్యల్ప స్కోర్లు..
146 — vs బంగ్లాదేశ్ (బెంగళూరు; 2016)

152 — vs దక్షిణాఫ్రికా (కొలంబో; 2012)

Advertisement

153 — vs దక్షిణాఫ్రికా (డర్బన్; 2007)

157 — vs పాకిస్థాన్ (జోహన్నెస్‌బర్గ్; 2007)

159 — vs ఆఫ్ఘనిస్తాన్ (కొలంబో; 2012)

Cricket

Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

Published

on

టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటివరకు చాలా బాగుంది. భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-8లోకి ప్రవేశించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా ఆటతీరు బాగానే ఉంది. కానీ, కొంత మంది ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. భారత దిగ్గజ ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రదర్శన చాలా పేలవంగా తయారై, జట్టును ఇబ్బంది పెడుతోంది.

ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రవీంద్ర జడేజా ప్రత్యేకంగా రాణించలేకపోయాడు. ఓవరాల్‌గా రెండు మ్యాచ్ ల్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. వచ్చిన వెంటనే తొలి బంతికే జడేజా ఔటయ్యాడు.

భారత ప్లేయింగ్ XIలో రవీంద్ర జడేజా స్థానంలో వచ్చేందుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీ.. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1. యుజ్వేంద్ర చాహల్..
టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. IPL 2024లో బాగానే ఆకట్టుకున్నాడు. ఈ కారణంగా అతను 2024 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో యుజ్వేంద్ర చాహల్‌కు ఆడే అవకాశం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, రవీంద్ర జడేజా ఫ్లాప్ ప్రదర్శన తర్వాత, చాహల్ ఆడవచ్చు. అతను వికెట్ టేకింగ్ బౌలర్, మ్యాచ్‌ను తనంతట తానుగా మార్చగలడు.

2. కుల్దీప్ యాదవ్..
రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ కూడా గొప్ప ఎంపిక. భారత జట్టు మొదటి రెండు మ్యాచ్‌లలో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్‌లను రంగంలోకి దించింది. అయితే జడేజా ఫ్లాప్ అయినందున, ఒక స్పిన్ ఆల్ రౌండర్‌ను కుల్దీప్ యాదవ్‌కు తగ్గించవచ్చు. వికెట్లు తీయడంలో కుల్దీప్ యాదవ్‌కు పేరుంది. ప్రస్తుతం అతను ఫామ్‌లో ఉన్నాడు. అందుకే జడేజా స్థానంలోకి అతను సరైన ఎంపిక కావచ్చు.

Advertisement

3. సంజు శాంసన్..
ఒకవేళ టీమ్ ఇండియా అదనపు బ్యాట్స్‌మెన్‌ను ఆడాలనుకుంటే, రవీంద్ర జడేజా స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. శాంసన్ ఇటీవల IPL 2024లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సంజూ శాంసన్‌ ఫామ్‌ని చూస్తే అతడికి అవకాశం ఇవ్వడం కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్‌లపై టెక్నికల్‌గా చాలా మంచి బ్యాట్స్‌మెన్‌ అవసరం ఉంది.

Continue Reading

Cricket

IND vs PAK: ‘ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా భయ్యా.. గుండె బద్దలైంది’.. పాక్ అభిమాని కన్నీళ్లు.. వీడియో

Published

on

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (జూన్ 09) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగులు తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. కాగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా, అభిమానులు స్టేడియంలో కిక్కిరిసిపోయారు. స్థానిక క్రికెట్ అభిమానులతో పాటు భారత్, పాక్ లకు చెందిన వేలాది మంది ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. ఇలా వెళ్లిపోయిన పాకిస్థాన్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు చేతిలో భారత జట్టు 7వ సారి ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఓ పాక్ అభిమాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ చూసేందుకు ఒక పాక్ అభిమాని ఏకంగా తన ట్రాక్టర్ అమ్మేసి న్యూయార్క్ వచ్చాడు. 3000 డాలర్ల విలువైన టికెట్ కూడా కొన్నాడు. అంటే పాక్ కరెన్సీలో సుమారు రూ.8 లక్షలు కాగా అదే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 2.50 లక్షలు.

ఇలా జరుగుతుందను కోలేదు..
ఇంత ఖరీదైన టికెట్ కొని మ్యాచ్ వీక్షించిన అభిమాని కనీసం ఈసారి అయినా పాక్ జట్టు గెలుస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ జట్టు విజయం ఖాయమని సదరు అభిమాని భావించారు. కానీ టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు మోకరిల్లారు. ఈ ఓటమి బాధ గురించి పాక్ అభిమాని మాట్లాడుతూ, “నేను US $ 3000 విలువైన టికెట్ కొనడానికి నా ట్రాక్టర్‌ని అమ్మాను. భారత జట్టు స్కోరు చూస్తుంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని అనుకోలేదు. మ్యాచ్ మొత్తం మా చేతుల్లోనే ఉంది. కానీ బాబర్ అజామ్ ఔట్ అయిన తర్వాత ప్రజలు నిరాశ చెందారు.. మీ అందరికీ (భారతీయులు) నేను అభినందనలు తెలుపుతున్నాను” అని పాకిస్థాన్ అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


