International
భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక
సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుడుగు వేశాయి. బీజింగ్‌లో బుధవారం భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ అయ్యాయి. ఈ ప్రతినిధుల బృందానికి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేతృత్వం వహించారు. చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘దశల వారీగా రోడ్‌మ్యాప్‌పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మొదలైందని భారత్ పేర్కొంది.
మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.
అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు. కాగా, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగింది 23వ సమావేశం. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణ ఈ చర్చల లక్ష్యం.
వివాదాస్పద పాయింట్ల దెమ్‌చోక్, దెప్సాంగ్‌ల నుంచి సైన్యాల ఉపసంహరణకు అక్టోబరు 21న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు అక్టోబరు 24న రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయి సయోధ్యకు మార్గం వేశారు.
International
యుద్ధం ముగించేందుకు సిద్ధం- జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడం: పుతిన్ – PUTIN ON RUSSIA UKRAINE WAR
Putin On Russia Ukraine War : ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చెప్పారు.
‘భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాం’
అయితే ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని తెలిపారు. జెలెన్‌స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అన్నారు. గురువారం పుతిన్ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని పుతిన్ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని అన్నారు.
‘ట్రంప్‌ను కలవడానికి నేను సిద్ధం’
మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో నాలుగేళ్లుగా తాను మాట్లాడలేదని అయితే ఆయన్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. అంతకుముందు అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని అన్నారు. అయితే, ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు.
“అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒకటికంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా ఆలోచన ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా” అని పుతిన్ తెలిపారు.
International
అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024
US Shutdown 2024 : అమెరికా షట్‌డౌన్ గండం నుంచి తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రిలోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్లాన్ నుంచి తొలగించింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌కు పంపింది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తొలగిపోతుంది.
బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్లు
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తొలుత ట్రంప్ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ కోరారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమొక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
‘అధికార మార్పిడికి అంతరాయం’
అయితే తాజా పరిణామాలపై వైట్ హౌస్ స్పందించింది. షట్‌డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత రావడం వల్ల ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేశారు. ట్రంప్ చేసిన డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. దీనికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ బిల్లుకు 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. మెజారిటీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం దీన్ని సెనెట్‌కు పంపించారు. ప్రస్తుతం సెనెట్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది. దీంతో అక్కడ కూడా బిల్లు సునాయాశంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. శుక్రవారం అర్ధరాత్రిలోగా (అమెరికా కాలమానం ప్రకారం) సెనెట్ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.
ట్రంప్ హయాంలో షట్‌డౌన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తప్పింది.
International
యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఎవరు స్ట్రాంగ్?
యుద్ధం అంటేనే ఆయుధాలు, అగంబలంతో పని. ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లోనూ సేమ్ సీన్. ఆకాశమే యుద్ధభూమిగా చేసుకుని దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్..బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్నదానిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఏప్రిల్‌లో ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టమేమి జరగలేదు. ఇప్పుడు ఇరాన్ దాడులు ఎలా ఉంబోతున్నాయి..వాటిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇజ్రాయెల్‌ది తిరుగులేని రక్షణవ్యవస్థ. ఇరాన్ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. 2022, 2023లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఇజ్రాయెల్ ఇరాన్‌తో పోల్చితే రెండింతల కంటే ఎక్కువ అంటే దాదాపు 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గరున్న యుద్ధవిమానాల్లో దూరం నుంచి అటాక్ చేసే.. F15, F-35 లేటెస్ట్ విమానాలు ఉన్నాయి. ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకుని.. స్పీడ్‌గా దాడి చేస్తాయి.
320 విమానాలు
ఇరాన్ దగ్గర దాదాపు యుద్ధ సామర్థ్యమున్న 320 విమానాలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 1960 నాటి F-4, F-5, F-14 వార్ జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అయితే పాత విమానాల్లో ఎన్ని పనిచేస్తున్నాయో క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరమ్ డోమ్‌దే కీరోల్. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అన్నింటిన్నీ ఐరమ్ డోమ్ కూల్చేసింది. ఇరాన్‌కు చెందిన 300కి పైగా క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్ సిస్టమ్ ఉపయోగపడింది.
ఇరాన్‌లో 6లక్షల మంది సైనికులుంటే, ఇజ్రాయెల్ దగ్గర లక్షా 70వేల మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ దగ్గర 3వేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది. షార్ట్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్, డ్రోన్లను డెవలప్ చేసింది.
ఇజ్రాయెల్‌కు పెద్ద బలం దాని ఎయిర్‌ఫోర్స్, ఆయుధాలే. ఇరాన్‌లో కీలక టార్గెట్స్‌పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇరాన్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారులు, నాయకులు ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లోనే చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ నేవీ దగ్గర 220 నౌకలు, ఇజ్రాయెల్ దగ్గర 60 నౌకలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీపరంగా వీక్ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్‌కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు. ఇలా ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ఇరాన్ కంటే ఇజ్రాయెలే కాస్త అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్‌ను డెవలప్ చేసుకుందని అంచనాలు ఉన్నాయి.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema8 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?