Connect with us

International

Russia-China Ties : ఎవరు పెద్దన్న.. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం!

Published

on

Russia-China Ties : రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే. ఇప్పటిదాకా చూడని మార్పులను ఇకముందు చూసే అవకాశముందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. దీనర్ధం అమెరికాకు చెక్‌పెట్టడమే. ప్రపంచ క్రమాన్ని మార్చాల్సిన అవసరముందని పుతిన్ యుక్రెయిన్ యుద్ధ సమయంలో పదే పదే అన్నారు. అదే లక్ష్యంతో రష్యా, చైనా కలిసి పనిచేస్తున్నాయి. రష్యా, చైనా మధ్య చారిత్రక, చిరకాల మైత్రీ బంధం ఉన్నప్పటికీ… అమెరికా ఏకధ్రువ ప్రపంచ విధానాన్ని మార్చాలన్న భౌగోళిక రాజకీయ లక్ష్యం.. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ స్నేహం అవకాశవాదం కాదని, ప్రపంచానికి సుస్థిరత కలిగించే అంశమని ఇరుదేశాధినేతలు అంటున్నారు. తమ మైత్రికి రెండు దేశాలు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ.. మొత్తంగా అమెరికా కలవరపడేలా ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయన్నది మాత్రం అంగీకరించి తీరాల్సిన నిజం.

అమెరికా అగ్రరాజ్యంగా మారిన తర్వాత అంతర్జాతీయంగా కీలక ఘటనలన్నీ ఆ దేశం కనుసన్నల్లోనే జరిగేవి. ఎవరు, ఎవరికి ఆయుధాలు అమ్మాలి..ఎవరు కొనాలి..అణుబాబులు ఎవరు తయారుచేయాలి.. ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి వంటివాటన్నింటినీ పరోక్షంగా పర్యవేక్షించేది అమెరికా. అమెరికాకు ఇష్టం లేకపోతే..ఓ దేశంలో ప్రజాదరణ ఉన్న నేత కూడా మంత్రి పదవి దక్కించుకోలేరన్న ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు అమెరికా ఆ స్థితిలో లేదు. అసలు సొంత వ్యవహారాలే చక్కపెట్టుకోలేక సతమతమవుతోంది. అలాగని అమెరికాని తక్కువ అంచనా వేయడానికీ లేదు. అందుకు వేర్వేరు దారుల్లో కాకుండా శత్రువుకు ఉమ్మడిగా చెక్‌ పెట్టేందుకు రష్యా, చైనా ప్రయత్నిస్తున్నాయి.

ఒకప్పుడు అమెరికాకు శత్రుదేశం అంటే.. అనేక దేశాలకు శత్రువే అన్న అభిప్రాయం ఉండేది. తమ శత్రుదేశంతో మిగిలిన ఏ దేశమూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకుండా అమెరికా పర్యవేక్షించేది. ఆంక్షల పేరుతో హెచ్చరించేది. కానీ అమెరికా ఇప్పుడు ఆ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించే స్థితిలోలేదు. ఇరాన్‌తో తాజాగా భారత్ కుదర్చుకున్న చాబహార్ పోర్టు నిర్వహణా ఒప్పందమే ఇందుకు ఉదాహరణ. ఒప్పందానికి ముందూ తర్వాత ఆంక్షల పేరుతో అమెరికా భయపెట్టేందుకు ప్రయత్నించినా భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే రష్యా దగ్గర ఎవరూ చమురు కొనకుండా చేయాలన్న అమెరికా ప్రయత్నాలను కూడా భారత్ తిప్పికొట్టింది. యుక్రెయిన్ యుద్ధం మొదలయిన తర్వాత భారత్ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది.

