International
Taiwan Tallest Skyscraper : తైవాన్‌లో భారీ భూకంపం.. చెక్కుచెదరని 101 అంతస్తుల భవనం.. ఈ స్టీల్ బాల్ ఎలా రక్షించిందంటే?
Taiwan Tallest Skyscraper : తైవాన్‌లో అతిపెద్ద భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదు కాగా.. ఈ భూకంపం ధాటికి అక్కడి దేశంలోని పలు నగరాల భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. కానీ, రాజధాని తైపీలోని ఒక ఎత్తైన 101 అంతస్తుల భవనం (ఆకాశహర్మ్యం) మాత్రం కొంచెం కూడా చెక్కుచెదరలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా భవనాల్లో ఇదొకటి కూడా. అయితే, భారీ భూకంపానికి ఈ భారీ భవనం తట్టుకుని నిలబడింది. అతికొద్ది నష్టంతో బయటపడింది.
సీఎన్ఎన్ ప్రకారం.. ఈ భవనంలో అతి పెద్ద గోళం కలిగి ఉండటం కారణంగానే భారీ భూకంపాన్ని తట్టుకుని నిలబడింది. ఈ ఎత్తైనా భవనం మధ్యలో భారీ పసుపు వర్ణపు గోళం ఉండటం చేత భూకంప తరంగాలను తట్టుకుని నిలబడటంలో సాయపడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ భవనం నిర్మాణం చాలా వినూత్నమైందని, అందుకే అంతటి భూకంపం వచ్చినా ప్రమాదం జరగలేదని అంటున్నారు.
660 మెట్రిక్ టన్నుల బరువు.. 41 స్టీల్ లేయర్లతో నిర్మాణం..
ట్యూన్డ్ మాస్ డ్యాంపర్ ‘డాంపర్ బేబీ’ అనే పేరుతో పిలిచే ఈ భారీ ఉక్కు గోళం 660-మెట్రిక్-టన్నుల బరువు ఉంటుంది. ఈ ఉక్కు గోళాన్ని భవనం మధ్యలో భూమి నుంచి 1,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. భూకంపం లేదా బలమైన గాలుల సమయంలో భవనం దెబ్బతినకుండా ఉండేలా గోళం ఊగుతుంది. వార్తా అవుట్‌లెట్ ప్రకారం.. భూకంపం వచ్చినప్పుడు లేదా బలమైన గాలులు వీచినప్పుడు ఈ ఉక్కు గోళం ఎతైనా భవనాన్ని ఊగకుండా 40శాతం వరకు తగ్గిస్తుంది.
41 స్టీల్ లేయర్లతో నిర్మించిన ఈ గోళాన్ని 87వ నుంచి 92వ అంతస్తుల మధ్య వేలాడుతూ ఉండేలా ఏర్పాటు చేశారు. దాదాపు 18 అడుగుల వ్యాసం ఉంటుంది. భవనం కదలికను నిరోధించడానికి 59 అంగుళాల పరిమితిలో స్వింగ్ అవుతుంది. తైపీలోని 101 అంతస్తుల భవనం.. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. తైవాన్‌లో ఇదో ఆకాశహర్మ్యం. భూకంపం సంభవించే ప్రాంతాలలో నిర్మాణాలను రక్షించడానికి వినూత్న ఇంజనీరింగ్‌ను ఉపయోగించి ఈ భవనం రూపకల్పన చేశారు.
విండ్-డంపింగ్ బాల్ అంటే ఏంటి? :
విండ్ డంపింగ్ బాల్ సాంకేతిక నామం.. ట్యూన్డ్ మాస్ డంపర్ (TMD)గా పిలుస్తారు. ఈ టీఎండీ అనేది భవనం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన నిష్క్రియ వ్యవస్థ. బలమైన గాలుల వల్ల భవనం ఊగిసలాటను తగ్గించడంలో సాయపడుతుంది. పొడవైన టవర్ కుప్పకూలిపోకుండా అడ్డుకుంటుంది. అయితే, ఇందులోని సాంప్రదాయక డంపింగ్ సిస్టమ్‌లు బయటకు కనిపించవు. కానీ, తైపీ 101 అంతస్తుల భవనంలో టీఎండీ చాలా క్రియాత్మకమైనది. పసుపు వర్ణంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సందర్శకులు గోళం కదలికతో పాటు డంపింగ్ సిస్టమ్ మొత్తం ఆపరేషన్ వీక్షించవచ్చు.
ట్యూన్డ్ మాస్ డంపర్ ఎలా పని చేస్తుంది? :
తైపీ 101 వెబ్‌సైట్ ప్రకారం.. తైపీ 101 అంతస్తు భవనంలో అమర్చిన గోళాకార డంపర్ భూకంపాలు లేదా టైఫూన్‌ల సమయంలో ముందుకు వెనుకకు కదులుతుంది. తైపీ 101 వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా ఈ కదలిక ఏదైనా తీవ్రమైన స్వింగ్ శక్తిని గ్రహిస్తుంది.
