Connect with us

Andhrapradesh

ప్రమాదపుటంచుల్లో ప్రపంచం

Published

on

పక్కనున్న ఇల్లు తగలబడుతుంటే మనది కాదు కదా అని వదిలేస్తే ఆ మంటలు మన ఇంటినీ కాల్చివేస్తాయి. ఇప్పుడు హమాస్‌-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఈ వాస్తవాన్నే నొక్కి చెబుతోంది.
రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఇంకా చల్లార నే లేదు. ఇంతలో హమాస్‌ రాజేసిన యుద్ధ జ్వాలలు లెబనాన్‌ మొదలుకొని జోర్డాన్, సిరియా, ఇరాక్‌ల వరకూ మొత్తం పశ్చిమాసియాను చుట్టుముట్టాయి. ఇదే సమయంలో ఎర్రసముద్రంలో మాటుగాసిన హౌతీ మిలిటెంట్లు అటుగా వచ్చిపోయే భారీ వాణిజ్య నౌకలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది.

గత నవంబర్‌లో అయిదువేల కార్లను మోసుకుపోగల ‘గెలాక్సీ లీడర్‌’ అనే నౌకపై హెలికాప్టర్‌తో దాడిచేసి, ఆ తర్వాత దాన్ని హైజాక్‌ చేశారు హౌతీలు. నౌకకు బహమాస్‌ జెండాయే ఉన్నా అది ఇజ్రాయెల్‌ కోటీశ్వరుడి షిప్పింగ్‌ కంపెనీదని హౌతీలు పసిగట్టారు. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్‌ యుద్ధనౌక, ఒక గ్రీక్‌ నౌక, నార్వే జెండాతో పోతున్న కెమికల్‌ ట్యాంకర్లున్న నౌక వీరి దాడులకు లక్ష్యంగా మారాయి. మధ్యలో రెండు చైనా, రష్యాల నౌకలపైనా దాడులు జరిగాయి. కానీ పొరపాటైందని హౌతీలు ప్రకటించారు.

జనవరి 15న వారు నేరుగా అమెరికా కార్గో నౌకపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఇంచు మించు 17 శాతం ఎర్రసముద్రం మీదుగా జరుగుతుందని అంచనా. పర్షియా జలసంధి నుంచి యూరప్‌కు తరలిపోయే చమురు, సహజవాయు ట్యాంకులన్నీ ఎర్రసముద్రం గుండా పోవాల్సిందే. కానీ ఈ దాడుల తర్వాత అందులో చాలా భాగం తగ్గిపోయింది. అనేక సంస్థలు ఆఫ్రికా చుట్టూ తిరిగి నౌకల్ని నడపాలని నిర్ణయించాయి. ఇందువల్ల సరుకు రవాణా వ్యయం భారీగా పెరిగిపోయింది.

ఇరాన్‌ పెంచి పోషిస్తున్న హౌతీల ఆగడాలు అరికడతామని అమెరికా, బ్రిటన్‌లు రంగంలోకి దిగాయి. అందుకు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ వంటివి సహకారం అందిస్తున్నాయి. హౌతీ మిలి టెంట్లు క్షిపణులతో, డ్రోన్‌లతో గత ఏడాది అక్టోబర్‌ 31న ఎర్రసముద్రంలోని ఇజ్రాయెల్‌ టూరిస్టు రిసార్ట్‌పై బాంబు దాడులు చేశారు. అయితే వాటిని ఇంటర్‌సెప్టర్ల సాయంతో ఇజ్రాయెల్‌ జయప్రదంగా అడ్డుకోగలిగింది. దాంతో రెండు ఈజిప్టు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత వారు అమెరికా ఎమ్‌క్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూల్చారు.

సమర్థవంతమైన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల సాయంతో హౌతీలు ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తున్న డ్రోన్‌లు, క్షిపణులను అమెరికా, ఇజ్రా యెల్‌ అడ్డుకోగలుగుతున్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టి అడపా దడపా నౌకలు బుగ్గిపాలవుతున్నాయి. గత నెల 10న అసంఖ్యా కంగా ఒకేసారి వదిలిన డ్రోన్లలో కొన్ని రక్షణ వ్యవస్థల్ని తప్పించుకెళ్లి అమెరికా యుద్ధ నౌకలోని ముగ్గురు నౌకాదళ సభ్యుల ప్రాణాలు తీశాయి. అమెరికా కూటమి దేశాలు సాగిస్తున్న దాడులు వృథా ప్రయాసగా మిగలటమే కాదు… చివరకు ప్రపంచయుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం వుంది.

