Sports
26గంటలు, 825 గోల్స్- ఫుట్‌బాల్ మ్యాచ్ రికార్డు- గిన్నిస్ బుక్‌లోనూ చోటు – World Longest Football Match
World Longest Football Match : ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు, వేల కోట్ల రూపాయల భారీ సంపాదన ఫుట్‌బాల్ సొంతం. మెస్సీ, రొనాల్డో, ఎంబాపే ఇలా స్టార్ ఆటగాళ్లకు ఉన్న అభిమానసంద్రాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అయితే సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్ 90 నిమిషాల్లో ముగుస్తుంది. 90 నిమిషాల వరకు ఇరు జట్లు గోల్స్ చేయకపోతే అదనపు సమయాన్ని ఇస్తారు. అప్పుడు కూడా గోల్స్ నమోదు కాకపోతే పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఎలా చూసినా ఫుట్‌బాల్ మ్యాచ్ రెండు గంటల్లోపే పూర్తవుతుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగిన సమయం నమోదైన గోల్స్ అన్నీ రికార్డు సృష్టించాయి. అదే రష్యాలో జరిగిన 26 గంటల మ్యాచ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
2014 రికార్డ్ బ్రేక్
ప్రపంచంలోనే సుదీర్ఘంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్ రష్యాలో జరిగింది. ఆల్-రష్యన్ ఫుట్‌బాల్ దినోత్సవం సందర్భంగా ఈ మ్యాచ్ నిర్వహించారు. మాస్కో శివార్లలోని లుజ్నికి ఒలింపిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ లాంగ్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఏడు మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు లుజ్నికి ఒలింపిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ సుదీర్ఘమైన మ్యాచ్‌ను ఆడాయి. ఈ మ్యాచ్‌కు భారీగా అభిమానులు హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అంటే సుమారు 26 గంటలపాటు నిర్విరామంగా సాగింది. ఈ మ్యాచ్ ప్రపంచంలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌గా చరిత్ర సృష్టించింది. 2014లో రెండు జట్లు 24 గంటల పాటు ఆడి నెలకొల్పిన రికార్డును ఈ మ్యాచ్ బద్దలు కొట్టింది.
ప్లేయర్స్ ఏడుగురే
సుమారు 26 గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 825 గోల్స్ చేశాయి. రెడ్ టీమ్ 409 గోల్స్ చేయగా, వైట్ టీమ్ 416 గోల్స్ చేసింది. దీంతో రెడ్ టీమ్‌పై వైట్ టీమ్ తొమ్మిది గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇరు జట్లలో కేవలం ఏడుగురు. దీంతో ఈ మ్యాచ్‌ను అధికారికంగా గుర్తించలేదు. అందుకే ఎలాంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య వద్ద ఎలాంటి రికార్డులు నమోదు కాలేదు. కానీ సుదీర్ఘంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌గా ఇది గిన్నిస్ రికార్డ్స్ సృష్టించింది. రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఈ మ్యాచ్ నమోదైంది. 26 గంటలపాటు సాగిన ఆటలో ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆటగాళ్లకు ఎనిమిది నిమిషాల విరామం ఇచ్చారు.
Cricket
RCB Fans : ఒక్క మ్యాచ్ గెలవగానే.. ఐపీఎల్ ఫైనల్ తేదీ మార్చాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ పట్టు.. కారణం తెలిస్తే షాకే?
RCB : ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సీజన్‌లో రెండో విజయాన్ని బెంగళూరు నమోదు చేయడమే అందుకు కారణం. గురువారం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపొందింది. ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటిన తరుణం ఈ విజయంతో రేసులోకి వచ్చింది ఆర్‌సీబీ. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచులు ఆడగా రెండు మ్యాచుల్లోనే గెలుపొందిన ఆర్‌సీబీ మిగిలిన మ్యాచుల్లో గెలిచి కాస్త అదృష్టం తోడైతే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవచ్చు.
ఈ క్రమంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ప్రస్తుతం ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాడు. ఐపీఎల్ ఫైనల్ తేదీని ఖచ్చితంగా మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 26న జరగాల్సి ఉంది. అయితే.. ఒక రోజు ముందుగా అంటే మే 25న నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అలా చేస్తే తమ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తుందని వారు అంటున్నారు. ఇందుకు ఓ లాజిక్‌ను చూపెడుతున్నారు.
వాస్తవానికి ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలిచింది. మార్చి 25న పంజాబ్‌తో ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదారాబాద్ పై విజయాలను సాధించింది. అంటే.. ప్రతి నెలలో 25వ తేదీన ఆర్‌సీబీ ఖచ్చితంగా గెలుస్తోంది. ఈ లెక్కన ఐపీఎల్ ఫైనల్ ను మే 25న నిర్వహించాలని అంటున్నారు. దీన్ని చూసిన కొంత మంది ఆర్‌సీబీ ఫ్యాన్స్ అంటున్న దానిలో న్యాయం ముంది అని అంటుంటే.. ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ముందు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోవాలి గదా అంటూ మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) లు అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ తలా రెండేసి వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Next win for @RCBTweets will be on May 25, @IPL pls reschedule one of #RCB matches on this date https://t.co/NgvceoCJdh
— M Anil Kumar (@AniltheMatrix) April 26, 2024
Sports
Paris Olympics: తక్కువ స్కోర్ ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్.. కారణం ఏంటో తెలుసా?
