Connect with us

International

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ‘నోస్ట్రాడమస్’ జోస్యం

Published

on

US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి విజయం సాధిస్తారని యూఎస్ అధ్యక్ష ఎన్నికలను సరిగ్గా అంచనా వేయడంలో ‘నోస్ట్రాడమస్ (Nostradamus)’ గా పేరుగాంచిన అలన్ లిచ్ మన్ జోస్యం చెప్పారు.

‘చాలా పొరపాట్లు’ జరిగితే తప్ప..

‘చాలా పొరపాట్లు’ జరిగితే తప్ప అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయమేనని అలన్ లిచ్ మన్ తెలిపారు. అలన్ లిచ్ మన్ ను యుఎస్ అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్ (Nostradamus of US Elections) అని పిలుస్తారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Election 2024) బైడెన్ తో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ బలంగా ఉంది. అయితే, మొత్తం మీద బైడెన్ పై ట్రంప్ కొంత ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ (Donald Trump) కంటే డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 1.5 శాతం ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు అమెరికా జాతీయ సర్వేలు చెబుతున్నాయి.

ఇది ఫైనల్ అంచనా కాదు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత విషయంలో 1984 నుంచి లిచ్ మన్ అంచనాలన్నీ నిజమయ్యాయి. అయితే, బైడెన్ (Joe Biden) గెలుస్తారన్న తన అంచనా తుది అంచనా కాదని అలన్ లిచ్ మన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతను అంచనా వేసే విషయంలో లిచ్ మన్ ముఖ్యంగా 13 కీ లతో ఒక నమూనా ను ఉపయోగిస్తారు. వాటిలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ కీ అధికారంలో ఉన్న అభ్యర్థికి వ్యతిరేకంగా వస్తే, ఆ అభ్యర్థి ఓడిపోతాడని లిచ్ మన్ భావిస్తారు. ఆరు కన్నా తక్కువ వస్తే అధికారంలో ఉన్న అభ్యర్థి విజయం సాధిస్తారు. ప్రస్తుతం బైడెన్ కు వ్యతిరేకంగా 2 కీస్ మాత్రమే కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన విజయం సాధిస్తారు. అయితే, ఇది తుది అంచనా కాదు. ఈ ఎన్నికల్లో జో బైడెన్ (Joe Biden) ఓడిపోవాలంటే చాలా తప్పులు చేయాల్సి ఉంటుంది’’ అని అలన్ లిచ్ మన్ (Allan Lichtman) విశ్లేషించారు.

International

అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024

Published

on

US Shutdown 2024 : అమెరికా షట్‌డౌన్‌ గండం నుంచి తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. ట్రంప్‌ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రిలోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్లాన్ నుంచి తొలగించింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌కు పంపింది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్‌డౌన్‌ ముప్పు తొలగిపోతుంది.

బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్లు
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తొలుత ట్రంప్‌ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ కోరారు. దీంతో ట్రంప్‌ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ గురువారం సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్‌ సభ్యులే డెమొక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

‘అధికార మార్పిడికి అంతరాయం’
అయితే తాజా పరిణామాలపై వైట్ హౌస్ స్పందించింది. షట్‌డౌన్‌ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత రావడం వల్ల ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేశారు. ట్రంప్‌ చేసిన డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. దీనికి ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

ఈ బిల్లుకు 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. మెజారిటీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం దీన్ని సెనెట్‌కు పంపించారు. ప్రస్తుతం సెనెట్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది. దీంతో అక్కడ కూడా బిల్లు సునాయాశంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. శుక్రవారం అర్ధరాత్రిలోగా (అమెరికా కాలమానం ప్రకారం) సెనెట్‌ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

ట్రంప్ హయాంలో షట్​డౌన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్​డౌన్ ముప్పు తప్పింది.

Advertisement
Continue Reading

International

భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక

Published

on

సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుడుగు వేశాయి. బీజింగ్‌లో బుధవారం భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ అయ్యాయి. ఈ ప్రతినిధుల బృందానికి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేతృత్వం వహించారు. చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘దశల వారీగా రోడ్‌మ్యాప్‌పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్‌ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్‌ మొదలైందని భారత్ పేర్కొంది.

మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.

అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు. కాగా, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగింది 23వ సమావేశం. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణ ఈ చర్చల లక్ష్యం.