Advertisement

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆగేదాకా ఎర్రసముద్రం ప్రశాంతంగా ఉండబోదని హౌతీలు చేసిన ప్రకటనను ప్రపంచదేశాలు సకాలంలో పట్టించుకోవాలి. 2004 మొదలుకొని గత రెండు దశాబ్దాలుగా నిత్యమూ యుద్ధరంగంలో నిలిచిన హౌతీలను తక్కువ అంచనా వేస్తే చేజేతులా వారిని హీరోలను చేసినట్టే! యెమెన్‌లో ఇరాన్‌-సౌదీ అరేబియాలు సాగించిన ఆధిపత్య పోరు నుంచి పుట్టుకొచ్చిన సంస్థ ‘హౌతీ’. మొదట్లో ఒక ముఠా నాయకుడి జేబుసంస్థగా మొదలైన ఈ సంస్థ షియాల్లోని ‘జైదీ’ తెగ పరిరక్షకురాలిగా అవతరించింది. దక్షిణ, తూర్పు యెమెన్‌ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న సున్నీలపై ఎడ తెగని దాడులు చేసి రాజధాని సానాను చేజిక్కించుకున్నారు.

ఈలోగా ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్యలు, అందుకు అమెరికా వత్తాసుగా నిలిచిన వైనాలను హౌతీలు స్వీయ ఎదుగుదలకు వాడుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ నాశనమే తమ ధ్యేయ మనీ, వారివల్ల అన్యాయానికి గురవుతున్న ముస్లింలు ఏ వర్గంవారైనా అండగా ఉంటామని హౌతీలు తమ చర్యల ద్వారా ప్రకటిస్తున్నారు. పాలస్తీనాలో సున్నీలు, షియాలు, క్రిస్టియన్లతో సహా భిన్న వర్గాలున్నా అక్కడ సున్నీలదే మెజారిటీ. హౌతీల ఎత్తుగడలను అమెరికా సరిగానే గ్రహించింది. అందుకే జనవరి నెలనుంచి ఇజ్రాయెల్‌కు సామరస్యత, శాంతి ప్రబోధిస్తోంది. కానీ ఆ దేశం వింటే కదా!

హౌతీలు ప్రపంచంలో ఒంటరివారు కారు. వారికి ఇరాన్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాగని వారు ఇరాన్‌ చెప్పుచేతల్లో ఉండే అవకాశం లేదు. ఎవరైనా తమ ఎదుగు దలకు తోడ్పడే వరకే వారికి మిత్రులు. నచ్చనిది చెప్పిన మరు క్షణం వారు శత్రువుతో సమానం. ఇరాన్‌పై ఎన్ని రకాల ఆంక్షలు విధించినా నానావిధ ఎత్తుగడలతో తనకంటూ మిత్రుల్ని పోగేసుకుంటోంది. హౌతీలకు అది అండదండలు అందివ్వటం వెనక రష్యా, చైనాలు లేకపోలేదు.

అందుకే ఆ రెండు దేశాలూ చోద్యం చూస్తూ నిలబడ్డాయి. ఇప్పుడు హౌతీల దుందుడుకు తనాన్ని కట్టడి చేయాలన్నా, కనీసం వారి చర్యల తీవ్రతను తగ్గించాలన్నా ఇరాన్‌ సాయం అవసరం. రష్యా, చైనాల జోక్యం తప్పనిసరి. ఈ దశలో ప్రతిష్ఠకు పోతే మున్ముందు మరిన్ని పరాభవాలు తప్పవనీ, ఇది మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందనీ అమెరికా, మిత్రదేశాలు గుర్తించాలి.
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమల సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! – TTD Seva Tickets for September 2024

Published

on

TTD Seva Tickets for September 2024: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్​లైన్​లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. సెప్టెంబర్​ నెలకు సంబంధించిన షెడ్యూల్​​ రిలీజ్ చేసింది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు : సెప్టెంబర్​ నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను జూన్​ 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే.. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్​ 18వ తేదీ ఉదయం 10 నుంచి జూన్​ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులకు నగదు చెల్లించిన తరువాత ఆర్జిత సేవల టికెట్లు ఖరారు అవుతాయని పేర్కొంది.

వర్చువల్ సేవ : కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జూన్​ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్​ చేయనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీవాణి టికెట్ల ఆన్​లైన్ కోటా : సెప్టెంబర్​ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారులు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నారు. అలాగే.. శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జూన్​ 22న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అదే రోజు.. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శన టికెట్లు : స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్​ నెలకు సంబంధించి గదులను జూన్​ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Advertisement

అలాగే ఈ నెల 24న ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200 దర్శన టికెట్లు) జులై నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే జులైలో స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ టికెట్లు ఈనెల 25న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసక్తి కలిగిన భక్తులు.. దేవస్థానం వెబ్​సైట్​ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్​ చేసుకోవాలని కోరింది.