Paris Olympics: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI ) ఇటీవల షూటర్ కోసం నిబంధనలను మార్చింది. షూటర్స్ తక్కువ స్కోరు ఉన్నప్పటికీ పారిస్ ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. NRAI పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపిక ట్రయల్స్‌కు సంబంధించిన ప్రమాణాలపై కోర్టు పోరాటం చేస్తోంది. వాస్తవానికి, ట్రాప్ షూటర్ కరణ్ రెండు పాయింట్ల తేడాతో షాట్‌గన్ ఎంపిక ట్రయల్స్ కోసం NRAI ప్రమాణాలను కోల్పోయాడు. అయితే, అతను ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంది. కాగా, గతేడాది జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఇలాంటి స్కోర్లు సాధించిన పలువురు షూటర్ల పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు.
NRAI గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన సర్క్యులర్‌లో ‘షాట్‌గన్ ఎంపిక ప్రమాణాల ప్రకారం ఎంపిక ట్రయల్స్ 2024’ అని ప్రకటించింది. అతని ప్రకారం, 66వ జాతీయ ఛాంపియన్‌షిప్ సమయంలో సీనియర్ పురుషుల ట్రాప్‌లో 110 స్కోర్‌తో షూటర్లు డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్య జరిగే ప్రాక్టీస్‌కు అర్హులు. అయితే, ఆర్మీ షూటర్ కరణ్ 108 మాత్రమే స్కోర్ చేశాడు. అయినప్పటికీ, NRAI అతన్ని అనుమతించింది. ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతించింది.
సైన్యం నుంచి సిఫార్సు..
నాలుగు సెలెక్షన్ ట్రయల్స్ సిరీస్‌లో కరణ్ ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించలేకపోయాడు. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, NRAI కార్యదర్శి రాజీవ్ భాటియా పీటీఐతో మాట్లాడుతూ.. కరణ్ ‘రైజింగ్’ షూటర్, అతని సిఫార్సు ఆర్మీ నుంచి వచ్చింది. అతను ఎమర్జింగ్ మంచి షూటర్ కాబట్టి మేం మినహాయింపు ఇచ్చాం. కేవలం రెండు పాయింట్ల తేడా ఉండడంతో మంచి స్కోరు సాధిస్తున్నాడు. అందుకే మేం అతనిని ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్ ట్రయల్స్‌లో చేర్చుకున్నాం’ అని తెలిపాడు.
Cricket
KKR vs RCB: సాల్ట్ కుమ్ముడు.. ఫామ్‍లోకి వచ్చిన శ్రేయస్.. కోల్‍కతా భారీ స్కోరు.. ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా కార్తీక్
IPL 2024 KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటింగ్‍లో అదరగొట్టింది. హౌం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కేకేఆర్ మరోసారి దుమ్మురేపింది. ఆర్సీబీతో నేటి (ఏప్రిల్ 21) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది.
సాల్ట్ మెరుపులు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది కోల్‍కతా నైట్ రైడర్స్. ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరోసారి వీర కుమ్ముడు కుమ్మాడు. 14 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో దుమ్మురేపాడు. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో నాలుగు ఓవర్లలోనే 55 పరుగులు చేసింది కోల్‍కతా. అయితే, ఆ తర్వాత ఐదో ఓవర్లో సాల్ట్‌ను ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు.
సూపర్ ఫామ్‍లో ఉన్న కేకేఆర్ మరో ఓపెనర్ సునీల్ నరైన్ (10) విఫలం కాగా.. అంగ్‍క్రిష్ రఘువంశీ (3) కూడా నిరాశపరిచాడు.
ఫామ్‍లోకి శ్రేయస్
ఈ సీజన్‍లో వరుసగా విఫలమవుతున్న కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు ఫామ్‍లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‍లో అర్ధ సెంచరీ చేశాడు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు శ్రేయస్. ఈ సీజన్‍లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. వెంకటేశ్ అయ్యర్ (16) కాసేపు నిలువగా.. అర్ధ శతకమైన వెంటనే శ్రేయస్ ఔటయ్యాడు. రింకూ సింగ్ (16 బంతుల్లో 24 పరుగులు) రాణించగా.. చివర్లో రమణ్‍దీప్ సింగ్ (6 బంతుల్లో 24 రన్స్; నాటౌట్) మెరిపించాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో అదరగొట్టాడు. ఆండ్రే రసెల్ (20 బంతుల్లో 27 పరుగులు నాటౌట్) చివరి వరకు ఉన్నా తన మార్క్ విధ్వంసం చేయలేకపోయాడు. అయితే, కోల్‍కతాకు మాత్రం భారీ స్కోరు దక్కింది. బెంగళూరు ముందు 223 పరుగుల భారీ లక్ష్యం ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ చెరో రెండు, మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఏడు మ్యాచ్‍ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్‍లో గెలువడం చాలా ముఖ్యం. మరి ఈ భారీ టార్గెట్‍ను బెంగళూరు ఛేదించగలదేమో చూడాలి.
కార్తీక్ రికార్డు ఇదే..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‍కు ఇది 250వ ఐపీఎల్ మ్యాచ్. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్‍లో 250 మ్యాచ్‍లు ఆడిన మూడో ఆటగాడిగా కార్తీక్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‍లో ఆరు జట్లకు కార్తీక్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ (2008-10, 2014), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012-13), గుజరాత్ లయన్స్ (2016-17), కోల్‍కతా నైట్ రైడర్స్ (2018-21), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2015, 2022 నుంచి..) తరఫున కార్తీక్ ఆడాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున దినేశ్ కార్తీక్ ఆడుతున్నాడు.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International8 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways7 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh7 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh11 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political7 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National8 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education7 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather7 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh7 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh7 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh7 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education11 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Cinema8 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?