Andhrapradesh
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! – AP MINISTERS
Andhra Pradesh Ministers Take Charge: రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బీసీ సంక్షేమం, టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా సవిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటి సంతకం అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన, రెండో సంతకం ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన చేశారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వెనకబడిన అన్ని వర్గాలతో కలిపి 75 శాతం మందికి సేవ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని తెలిపారు.
బీసీలకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు సంక్షేమం ప్రారంభమైందని తెలిపారు. చంద్రబాబు పాలనలో 2,173 మందికి ఎన్టీఆర్ విదేశీ విద్య అందిస్తే జగన్ కేవలం 89 మందికి మాత్రమే విదేశీ విద్య అందించారన్నారు. ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్లు, బీసీ భవన్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
Andhrapradesh
చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ – సంతోషంలో నారా కుటుంబం – CHANDRA BABU GRAND SON WORLD RECORD
CHANDRA BABU GRAND SON WORLD RECORD: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు. దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.
“చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డు : వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజీళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు.
అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సృజనాత్మకంగా నేర్చుకునే డైనమిక్ విద్యార్థి: దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని నారా లోకేశ్ తెలిపారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని తెలిపారు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని వెల్లడించారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేశ్ వెల్లడించారు. “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి” అని ఆయన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష్ సొంతమని తెలిపారు.
చంద్రబాబు ప్రశంసలు: వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్‌గా 175 పజిల్స్‌లో ప్రపంచ రికార్డ్‌ను దేవాన్ష్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేశ్, బ్రాహ్మణిలు హర్షం వ్యక్తం చేశారు. చిన్న గ్రాండ్ మాస్టర్ దేవాన్ష్ ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. చదరంగంలో 175 పజిల్స్‌ను పూర్తి చేయడం ద్వారా వేగవంతమైన చెక్‌మేట్‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పిన దేవాన్ష్‌కు అభినందనలు తెలిపారు.
కృషి, అంకితభావం, పట్టుదల విజయానికి కీలకమన్న ఆయన, ఈ విజయం కోసం నెలలు తరబడి దేవాన్ష్ కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అధికారిక ధృవీకరణను స్వీకరించినందుకు తాము సంతోషిస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. ఈ ఘనత కోసం దేవాన్ష్ అంకితభావం, పట్టుదలతో కృషి చేసినట్లు వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి, రాయ్ అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రుల అభినందనలు: చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్‌ను మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, రామానాయుడు, కొల్లు రవీంద్ర, రాంప్రసాద్ రెడ్డి, పార్ధ సారధి, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామిలు అభినందనలు తెలిపారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దృవీకరణ అందుకున్న దేవాన్ష్ మున్ముందు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
Andhrapradesh
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు
Tirumala Tirupati Devasthanam Updates : మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. 26వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.
తేదీలు మార్పు…
డిసెంబర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా టికెట్లను విడుదల చేయనుంది.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న విడుదల కావాల్సి ఉంది. ఇక డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని పేర్కొంది. కానీ తాజా ప్రకటనలో పలు మార్పులు చేసింది.
మార్పులకు అనుగుణంగా భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఇతర సైట్లను నమ్మవద్దని కోరింది.
-
డిసెంబరు 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
డిసెంబరు 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
డిసెంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు: మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Andhrapradesh
విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాలకులు తమతమ స్థాయిలలో ఎంత కృషి చేస్తున్నా.. ఇంకా కీలకమైన మౌళిక సదుపాయాల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఇలాంటి సందర్భాలలో ప్రస్తుతం..
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాలకులు తమతమ స్థాయిలలో ఎంత కృషి చేస్తున్నా.. ఇంకా కీలకమైన మౌళిక సదుపాయాల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఇలాంటి సందర్భాలలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రభుత్వం కావడంతో రాష్ట్రంలో కూడా కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు రంగం సిద్దమవుతోంది. అందులోనూ విజయవాడకు, ముఖ్యంగా అమరావతి రాజధానికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు విజ్ఞప్తులు ఫలిస్తున్నాయి. అందులో ఇదొకటి.
విజయవాడ తూర్పు బైపాస్. ఇది విజయవాడ నగర ప్రజలకు సుదీర్ఘ కల. నగరం మధ్యలో జాతీయ రహదారి ఉండడం, చుట్టూ కొండ ప్రాంతాలు, మరోవైపు కృష్ణా నది కావడంతో విజయవాడలో ట్రాఫిక్ అంటే నరకమే అన్నట్టు ఇక్కడి ప్రజలు నిరంతరం ఆ బాధను అనుభవిస్తున్నారు. దీంతో తూర్పు బైపాస్ ఎప్పటినుంచో ప్రత్యామ్నాయంగా ఉంది. దీనికి సంబంధించి విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చడంతో విజయవాడ వాసుల్లో సరికొత్త భరోసా ఏర్పడింది.
2,716 కోట్ల రూపాయలతో 50 కిలోమీటర్ల మేర తూర్పు బైపాస్..
గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి నుంచి ఇబ్రహీంపట్నం మండలం కాజా వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు పూర్తి అభిముఖంగా తూర్పువైపు మరో బైపాస్ నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇది మొత్తం 50 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ బైపాస్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ 2,716 కోట్లు కేటాయించింది. దీనికోసం కన్సల్టెన్సీ మూడు ఎలైన్మెంట్లు సిద్ధంచేసింది. వాటి వివరాలను జాతీయ హైవేస్ అభివృద్ధి సంస్థ ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి ప్రెజెంటేషన్ ఇవ్వనుంది.
-
Business7 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career7 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News7 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business7 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National8 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business7 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International7 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education7 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National7 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh6 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News7 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana7 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual7 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National7 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National7 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh7 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National7 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh7 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National7 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National7 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Political7 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh7 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National7 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Cinema10 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Business7 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh7 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
International8 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International7 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News8 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Railways6 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
News7 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh6 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Andhrapradesh7 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business7 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News7 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh6 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema7 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?