Continue Reading

Andhrapradesh

AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

Published

on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం (జూన్ 13) బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్‌ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గత సర్కార్‌ వెలువరించిన పాత డీఎస్సీని బాబు సర్కార్‌ రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌, దరఖాస్తు, పరీక్ష తేదీలు వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా 2024 ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా అది వాయిదా పడింది.

కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు ఇలా.. మొత్తం ఖాళీలు 16,347

  • సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులు: 6,371
  • పీఈటీ పోస్టులు: 132
  • స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు: 7725
  • టీజీటీ పోస్టులు: 1781
  • పీజీటీ పోస్టులు: 286
  • ప్రిన్సిపల్స్‌ పోస్టులు: 52
  • ఐదు కీలక సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు..
    గురువారం సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలుపై సంతకాలు చేశారు. వాటిల్లో మొదటిది.. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ కల నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసేందుకు తొలి సంతకం చేశారు. రెండోది ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు ఫైల్‌పై భూ వివాదాల బాధితులు, రైతుల సమక్షంలో రెండో సంతకం పెట్టారు. సామాజిక భద్రత పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారు. యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు స్కిల్‌ సెన్సస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరిస్తూ ఐదో సంతకం చేశారు.

    Continue Reading

    Andhrapradesh

    Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు

    Published

    on

    Schools Reopening: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పాఠశాలలుsar తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు గురువారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి.‌

    ఏప్రిల్ 24న ప్రారంభమై వేసవి సెలవులు జూన్ 11తో ముగిశాయి. జూన్ 12న స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో వేసవి సెలవులు ఒక రోజు పొడిగించారు. దీంతో జూన్ 13న (గురువారం)తో పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్నాయి.

    ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ‌3:30 గంటలకు ఉంటాయి.‌ ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి.

    రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదనందున ఇప్పటి వరకు పాఠాశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించలేదు. పాఠాశాలలు ఎన్ని రోజులు ఎన్ని రోజులు నడుస్తాయి? దసరా, సంక్రాంతి, క్రిస్మస్, దీపావళి సెలవులు‌ ఎన్ని రోజులు? ఫార్మెటివ్ అసెస్మెంట్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ ఎప్పుడనేది రూపొందించలేదు. అయితే పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేయనున్నారు.

    యథావిధిగా విద్యా కానుక కిట్లు పంపిణీ
    మరోవైపు ప్రభుత్వం మారినంత మాత్రాన విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్లను ఆపొద్దని, వాటిని యథావిధిగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశాలు ఇచ్చారు. వాటిపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నప్పటికీ యథావిధిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ అధికారికంగా ట్వీట్ కూడా చేసింది.

    Advertisement

    “ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదు. జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు” అంటూ టీడీపీ అధికారికంగా ట్విట్టర్ లో పేర్కొంది.

    రాష్ట్రంలో జగనన్న విద్యాకానుకను రాష్ట్ర ముఖ్యమంత్రి 2021 ఆగస్టు 16న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఎనిమిది ఐటమ్స్ తో కూడిన కిట్లు ఇస్తారు. రెండు జతల స్కూల్ యూనిఫాం (స్టిచింగ్ ఛార్జీలుతో సహా), పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, తెలుగు-ఇంగ్లీష్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, బెల్టు, రెండు జతల నలుపు షూస్, రెండు జతల సాక్సులతో కూడి‌న కిట్లు ప్రతి విద్యార్థికి అందజేస్తారు.

    రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 44,57,441 మంది ఉన్నారు. వీరందరికీ జగనన్న విద్యా కనుక (జేవీకే) కిట్లును ఇవ్వనున్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో విద్యా కానుక కిట్లుపై సందిగ్ధత నెలకొంది. మాజీ సీఎం ఫోటో తో ఉన్న కిట్లు పంపిణీ చేయాలా వద్దా అని విద్యా శాఖ ఎదురు చూసింది.

    అయితే డబ్బు వృధా కాకుండా ఉండేందుకు జగన్ ఫోటో ఉన్నప్పటికీ కిట్లు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్‌లో నేటీ నుంచే విద్యా కానుక కిట్లు పంపిణీ జరుగుతాయి. అయితే కొద్ది రోజుల్లో మాత్రం జగనన్న విద్యా కానుక పథకం మారే అవకాశం ఉంది.

    అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠాశాల్లో పిఎం పోషణ, మధ్యాహ్నం భోజనం పథకం కొనసాగుతుంది. జగనన్న గోరుముద్ద పథకం పేరు కూడా కొన్ని రోజుల్లో మార్చనున్నారు.

    Advertisement
    Continue Reading
    National7 hours ago

    తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు- భక్తుల హర్షం- హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్ – Jagannath Temple Doors Open

    Andhrapradesh7 hours ago

    భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమల సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! – TTD Seva Tickets for September 2024

    National7 hours ago

    భారత్​లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్​ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! – US Student Visa India

    International7 hours ago

    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రూ.4లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన- ఇటలీకి మోదీ – G7 Summit 2024

    International7 hours ago

    ‘రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్​ చేస్తాం’- ఉక్రెయిన్​కు సపోర్ట్​గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!

    International7 hours ago

    ATA Convention : అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్.. రికార్డ్ స్థాయిలో హాజరైన తెలుగువారు!

    National7 hours ago

    Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు

    National7 hours ago

    NEET UG 2024 Re-Exam: ఎన్టీఏ కీలక ప్రకటన.. గ్రేస్‌ మార్కులు రద్దు! రెండోసారి నీట్‌ యూజీ పరీక్షకు సన్నాహాలు

    Andhrapradesh7 hours ago

    AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

    Andhrapradesh1 day ago

    Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు

    National1 day ago

    జైపూర్ నగల వ్యాపారి ఘరానా మోసం; అమెరికా మహిళను రూ. 6 కోట్లకు ముంచిన వైనం

    International1 day ago

    Kuwait Building Fire: కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 43 మంది భాారతీయులు సజీవదహనం

    International1 day ago

    విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం- మరో 9మంది మృతి

    Telangana1 day ago

    TGPSC Group1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17

    Health1 day ago

    ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?

    Health1 day ago

    Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..

    Spiritual2 days ago

    హుండీ ఆదాయం ఎంతో తెలుసా.. క్యూ లైన్ లు కూడా?

    Education2 days ago

    నీట్ ..యూజీ ప్రవేశ పరీక్షలను ఆపివేయలేం

    National2 days ago

    కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

    Andhrapradesh2 days ago

    ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

    International2 days ago

    భారతదేశంలో కలిసి పని చేయడానికి మేము సిద్ధం …చైనా ప్రధాని

    National2 days ago

    వీఐపీ సెక్యూరిటీ నుంచి NSG, ITBPకి విముక్తి- త్వరలో మోదీ సర్కారు కీలక నిర్ణయం – VIP Security Changes In India

    National2 days ago

    భారత ఆర్మీ కొత్త అధిపతిగా ఉపేంద్ర ద్వివేది- ఆరోజే బాధ్యతల స్వీకరణ

    International2 days ago

    హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..

    National2 days ago

    మోడీ తొలి విదేశీ పర్యటన….

    National2 days ago

    Odisha CM Mohan Majhi : ఒడిశా బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ.. కొత్త సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే?

    Andhrapradesh2 days ago

    AP Cabinet : చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు వీరే.. జనసేన నుంచి ప‌వ‌న్‌తో సహా ముగ్గురికి చోటు

    Cricket2 days ago

    Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

    National2 days ago

    NEET-UG 2024 Row: ‘అలా చేసే పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుంది’.. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

    Andhrapradesh2 days ago

    ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

    Business2 weeks ago

    Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

    Career3 weeks ago

    విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

    News2 weeks ago

    జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

    Business3 weeks ago

    ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

    National1 month ago

    IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

    Business2 weeks ago

    ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

    National2 weeks ago

    అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

    Crime News4 days ago

    జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

    Andhrapradesh5 days ago

    SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

    Education4 days ago

    వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

    Spiritual3 weeks ago

    చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

    Telangana3 weeks ago

    Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

    Andhrapradesh5 days ago

    ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

    Andhrapradesh2 weeks ago

    అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

    Spiritual4 days ago

    Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

    National4 days ago

    ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

    National2 weeks ago

    ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar

    National4 days ago

    నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

    Life Style4 weeks ago

    Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

    News1 month ago

    డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

    National3 days ago

    Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

    National2 weeks ago

    IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

    Andhrapradesh4 days ago

    250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

    Andhrapradesh2 weeks ago

    AP EAPCET 2024 Result Date: జూన్‌ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే

    Business3 weeks ago

    ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

    Spiritual3 weeks ago

    తిరుమ‌ల వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

    Andhrapradesh3 weeks ago

    ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

    National2 weeks ago

    బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

    National3 weeks ago

    Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

    Cinema2 weeks ago

    Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

    Trending