డంపర్ ఇంజనీర్లు భవనం కదలికను 40 శాతం వరకు తగ్గించగలదని, తద్వారా లోపల ఉన్నవారికి కదిలిన అనుభవం వంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. భూకంపం సమయంలో తైపీ స్కైలైన్‌ను సంగ్రహించే క్లోజ్డ్-సర్క్యూట్ టీవీ ఫుటేజ్ పగోడా ఆకారపు ఆకాశహర్మ్యం తేలికపాటి కదలికను సూచిస్తుంది. మరో భవనంపై ఉంచిన సెక్యూరిటీ కెమెరాలో భవనం వణుకుతున్నట్లు చూడవచ్చు.
International
యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఎవరు స్ట్రాంగ్?
యుద్ధం అంటేనే ఆయుధాలు, అగంబలంతో పని. ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లోనూ సేమ్ సీన్. ఆకాశమే యుద్ధభూమిగా చేసుకుని దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్..బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్నదానిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఏప్రిల్‌లో ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టమేమి జరగలేదు. ఇప్పుడు ఇరాన్ దాడులు ఎలా ఉంబోతున్నాయి..వాటిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇజ్రాయెల్‌ది తిరుగులేని రక్షణవ్యవస్థ. ఇరాన్ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. 2022, 2023లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఇజ్రాయెల్ ఇరాన్‌తో పోల్చితే రెండింతల కంటే ఎక్కువ అంటే దాదాపు 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గరున్న యుద్ధవిమానాల్లో దూరం నుంచి అటాక్ చేసే.. F15, F-35 లేటెస్ట్ విమానాలు ఉన్నాయి. ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకుని.. స్పీడ్‌గా దాడి చేస్తాయి.
320 విమానాలు
ఇరాన్ దగ్గర దాదాపు యుద్ధ సామర్థ్యమున్న 320 విమానాలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 1960 నాటి F-4, F-5, F-14 వార్ జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అయితే పాత విమానాల్లో ఎన్ని పనిచేస్తున్నాయో క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరమ్ డోమ్‌దే కీరోల్. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అన్నింటిన్నీ ఐరమ్ డోమ్ కూల్చేసింది. ఇరాన్‌కు చెందిన 300కి పైగా క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్ సిస్టమ్ ఉపయోగపడింది.
ఇరాన్‌లో 6లక్షల మంది సైనికులుంటే, ఇజ్రాయెల్ దగ్గర లక్షా 70వేల మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ దగ్గర 3వేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది. షార్ట్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్, డ్రోన్లను డెవలప్ చేసింది.
ఇజ్రాయెల్‌కు పెద్ద బలం దాని ఎయిర్‌ఫోర్స్, ఆయుధాలే. ఇరాన్‌లో కీలక టార్గెట్స్‌పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇరాన్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారులు, నాయకులు ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లోనే చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ నేవీ దగ్గర 220 నౌకలు, ఇజ్రాయెల్ దగ్గర 60 నౌకలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీపరంగా వీక్ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్‌కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు. ఇలా ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ఇరాన్ కంటే ఇజ్రాయెలే కాస్త అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్‌ను డెవలప్ చేసుకుందని అంచనాలు ఉన్నాయి.
International
రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు
Russian Ukraine War: యుద్ధం అంటేనే ఎవరి చేతుల్లో ఉండదు. మొదలు మాత్రమే ఉండి.. ముగింపు అన్నదే లేకుండా కొనసాగుతుంది. రష్యా, యుక్రెయిన్ మధ్య కూడా ఇదే సీన్ ఉంది. రెండున్నరేళ్లుగా కాల్పుల మోత మోగుతూనే ఉంది. దాడి, ప్రతిదాడితో ఉద్రికతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అటు పుతిన్, ఇటు జెలెన్‌స్కీ ఎవరూ తగ్గకపోవడంతో.. రష్యా, యుక్రెయిన్ వార్ మరింత టెన్షన్ పుట్టిస్తోంది. కుర్క్స్ ప్రాంతంలో రష్యా వర్సెస్ యుక్రెయిన్ అన్నట్లుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి యుక్రెయిన్ బలగాలు రష్యాలో 30 కిలోమీటర్ల దూరం దాకా చొచ్చుకెళ్లాయి. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత రష్యాలో యుక్రెయిన్ సైన్యం ఇంత లోపలికి చొచ్చుకెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్.
యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్. రష్యన్లు తమ సరిహద్దుల్ని రక్షించుకోలేని పరిస్థితి సృష్టించి వారిని అస్థిరపరచడమే టార్గెట్‌గా దాడులు చేస్తామంటోంది. మరోవైపు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ఆయుధాలు, వాహనాలతో వచ్చిన యుక్రెయిన్ బలగాలను అడ్డుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కుర్స్క్ ప్రాంతం నుంచి 76 వేల మందిని సేఫ్ జోన్లకు తరలించినట్లు చెబుతోంది. యుక్రెయిన్ దాడి చేసిన ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
రష్యన్ సేనల స్వాధీనంలో ఉన్న జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై దాడి జరిగింది. ఈ అటాక్‌పై రష్యా, యుక్రెయిన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అణువిద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే అంటోంది యుక్రెయిన్. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే అటాక్ చేశారని అంటున్నారు జెలెన్‌స్కీ. రష్యా మాత్రం యుక్రెయిన్ జరిపిన దాడుల్లోనే అణువిద్యుత్ కేంద్రంలో మంటలు వచ్చాయంటోంది. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2022 నుంచి రష్యన్ దళాల ఆధీనంలో ఉంది.
