Hashtag
Donald Trump : బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శనాస్త్రాలు.. నేనుంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదు!
Donald Trump : గాజాలో పరిస్థితులను బైడెన్‌పై విమర్శనాస్త్రాలుగా వాడుకుంటున్నారు యూస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. గాజాపై దాడిని ఆపడంలో ఫెయిల్ అయ్యారంటూ ప్రస్తుత అధ్యక్షుడి తీరును తప్పుబట్టారు. తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదని చెప్పుకొచ్చారు ట్రంప్. అక్టోబర్ 7న జరిగిన మారణహోమంపై ప్రెసిడెంట్ జోబైడెన్‌ను ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు.
బైడెన్ మాట్లాడలేరని..ఆయన విదేశాంగ విధానం కూడా భయానకంగా ఉందని తప్పుబట్టారు ట్రంప్. బైడెన్‌ను హమాస్ గౌరవించదని.. అందువల్లే ఈ దాడి జరిగిందన్నారు. ఇజ్రాయెల్‌కు బైడెన్ శ్రేయోభిలాషి అయ్యుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని విమర్శలు చేశారు.
వెంటనే యుద్ధాన్ని ముగించాలంటూ పిలుపు :
ఇజ్రాయెల్‌ను కూడా అప్రమత్తం చేశారు ట్రంప్. గాజా నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు విషాదకరంగా ఉన్నాయని..వాటిని ప్రపంచం చూస్తోందని.. అందుకే ఈ యుద్ధాన్ని ముగించాలని సూచించారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ దూకుడు తగ్గకపోవడంతో అంతర్జాతీయంగా మద్దతు తగ్గుతుందని హెచ్చరించారు. ప్రపంచదేశాల మద్దతు కోల్పోతుండటంతో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు.
మరోవైపు గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉంది. దీంతో అమెరికాపై కోపంగా ఉంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో శాంతియుత వాతావరణం ఏర్పడేలా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Hashtag
Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!
మాటల్లో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం. ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం. కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం. ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొట్టే సంప్రదాయము కోర్టుల్లో ఉండేది. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పారేసే వారు కొందరైతే… తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్.
నేటి తరానికి పాలి పెన్నులు… పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడయితే దానిని హాస్పిటల్ కి తీసుకు వెళతారు. అదేంటి మనుషులు, పశువులు అయితే హాస్పిటల్ కి తీసుకు వెళతారు కానీ పెన్నులు బాగుచేసే చోటుని హాస్పిటల్ అంటారేoటని అనుకుంటున్నారా….? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి.
ఇక్కడ కలానికి ఎనలేని గౌరవం ఇస్తారు. పైగా జీవమున్న మనుషులను, పశువులను ఎలా అయితే ట్రీట్ చేస్తారారో అలాగే అనేక భావోద్వేగాలు, సెంటిమెంట్లతో తమ వద్దకు వచ్చే పెన్నులను సున్నితంగానే ట్రీట్ చేస్తారు ఇక్కడ. అలాఅని ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో వచ్చిందయితే కాదు.. 1975 నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం 2టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్ కి ఆద్యడు. కరోనా సమయంలో అతను మరణించగా వారసుడుగా అతని కుమారుడు నాగరాజు స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మటంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఎంత కాస్ట్లి పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాట బట్టి ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తాడు నాగరాజు. కొత్త, పాత అని తేడా లేకుండా అన్ని రకాల పెన్స్‌ను సరిచేసి ఇవ్వడం వీరి స్పెషాలిటీ.
ఈ పెన్ హాస్పటల్‌లో పెన్నులకు రిపేర్ చెయ్యటమే కాదు రూపాయి నుంచి లక్ష రూపాయిలు విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. ఈ పెన్ హాస్పిటల్ లో షీఫర్స్, మౌంట్ బ్లాక్ ,క్రాస్, వాటర్ మెన్, పార్కర్, పిన్ లైన్, పెరి కార్డెన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. మనుషుల మాదిరిగానే జీరో సైజ్ పెన్నులు, A4 సైజ్ పేపర్ అంతా బరువు మాత్రమే ఉండే వెయిట్ లాస్ పెన్నులు ఉన్నాయి. 80 ఏళ్ల పాటు ఇంకు గాని, రీఫిల్ గాని మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఓ ప్రత్యేకం. ఈ పెన్నులో ఇంకుకు బదులు కార్భనిక్ గ్యాస్ ఉంటుంది. ఈ పెన్ ధర రూ.20,700.
ఇక AK 47 బుల్లెట్ తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లవర్స్ తో పాటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అటు 24 కేరట్స్ గోల్డ్ ప్లేటెడ్ తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ను ధర అక్షరాలా రూ.75 వేలు. అయితే ఇంత ధర పెట్టీ కొన్న పెన్నులకు, సాధారణ పెన్నులకు సౌలభ్యం, హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు. ఒకసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదలలేరని చెబుతున్నారు.