వివాదాస్పద పాయింట్ల దెమ్‌చోక్, దెప్సాంగ్‌ల నుంచి సైన్యాల ఉపసంహరణకు అక్టోబరు 21న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు అక్టోబరు 24న రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా భేటీ అయి సయోధ్యకు మార్గం వేశారు.

Advertisement
Continue Reading

International

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Published

on

యుద్ధం అంటేనే ఆయుధాలు, అగంబలంతో పని. ఇరాన్, ఇజ్రాయెల్‌ వార్‌లోనూ సేమ్‌ సీన్‌. ఆకాశమే యుద్ధభూమిగా చేసుకుని దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్‌..బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్నదానిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఏప్రిల్‌లో ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టమేమి జరగలేదు. ఇప్పుడు ఇరాన్‌ దాడులు ఎలా ఉంబోతున్నాయి..వాటిని ఇజ్రాయెల్‌ ఎలా తిప్పికొట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇజ్రాయెల్‌ది తిరుగులేని రక్షణవ్యవస్థ. ఇరాన్‌ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. 2022, 2023లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఇజ్రాయెల్ ఇరాన్‌తో పోల్చితే రెండింతల కంటే ఎక్కువ అంటే దాదాపు 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గరున్న యుద్ధవిమానాల్లో దూరం నుంచి అటాక్ చేసే.. F15, F-35 లేటెస్ట్‌ విమానాలు ఉన్నాయి. ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకుని.. స్పీడ్‌గా దాడి చేస్తాయి.

320 విమానాలు
ఇరాన్ దగ్గర దాదాపు యుద్ధ సామర్థ్యమున్న 320 విమానాలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 1960 నాటి F-4, F-5, F-14 వార్‌ జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అయితే పాత విమానాల్లో ఎన్ని పనిచేస్తున్నాయో క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరమ్ డోమ్‌దే కీరోల్‌. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అన్నింటిన్నీ ఐరమ్ డోమ్ కూల్చేసింది. ఇరాన్‌కు చెందిన 300కి పైగా క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్‌ సిస్టమ్ ఉపయోగపడింది.

Advertisement

ఇరాన్‌లో 6లక్షల మంది సైనికులుంటే, ఇజ్రాయెల్ దగ్గర లక్షా 70వేల మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ దగ్గర 3వేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది. షార్ట్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌, డ్రోన్లను డెవలప్ చేసింది.

ఇజ్రాయెల్‌కు పెద్ద బలం దాని ఎయిర్‌ఫోర్స్‌, ఆయుధాలే. ఇరాన్‌లో కీలక టార్గెట్స్‌పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇరాన్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారులు, నాయకులు ఇజ్రాయెల్‌ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లోనే చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ నేవీ దగ్గర 220 నౌకలు, ఇజ్రాయెల్ దగ్గర 60 నౌకలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్‌ సిస్టమ్‌ టెక్నాలజీపరంగా వీక్‌ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్‌కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు. ఇలా ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ఇరాన్‌ కంటే ఇజ్రాయెలే కాస్త అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను డెవలప్‌ చేసుకుందని అంచనాలు ఉన్నాయి.

Continue Reading
Spiritual18 hours ago

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

International1 day ago

అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024

Andhrapradesh2 days ago

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Spiritual2 days ago

శబరిమలకు పోటెత్తిన భక్తులు- ఒక్క రోజులో 96 వేల మంది దర్శనం – SABARIMALA DEVOTEES

International3 days ago

భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక

Telangana3 days ago

గుడ్​ న్యూస్​: హైదరాబాద్​ బుక్​ ఫెయిర్ ప్రారంభం- ఇక పది రోజులు పుస్తక ప్రియులకు పండగే! – HYDERABAD BOOK FAIR 2024

Andhrapradesh3 months ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest3 months ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education3 months ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual3 months ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh4 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh4 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh4 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual4 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National4 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National4 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National4 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh4 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International4 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag4 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International4 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National4 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National4 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh4 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International4 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International4 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International4 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology4 months ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National4 months ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National4 months ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

Business7 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career7 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News7 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business7 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National8 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business7 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

International7 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

Education7 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National6 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Andhrapradesh6 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Crime News6 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh7 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Telangana7 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Spiritual7 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National7 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Railways6 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

National6 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh6 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National6 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh6 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh6 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

National6 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh10 months ago

మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ

National7 months ago

Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్

Political6 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh7 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Political6 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh6 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh7 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Business7 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Trending