Education
NEET Exam 2024: రేపే నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
NEET Exam 2024: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్,పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది
నిబంధనలకు, షరతులకు పరీక్ష నిర్వహణ కు సంబంధించిన నీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్ మంజుల దేవి వివరాలను వెల్లడించారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్నారు. పరీక్షకు 5205 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలున్నాయన్నారు.
ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుందన్నారు.
NEET (UG) విద్యార్థులకు ముఖ్య సూచనలు..
1. NEET UG 2024 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాజరు పత్రంపై ఫోటో అతికించాలి.
2. అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి. పొడవాటి చేతుల దుస్తులు, బూట్లు, నగలు మరియు మెటల్ వస్తువులు లోపలికి అనుమతించబడవు.
3. చెప్పులు, తక్కువ ఎత్తు చెప్పులు మాత్రమే ధరించాలి.
4. పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేల్స్, రైటింగ్ ప్యాడ్‌లు, పెన్ డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్నులు మొదలైనవాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
5. వాచీలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్టులు, టోపీలు మొదలైన వాటిని ధరించవద్దు.
NEET UG పరీక్షా సరళి..
1. నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు మరియు ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలతో మొత్తం 180 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి.
2. రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) నుండి ఒక్కో సబ్జెక్ట్ నుండి 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బిలోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. ఈ విషయంలో అభ్యర్థి సమాధానమిచ్చిన మొదటి 10 ప్రశ్నలు మాత్రమే గణన సమయంలో పరిగణించబడతాయి.
3. ప్రతి ప్రశ్నకు బహుళ ఎంపిక పద్ధతిలో నాలుగు ఐచ్ఛిక సమాధానాలు ఉంటాయి. ఒక సరైన సమాధానం గుర్తించాలి. సరైన సమాధానమిచ్చిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.
4. మొత్తం 720 మార్కుల ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)కి సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయి
Education
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఏపీలో మరో ఐఐటీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ఏపీలో తిరుపతి ఐఐటీ మాత్రమే ఉంది. అయితే విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని.. ఐఐటీగా మార్చాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని.. ఐఐటీ వైజాగ్‌గా అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనలు మళ్లీ ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు.. ఆంధ్రా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌తో జరిపిన అంతర్గత సంభాషణల్లో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం త్వరలోనే మరో శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీని ఐఐటీగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. అధికారులు చెప్తున్న ప్రకారం అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగితే ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (AUCoET) త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోదా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే AUCoET త్వరలోనే.. ఐఐటీ వైజాగ్ లేదా ఐఐటీ విశాఖపట్నంగా మారనుంది. ఏపీలో ఇప్పటికే తిరుపతిలో ఓ ఐఐటీ ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే ఐఐటీ వైజాగ్ రెండోది కానుంది. అలాగే దేశంలోని 24వ ఐటీగా నిలవనుంది.
అయితే 2005లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. దేశంలోని ఏడు ఇంజినీరింగ్ కాలేజీలను ఐఐటీలుగా తీర్చిదిద్దాలంటూ ఎస్కే జోషి కమిటీ అప్పట్లో ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అయితే వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. అయితే ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీని ఐఐటీగా అప్ గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయమై. ఆంధ్రా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌తో చర్చించినట్లు తెలిసింది. ఆంధ్రా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర. విశాలమైన క్యాంపస్, విశాఖపట్నం అతిపెద్ద నగరం కావటంతో ఐఐటీ వైజాగ్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం.. దీనిపై కేంద్రాన్ని కోరాల్సి ఉంది.
ఐఐటీ వైజాగ్‌గా అప్ గ్రేడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరితే.. ఐఐటీ కౌన్సిల్ కమిటీ కూడా ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఐఐటీ మాత్రమే ఉంది. ఎన్నికలకు ముందు తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత భవనాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ శాశ్వత క్యాంపస్‌లను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పుడు అన్నీ కుదిరితే.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ.. ఐఐటీ వైజాగ్‌గా మారనుంది
Education
తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు
ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు
హైదరాబాద్, రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్‌ను ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు హైస్కూల్ వేళల్లో మార్పు లు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు హైస్కూల్ టైమింగ్స్ఉం డగా.. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటలకు మార్చారు.
ఇక హైదరాబాద్‌లో అప్పర్ ప్రైమరీ స్కూళ్ల టైమింగ్స్కూడా మార్చారు. సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Education
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పేస్ట్, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందివ్వనున్నారు. అయితే గతంలోనూ విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందించేవారు. అయితే నేరుగా ఇవ్వకుండా వారి తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తూ వచ్చారు. అయితే ఈ ఛార్జీలు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్ వస్తువులను విద్యార్థులకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా.. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కాస్మొటిక్ వస్తువులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
-
Business6 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career6 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News6 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business6 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business6 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International6 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education5 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National5 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh5 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News5 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana6 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National6 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways5 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National5 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh5 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National5 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National5 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh5 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh5 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political5 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political5 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National6 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
National6 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Weather5 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Cinema8 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Business6 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Education5 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh9 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh5 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh5 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International6 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Railways4 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh4 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh6 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
International6 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh5 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Business6 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Spiritual6 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Cinema6 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?