ముఖ్యంగా కవులు, రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధర అయినా వెనక్కి తగ్గరని అంటున్నారు. ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేoదుకు ఇష్టపడి ఈ కాస్ట్లీ పెన్నులు కొనుగోలు చేస్తే….మరికొంతమంది తల్లిదండ్రులకు, ప్రేయసి, ప్రియులకి, పై అధికారులకు గిఫ్ట్ గా కొనుగోలు చేసి ఇస్తారని అంటున్నారు.
సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంటపెట్టుకొని ప్రపంచాన్ని జయించేది కలం. అందుకే ఆత్రేయ,ఆరుద్ర, ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు, కవులు వారి రచనలను కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యారు. కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు.కలానికి కాలం చెల్లి కంప్యూటర్ కి దగ్గరైన ఈ రోజుల్లో శ్రీకాకుళంలో ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Hashtag
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది కాదు. 10 కిలోల బంగారంతో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన బర్రెకు గొలుసు తొడుగుతూ అతడు మురిసిపోయాడు. ఆ సమయంలో మరొకరు అతడికి సాయం చేశారు. మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘మాషాల్లా.. ఆవుకి 10 కిలోల బంగారు గొలుసు. దాని ధర ఎంతో?’ అని పేర్కొన్నాడు.
అయితే, వీడియోలో ఉన్నది బర్రె అయితే పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఆవు అంటూ రాసుకురావడం నెటిజన్లను తికమకకు గురిచేస్తోంది. ఆవుగా భావించి బర్రెకు 10 కిలోల బంగారం చేయించారా ఏంటి? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా పశువులకు అంత ఖర్చు చేసి బంగారు గొలుసులు చేయించడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
Hashtag
Mystery Mummy: ఈజిప్ట్ రాజు సమాధిలో ప్రవేశించిన 20 మంది మృతి.. 100 ఏళ్ల రహస్యం నేడు బట్టబయలు
ఈజిప్టు రాజులకు సంబంధించిన రహస్య కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ రాజులలో ఒకరు టుటన్‌ఖామున్. ఈ రాజు సమాధి, చావు నేటికీ రహస్యంగానే ఉంది. ఈ రాజు సమాధి దగ్గరకు వెళ్లిన వారు ఇప్పటివరకు శపించబడ్డారని చెబుతూ ఉంటారు. టుటన్‌ఖామున్ సమాధిని రహస్యంగా తెరిచిన వ్యక్తులు మరణించారని నమ్ముతారు. 20 మంది టుటన్‌ఖామున్ సమాధిని తెరిచారని, వారందరూ మరణించారని పేర్కొన్నారు. ఈ రహస్య మరణాల పరంపర 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత టుటన్‌ఖామున్ సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎలా చనిపోయారనే నిజం శాస్త్రవేత్తలకు తెలిసింది.
పురాతన ఈజిప్షియన్ గ్రంథాలు మమ్మీ అవశేషాలను భద్రపరిచే వ్యక్తులు ‘ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధితో మరణానికి గురయ్యారని’ చదివినట్లు లెడ్‌బైబుల్ నివేదించింది. అయినప్పటికీ అటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. అయితే జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లోరేషన్‌లో రాస్ ఫెలోస్ రాసిన కొత్త అధ్యయనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం నిజంగా ఏమి జరిగింది, అంటే సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరణించారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
మనుషులు ఎలా చనిపోయారు?
సమాధి తెరచిన ప్రజల మరణాలకు కారణం యురేనియం, విషపూరిత వ్యర్థాలను కలిగి ఉన్న సహజ మూలకాల నుంచి వచ్చే రేడియేషన్ విషప్రయోగం అని నమ్ముతారు. ఈ కణాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. నివేదికల ప్రకారం 1922లో టుటన్‌ఖామున్ సమాధిలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన హోవార్డ్ కార్టర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కూడా ఇదే విధంగా మరణించి ఉండవచ్చు. అంతేకాదు హాడ్కిన్స్ లింఫోమా కూడా సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి సుమారు 11 సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడి మరణించారు.
వివిధ వ్యాధులతో మరణించారు
నివేదికల ప్రకారం సమాధిలోకి ప్రవేశించిన వ్యక్తులలో లార్డ్ కార్నార్వోన్ రక్తం విష తుల్యంగా మారడంతో మరణించాడు. అదేవిధంగా సమాధిలోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు కూడా వివిధ వ్యాధులతో మరణించారు. ఆ తర్వాత ఇది శాపంగా భావించడం మొదలు పెట్టారు. అయితే నేడు ఈ మరణాలకు గల అసలు కారణం, ఇప్పుడు ఆ నిజం ప్రపంచం ముందు వెల్లడైంది.
-
Business4 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career4 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
National4 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business4 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
News4 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business4 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education3 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National3 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh3 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
National4 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Crime News3 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Telangana4 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh3 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Spiritual3 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National3 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Railways3 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh3 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National3 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
National3 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh3 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh3 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political3 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political3 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh3 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh3 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National4 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Weather3 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education3 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
International4 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Andhrapradesh3 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Business4 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
National4 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh3 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News4 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News3 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Cinema6 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh3 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh3 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Railways2 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh4 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
International4 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Spiritual4 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Andhrapradesh3 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Andhrapradesh7 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
News3 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh3 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Cinema4 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
International3 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Spiritual3 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
Business4 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?