రష్యా, యుక్రెయిన్ వార్ వారం రోజులు క్రితం వరకు కాస్త చల్లబడినట్లుగానే కనిపించింది. దాడులు చేసుకుంటున్నా.. ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నట్లయితే బయటికి రాలేదు. మిడిల్ ఈస్ట్ వార్ సిచ్యువేషన్స్‌తో..రష్యా, యుక్రెయిన్ మధ్య మళ్లీ దాడులు పెరిగాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఆయుధాలు, యుద్ధనౌకలు సమకూర్చింది. ఇరాన్‌కు మద్దతుగా రష్యా ఆర్మ్స్, మిస్సైల్స్ పంపించింది. దీంతో సీన్ మారింది. అమెరికా టార్గెట్‌గా ఇరాన్, రష్యా కొత్త ప్లాన్ వేశాయి. ఇరాన్ తమ దగ్గర ఉన్న ఫాత్-360 అడ్వాన్స్‌డ్ క్షిపణులను రష్యాకు సప్లై చేస్తుంది. యుక్రెయిన్ మీద అటాక్‌తో అమెరికా అటెన్షన్‌ను.. డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది రష్యా. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అటాక్స్ జరిగే పరిస్థితుల్లో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గింది. రష్యాతో కలసి.. అమెరికా టార్గెట్‌గా వ్యూహాలకు పదునుపెట్టింది.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితులు చల్లబడ్డాయి. ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ దాడులు చేసేందుకు రెడీ అయింది. అంతలోనే ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగడంతో స్ట్రాటజీ మార్చింది ఇరాన్. హమాస్, హిజ్‌బొల్లా గ్రూప్స్ మాత్రం ఇజ్రాయెల్‌పై అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ మాత్రం.. రష్యాతో కలిసి అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. తమ దగ్గరున్న అడ్వాన్స్‌డ్ మిస్సైల్స్ రష్యాకు పంపించి.. యుక్రెయిన్‌పై అటాక్ చేయిస్తోంది. అమెరికా కాన్సంట్రేషన్ మొత్తం యుక్రెయిన్ మీదకు టర్న్ అయ్యాక.. ఏ టైమ్‌లోనైనా ఇజ్రాయెల్ మీద దాడి చేసి.. హమాస్ లీడర్లకు హత్యకు ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది ఇరాన్.
International
ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel
Iran-backed Attack On Israel : ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయనుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయని తెలిపింది. ఇంతవరకు ఘర్షణ వాతావరణం వరకే పరిమితమైన ఉద్రిక్తత పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత హనియె హత్యానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
పశ్చిమాసియాకు అమెరికా అణు జలాంతర్గామి
అటు తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని పంపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బయల్దేరిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్‌తో
ఆస్టిన్ ఆదివారం రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్ తెలిపారు. రానున్న 24 గంటల్లోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్, లెబనాన్‌లు దాడి చేయనున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి.
సంయమనం పాటించండి ప్లీజ్
ఇరాన్ సంయమనం పాటించాలని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు కోరాయి. అమెరికా, ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను అవి సమర్థించాయి. గాజాలో 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి. తన దగ్గర ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టాలని ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
Iran urges OIC to unite against Israel
ఇరాన్ మాత్రం ఏ విషయంలో తగ్గడం లేదు. ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు నుంచి రక్షించుకునే విషయంలో ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్ కోరుతోంది. సౌదీ అరేబియా జెడ్డాలో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ- (ఓఐసీ) అత్యవసర సమావేశంలో ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఈ మేరకు ఆయా ముస్లిం దేశాలకు విజ్ఞప్తి కూడా చేశారు. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్ వినతిపై, ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశమైంది.
హనియా హత్యను పాశ్చాత్య దేశాలు ఖండించలేదని, ప్రాంతీయ స్థిరత్వంపై వాటికి ఆసక్తి లేదని ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘెరీ కని ఆరోపించారు. హనియా హత్యలో ఇజ్రాయెల్, అమెరికా పాత్ర ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. దానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ ప్రతినబూనింది కూడా.
-
Business7 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career7 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News7 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business7 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business7 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International7 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education6 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National6 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh6 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News6 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana7 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National7 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National6 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National6 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh6 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh6 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National6 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National7 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political6 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National7 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh6 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Business7 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Andhrapradesh6 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
International7 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Railways5 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
International7 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh7 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh6 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Business7 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema7 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?