Telangana
తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా
Tamilisai Soundararaja resigns: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్ సభకు ఆమె పోటీ చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవిని వదులుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.
గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళసై సౌందర్య రాజన్ మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డీఎంకే మహిళా నేత కనిమొళి 3.5 ఓట్ల మెజారిటీతో ఆమెపై గెలుపొందారు.
Telangana
Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!
తెలంగాణ ప్రజల ఇలవేల్పు. భక్తుల కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహ స్వామి.. ప్రజల చేత యాదగిరి నర్సన్నగా విరాజిల్లుతున్నాడు. అయితే.. గొప్ప చరిత్ర ఉన్న యాదగిరిగుట్టను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… అప్పటి సీఎం కేసీఆర్ 1200 కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునర్ నిర్మించారు. యావత్ దేశం అబ్బురపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2016 నుంచి ఐదేళ్ల పాటు శ్రమించి యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా మార్చారు. అంతేకాదు… యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మారుస్తూ… భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక ప్రధానాలయం పునర్నిర్మాణానికి ముందు వరకు ఉన్న ఆచారాలను అప్పట్లో తొలగించారు. భక్తులు కొండపై బస చేయడం, కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో స్నానం చేసి మొక్కులు తీర్చుకోవడం వంటి సాంప్రదాయాల్ని తొలగించారు. అంతేకాదు గుట్టపై పలు వాహనాల రాకపోకలపైనా పలు ఆంక్షలు విధించారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఆలయం అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పాత ఆచార, సంప్రదాయాలను మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యాదాద్రిని యాదగిరిగుట్టగా పిలవాలన్న రేవంత్ సర్కార్… ఆలయంలో మరిన్ని మార్పుల చేర్పులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే భక్తులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేసింది. ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. స్వామి సన్నిధిలో భక్తులు బస చేసే విధంగా డార్మెంటరీ హాల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కొబ్బరి కాయలు కొట్టడం, కొండపైకి ఆటోలు వెళ్లడం వంటి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. అంతేకాదు స్వామివారి క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు… ఇటీవలే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించారు. అలాగే ఏళ్లుగా వస్తున్న గిరిప్రదక్షిణ సంప్రదాయాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఇక తాజాగా ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానానికి అనుమతించారు. ఇక కొండపై పాత ఆచార సాంప్రదాయాలను పునరుద్ధరించడం పట్ల భక్తులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ప్రభుత్వాలు మారడంతో… యాదగిరిగుట్టపై ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల సౌకర్యాల కల్పనలోనూ మార్పులొస్తున్నాయి. ఇక ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… భక్తుల సౌకర్యార్ధం మరికొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి… ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..!
Telangana
అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచిపట్టు చీరలకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపానికి నిదర్శనం. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణహితంగా చీరను రూపొందించి మరోసారి జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఓ కళాకారుడు చాటిచెప్పారు.
యాదాద్రి జిల్లా చేనేత కార్మికులకు పుట్టినిల్లు..
ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపాలు ఖండాంతర ఖ్యాతిని సాధించాయి. ఈ ప్రాంతంలోని నేతన్నలు ఎన్నో చేనేత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఓ చేనేత కార్మికుడు పర్యావరణహితమైన చీరను రూపొందించి.. జాతీయస్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను చాటాడు. చౌటుప్పల్ మండలం కొయ్యల గూడెంకు చెందిన కర్నాటి ముఖేశ్ ఈ అరుదైన నేతను నేసాడు. కేంద్ర చేనేత, జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని జాతీయ పురస్కారానికి ఎంపిక చేయగా.. వారిలో తెలంగాణ నుంచి ముఖేశ్ ఈ అవార్డు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేశ్ బాల్యం నుండి తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని కొనసాగించారు. 15 ఏళ్లుగా ముఖేష్ పలు ప్రయోగాలను చేస్తూ ఈ రంగంలోనే ఉన్నారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే జాతీయ పురస్కారానికి రాష్ట్రం నుంచి 27 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరిలో ముఖేష్ ఒక్కరే రాష్ట్రం నుంచి జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు.
పర్యావరణహితమైన చీర..
కర్నాటి ముఖేష్ రెండేళ్లపాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన పది రకాల రంగులు అద్ది, వందపూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించారు. నూలును ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పొడి, కుంకుడుకాయ రసంతో శుద్ధిచేశారు. మగ్గంపై పడుగు, పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువుండే చీరను నేశారు. కర్నాటి ముఖేష్ చేనేత ఇక్కత్ చీరల తయారీలో నూతన ఆవిష్కరణల కోసం నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. 2022లో రాష్ట్రప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ జాతీయ చేనేత పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు కర్నాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక కావడం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్ సమయాల్లో మార్పులు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేసింది. ముఖ్యంగా హైస్కూల్ వేళల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగానే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మారస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఇకపై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15ల వరకు పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటి వరకు పనివేళలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45గా ఉండేవి. అయితే తాజాగా ఈ సమయాన్ని ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే మాత్రం జంట నగరాల్లో యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ కొనసాగనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంగన్వాడీల్లోనూ మార్పులు..
ఇదిలా ఉంటే విద్యావస్థల్లోనూ పలు మార్పులు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా అంగన్వాడీలను మరింత తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్లే స్కూల్స్‌తో తరహాలో అంగన్వాడీలను తీర్దిదిద్దనున్నారు. అంగన్వాడీల్లోనే బోధన అందించనున్నారు. ఇందులో భాగంగానే అంగన్వాడీలో ఒక టీచర్‌ను నియమించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇక వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు.
-
Business5 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career5 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
National6 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News5 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business5 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business5 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
International5 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education5 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National5 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh4 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh5 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Crime News5 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Telangana5 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual5 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National5 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways5 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National5 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National5 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh5 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National5 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh5 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political5 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh5 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political5 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National5 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh5 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National5 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Cinema8 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Weather5 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Business5 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Education5 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh9 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh5 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Andhrapradesh5 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International6 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Railways4 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh5 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
News5 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News6 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh4 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News5 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh5 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International5 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Spiritual5 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Business5 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Cinema5 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
International5 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు