Technology
TS Graduate MLC Election 2024 : రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ – ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..!
TS Graduate MLC Election 2024: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారానికి తెర పడగా, ఇన్నిరోజులు పట్టభద్రుల వద్దకు ఉరుగులు, పరుగులు పెట్టిన అభ్యర్థులు రిలాక్స్ మోడ్ లోకి వచ్చేశారు.
మొత్తంగా ఈ స్థానంలో 52 మంది పోటీలో ఉండగా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంపై గురి పెట్టిన మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారోననే ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
మూడు పార్టీలు ఫోకస్….
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి మొత్తంగా 52 మంది పోటీలో ఉన్నారు.
రాష్ట్రంలో సంపూర్ణ బలంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా పట్ట భద్రుల స్థానాన్ని కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు మూడు ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడికక్కడ మీటింగ్ లు కూడా నిర్వహించి, పట్టభద్రులకు చేరువయ్యే ప్రయత్నాలన్నీ పూర్తి చేశారు.
ఇక సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ మేరకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఎన్నికను ఛాలెంజింగ్ గా తీసుకుని పూర్తి బాధ్యతలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఆ తరువాత నేరుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలను ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు ఇన్ ఛార్జ్ లుగా నియమించి, కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
605 పోలింగ్ కేంద్రాలు.. 4.61 లక్షల ఓటర్లు
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 12 జిల్లాల పరిధిలో మొత్తంగా 34 నియోజకవర్గాలున్నాయి. వాటి పరిధిలో మొత్తంగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటరుగా నమోదై ఉన్నట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. వారిలో పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుండగా, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లుండగా, ఐదు సెంటర్లు, జనగామలో 23,320 మంది ఓటర్లకు 27 కేంద్రాలు, హనుమకొండలో 43,483 ఓటర్లు ఉండగా 67, వరంగల్ లో 43,594 మంది ఓటర్లకు 59 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక మహబూబాబాద్ జిల్లాలో 34,759 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా 36, ములుగులో 10,237 మంది ఓటర్లకు 17, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12,460 మంది ఓటర్లకు 16 సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39,898 మంది ఓటర్లకు 55, ఖమ్మంలో 83,606 ఓటర్లకు 118, యాదాద్రి భువనగిరి లో 33,926 ఓటర్లకు 37, సూర్యాపేటలో 51,293 మందికి 71, ఇక నల్గొండలో 80,559 మంది ఓటర్లకు 97 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ చేసిన అనంతరం ఆయా సిబ్బంది ఎన్నికల కేంద్రాలకు చేరుకోనున్నారు.
ఎవరికి పట్టం కడతారోననే టెన్షన్…
సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికలో గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లు కాగా.. వారంతా ఎవరికి పట్టం కడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైవిధ్యమైన తీర్పునిచ్చిన తీరు కనిపిస్తుండగా, పట్ట భద్రులను ఒడిసి పట్టుకోవాలని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నెల 27 ఎన్నిక జరగనుండగా, పట్టభద్రులు ఎవరికి జై కొట్టారో తెలియాలంటే జూన్ 5వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఓటు వేయడం ఎలా…?
ఓటు వేసేటప్పుడు చేయకూడని అంశాలు….
Technology
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!
Whatsapp New Feature: వాట్సాప్ దీని గురించి తెలియని వారంటూ ఉండరేమో. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, వీడియోలు, మెసేజ్‌లతో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరి కోసం మెటా అనేక ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వాట్సాప్‌లో ఓ కొత్త ఫీచర్‌ని చేర్చింది. నిజానికి, గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ కమ్యూనిటీల్లో భాగమైంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్‌లో చేరడానికి ముందే దాని గురించిన సమాచారాన్ని పొందుతారు.
వాట్సాప్ అందుకున్న అప్‌డేట్‌ల గురించి సమాచారాన్ని అందించే ప్లాట్‌ఫారమ్ అయిన WABetaInfo, గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోందని తెలిపింది. ఈ కొత్త మార్పు iOS వెర్షన్ 24.16.75లో వచ్చింది.
ఈ ఫీచర్ ఇలా పని చేస్తుంది:
ఇప్పుడు ఈ క్రొత్త ఫీచర్ పని గురించి మాట్లాడినట్లయితే, ఇంతకు ముందు గ్రూప్‌లో వ్యక్తులను జోడించినప్పుడు గ్రూప్ నినాదం, ఇది దేని కోసం సృష్టించబడిందో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత గ్రూప్‌లో ఏ వ్యక్తిని యాడ్ చేసే ముందు అతను గ్రూప్‌కు సంబంధించిన వివరణను పొందుతాడు. దీంతో ఆ వ్యక్తి తనను గ్రూప్‌లో చేర్చుకోవాలనుకుంటున్నాడో లేదో అర్థం చేసుకోవచ్చు.
మీ సమాచారం కోసం ప్రస్తుతం ఈ కొత్త గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ iOS యాప్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో ఆపిల్ వినియోగదారులు వాట్సాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర వినియోగదారుల కోసం ఈ ఫీచర్ వచ్చే వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ పరిచయంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్ క్రియాశీలత, దాని ప్రయోజనం గురించి ముందుగానే తెలుసుకోగలుగుతారు. దీంతో గ్రూపులో చేర్చుకోవాలా వద్దా అన్నది తన ఇష్టానుసారం. అదే సమయంలో మెటా వాట్సాప్‌లోని ప్రొఫైల్ చిత్రంలో యానిమేటెడ్ అవతార్ కోసం కొత్త ఫీచర్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అమల్లోకి రానుంది.
Technology
WhatsApp Context Card : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కొత్త గ్రూపు సభ్యుల సేఫ్టీ కోసం కాంటెక్స్ట్ కార్డులు!
WhatsApp Context Card : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్రూపు మెసేజింగ్ ఫీచర్ల భద్రతను మెరుగుపర్చేందుకు రూపొందించిన కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. మెటా యాజమాన్యంలోని మెసేజ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు గుర్తుతెలియని యూజర్ల ద్వారా గ్రూపునకు యాడ్ చేసినప్పుడు వెంటనే ఒక అలర్ట్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.
గ్రూప్ నుంచి నిష్క్రమించడానికి షార్ట్‌కట్‌తో పాటు, వాట్సాప్ వినియోగదారులకు వారు జోడించిన గ్రూప్ గురించి సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఈ ఫీచర్ రూపొందించింది. అపరిచితులను గ్రూపులకు యాడ్ చేయకుండా నిరోధించడానికి వినియోగదారులను అనుమతించే సెట్టింగ్ సర్వీసును ఇప్పటికే అందిస్తుంది.
వాట్సాప్ గ్రూప్ సేఫ్టీ కాంటెక్స్ట్ కార్డ్‌లు :
అందిన వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం కొత్త కార్డ్‌ను విడుదల చేస్తోంది. యూజర్లు తమ కాంటాక్ట్‌లలో లేని యూజర్లను గ్రూప్‌కు యాడ్ చేసిన తర్వాత ఈ కార్డు డిస్‌ప్లే అవుతుంది. ఈ కార్డ్ చాట్ విండోలో కనిపిస్తుంది. గ్రూపు గురించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. వినియోగదారులకు గ్రూపు గురించి సందర్భాన్ని అందిస్తుంది. గ్రూప్ చాట్‌ల కోసం కొత్త కాంటెక్స్ట్ కార్డ్‌లు గ్రూప్‌కి యాడ్ చేసిన వాట్సాప్ యూజర్ నేమ్ ప్రదర్శిస్తాయి. వాట్సాప్ ఫీచర్‌ను చూపించే గ్రూపు స్క్రీన్‌షాట్, కార్డ్ యూజర్ సెట్ చేసిన పేరును ప్రదర్శిస్తుందని వెల్లడిస్తుంది.
గుర్తుతెలియని యూజర్ గ్రూప్ చాట్‌లో మెసేజ్ పంపినప్పుడు టిల్డే చిహ్నం (~)తో సూచిస్తుంది. వినియోగదారులు గ్రూపునకు ‘కాంటాక్టులో లేని యూజర్ కనెక్ట్ అయ్యాడు’ అని కూడా ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. కాంటెక్స్ట్ కార్డ్ కొత్త సభ్యునికి గ్రూపులో క్రియేట్ చేసిన యూజర్ పేరును కూడా సూచిస్తుంది.
వాస్తవానికి, గ్రూప్ క్రియేటర్ వాట్సాప్ సెట్టింగ్‌లకు యాడ్ చేసిన దానిపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఉండకూడదనుకునే గ్రూపులో జాయిన్ అయితే సమస్యాత్మక కంటెంట్‌ను రిపోర్టు చేయడానికి కాంటెక్స్ట్ కార్డ్ సెక్యూరిటీ టూల్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు గ్రూపు నుంచి నిష్క్రమించడానికి నిష్క్రమించు బటన్‌ను కూడా క్లిక్ చేయొచ్చు.
ప్రస్తుత వాట్సాప్ గ్రూప్ సెక్యూరిటీ యాక్షన్స్ :
2019లో, వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్‌ల ద్వారా అపరిచితులను గ్రూప్‌లో జాయిన్ కాకుండా నిరోధించడానికి యూజర్లను అనుమతించే Settings > Account> Privacy > గ్రూపుల కింద ఈజీ ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఎనేబుల్ చేసినప్పుడు వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్ట్ వెలుపల ఉన్న యూజర్ వారిని గ్రూప్‌కి యాడ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు గ్రూప్‌లలో జాయిన్ అయ్యేందుకు ఇన్విటేషన్ అందుకుంటారు.
Technology
విజయవంతమైన పుష్పక్ విమానం
పునర్ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్ లాంచ్ వెహికల్) ‘పుష్పక్’ను ఇస్రో మూడోసారి ప్రయోగించి పనితీరును సమీక్షించింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలోని డీఆర్‌డీవో ఆవరణలో ఆదివారం ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు. ప్రయోగంలో భాగంగా వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్.. పుష్పక్‌ను 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది.
స్వయంచాలిత వ్యవస్థల ద్వారా రన్‌వేను కనుగొన్న పుష్పక్.. నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది. రన్‌వేపై తొలుత దాని వేగం గంటకు 320 కి.మీ. ఉండగా.. పారాచూట్ సాయంతో 100 కి.మీ.కు వేగాన్ని కుదించుకుంది. అనంతరం బ్రేకులు ఉపయోగించుకుని నిశ్చల స్థితికి చేరుకుంది. పుష్పక్ చివరి సన్నాహక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.
-
Business5 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career6 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News5 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
National6 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business6 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business5 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
International6 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education5 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National5 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh5 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News5 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh5 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana6 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual5 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National5 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways5 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National5 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National5 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh5 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National5 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh5 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh5 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh5 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Political5 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political5 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National6 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh5 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National6 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Weather5 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Cinema8 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Business6 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Education5 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh9 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh5 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International6 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh5 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh5 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways4 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
News5 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
News6 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh4 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News5 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh5 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Cinema5 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
International5 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Spiritual6 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Business6 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?