మలుపు తిప్పిన బుమ్రా
కాగా భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 15వ ఓవర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సెట్‌లో రిజ్వాన్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ ఇచ్చాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కూడా పాక్ బ్యాటర్ల పని పట్టారు. ఫలితంగా పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement
Continue Reading

Cricket

Rohit Sharma: ఏం బాదుడు భయ్యా.. సిక్సర్ల వీరుడు.. రోహిత్ శర్మ మరో ఘనత

Published

on

అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. బుధవారం ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచులో మూడు సిక్సులు కొట్టి ఇప్పటివరకు మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 600 సిక్సులు కొట్టిన మొనగాడిగా నిలిచాడు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ 140.54 స్ట్రైక్ రేట్‌తో 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచుతో రోహిత్ మరో ఘనత కూడా అందుకున్నాడు.

భారత ఓపెనర్ విరాట్ కోహ్లీ తర్వాత క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ 4,000కు పైగా పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. టీ20ల్లో 144 మ్యాచ్‌లలో 32.20 సగటుతో, 139.98 స్ట్రైక్ రేట్‌తో రోహిత్ మొత్తం 4,026 పరుగులు బాదాడు.

వాటిలో 5 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ టెస్టుల్లో 4,137 పరుగులు, వన్డేల్లో 10,709 పరుగులు, టీ20ల్లో 4001 పరుగులు చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ టెస్టుల్లో 8,848 పరుగులు, వన్డేల్లో 13,848 పరుగులు, టీ20ల్లో 4,038 పరుగులు చేశాడు.

Continue Reading
National7 hours ago

తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు- భక్తుల హర్షం- హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్ – Jagannath Temple Doors Open

Andhrapradesh7 hours ago

భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమల సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! – TTD Seva Tickets for September 2024

National7 hours ago

భారత్​లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్​ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! – US Student Visa India

International7 hours ago

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రూ.4లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన- ఇటలీకి మోదీ – G7 Summit 2024

International7 hours ago

‘రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్​ చేస్తాం’- ఉక్రెయిన్​కు సపోర్ట్​గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!

International7 hours ago

ATA Convention : అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్.. రికార్డ్ స్థాయిలో హాజరైన తెలుగువారు!

National7 hours ago

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు

National7 hours ago

NEET UG 2024 Re-Exam: ఎన్టీఏ కీలక ప్రకటన.. గ్రేస్‌ మార్కులు రద్దు! రెండోసారి నీట్‌ యూజీ పరీక్షకు సన్నాహాలు

Andhrapradesh7 hours ago

AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

Andhrapradesh1 day ago

Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు

National1 day ago

జైపూర్ నగల వ్యాపారి ఘరానా మోసం; అమెరికా మహిళను రూ. 6 కోట్లకు ముంచిన వైనం

International1 day ago

Kuwait Building Fire: కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 43 మంది భాారతీయులు సజీవదహనం

International1 day ago

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం- మరో 9మంది మృతి

Telangana1 day ago

TGPSC Group1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17

Health1 day ago

ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?

Health1 day ago

Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..

Spiritual2 days ago

హుండీ ఆదాయం ఎంతో తెలుసా.. క్యూ లైన్ లు కూడా?

Education2 days ago

నీట్ ..యూజీ ప్రవేశ పరీక్షలను ఆపివేయలేం

National2 days ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 days ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

International2 days ago

భారతదేశంలో కలిసి పని చేయడానికి మేము సిద్ధం …చైనా ప్రధాని

National2 days ago

వీఐపీ సెక్యూరిటీ నుంచి NSG, ITBPకి విముక్తి- త్వరలో మోదీ సర్కారు కీలక నిర్ణయం – VIP Security Changes In India

National2 days ago

భారత ఆర్మీ కొత్త అధిపతిగా ఉపేంద్ర ద్వివేది- ఆరోజే బాధ్యతల స్వీకరణ

International2 days ago

హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..

National2 days ago

మోడీ తొలి విదేశీ పర్యటన….

National2 days ago

Odisha CM Mohan Majhi : ఒడిశా బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ.. కొత్త సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే?

Andhrapradesh2 days ago

AP Cabinet : చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు వీరే.. జనసేన నుంచి ప‌వ‌న్‌తో సహా ముగ్గురికి చోటు

Cricket2 days ago

Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

National2 days ago

NEET-UG 2024 Row: ‘అలా చేసే పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుంది’.. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Andhrapradesh2 days ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Business2 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News2 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business3 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National1 month ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National2 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Crime News4 days ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh5 days ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Education4 days ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Spiritual3 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

Telangana3 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh5 days ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Andhrapradesh2 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

National2 weeks ago

ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar

Spiritual4 days ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

National4 days ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Life Style4 weeks ago

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

National4 days ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

News1 month ago

డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

Andhrapradesh2 weeks ago

AP EAPCET 2024 Result Date: జూన్‌ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే

National3 days ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National2 weeks ago

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Andhrapradesh4 days ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Cinema2 weeks ago

Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

Business3 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Spiritual3 weeks ago

తిరుమ‌ల వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

Andhrapradesh3 weeks ago

ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

National2 weeks ago

బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

National3 weeks ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Trending