ప్రపంచ పెద్దన్న హోదా నుంచి తప్పించడానికే.. :
ఇక రష్యా, యుక్రెయిన్ యుద్ధం సంగతే చూసుకుంటే….రష్యాతో యుద్ధం విరమింపచేసేందుకు, యుద్ధంలో యుక్రెయిన్ గెలిచేలా చేసేందుకు, రష్యాకు నష్టం కలిగించేందుకు అమెరికా అన్ని అస్త్రాలూ ప్రయోగించింది. కానీ యుద్ధాన్ని కానీ, యుక్రెయిన్ వినాశనాన్ని కానీ అమెరికా ఆపలేకపోయింది. అసలు రష్యా యుద్ధానికి కారణంగా చూపిన యుక్రెయిన్‌కు నాటో సభ్యత్వాన్ని సైతం ఇంతవరకూ నెరవేర్చలేకపోయింది అమెరికా. చాలా ప్రపంచ దేశాలు గతంలోలా అమెరికా అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. అగ్రరాజ్యం పెత్తననానికి తలొగ్గడం లేదు. ఇదే అదనుగా అమెరికా ప్రపంచ పెద్దన్న హోదా నుంచి తప్పించడానికి అటు పుతిన్, ఇటు జిన్‌పింగ్ విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు.

యుద్ధం పరిస్థితుల తర్వాత రష్యాలో అంతర్గతంగా అసంతృప్తి ఉందన్న ప్రచారాన్ని ఐదోసారి అధ్యక్షునిగా ఎన్నికవడం ద్వారా పుతిన్ తిప్పికొట్టారు. ఇంట గెలవడంతో ఇక రచ్చ గెలిచే పనిమొదలుపెట్టారు. తొలి విదేశీ పర్యటన కోసం చైనా వచ్చిన పుతిన్ యుక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్, జిన్‌పింగ్ ప్రకటించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషిచేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు. మొత్తంగా అమెరికా కోరుకుంటేనో, ఒత్తిడి తెస్తేనో యుద్దం ఆగదని, తాము ఆపాలనుకుంటే మాత్రమే యుద్ధం ఆగుతుందని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు పుతిన్. అలాగే రష్యా, చైనా బంధం అవకాశవాదం కాదని, రెండు దేశాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సాగనివ్వబోమని పుతిన్, జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల ప్రజలతో పాటు మొత్తం ప్రపంచం సుస్థిరతకు, శాంతికి తమ మైత్రీబంధం ప్రయోజనం కలిగిస్తుందని విశ్లేషించారు.

Advertisement

చైనా పర్యటనలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. పుతిన్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పుతిన్, జిన్ పింగ్ అనుకున్నట్టుగా అమెరికాకు చెక్‌ పెట్టడానికి రష్యా, చైనా అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. చైనా ఆర్థిక వృద్ధిరేటు మందగమనంలో సాగుతోంది. వృద్ధ జనాభా, ఉత్పాదకత గతంలో ఉన్నంత స్థాయిలో లేకపోవడం, నియంతృత్వ పాలన, తైవాన్ అంశం వంటివి చైనాకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారడం, అమెరికా సహా ఇతర దేశాల ఆంక్షలు, నాటో విస్తరణ, దీర్ఘకాలికంగా పుతిన్ అధికారంలో ఉండటంతో పెరిగిపోతున్న రాజకీయ అసంతృప్తులు వంటివాటిని రష్యాకు అడ్డంకులుగా ఉన్నాయి. ఈ సవాళ్లను దాటుకుని 71 ఏళ్ల పుతిన్, 70 ఏళ్ల జిన్‌పింగ్ రష్యా, చైనాలను ప్రపంచంలో ఏ హోదాలో నిలబెడతారన్నది చూడాల్సి ఉంది.

చైనా అతిపెద్దపోటీదారుగా, రష్యా ప్రమాదకరదేశంగా :
అమెరికా మాత్రం రెండు దేశాలను శత్రువుగానే చూస్తోంది. చైనాను అతిపెద్దపోటీదారుగా, రష్యాను ప్రమాదకరదేశంగా అమెరికా పరిగణిస్తోంది. పుతిన్‌ను హంతకుడిగా, జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు బైడన్.. ఈ నిర్వచనాలు ఎలా ఉన్నప్పటికీ.. అగ్రరాజ్యం పరిస్థితి గతంలోలా లేదన్నది మాత్రం అంగీకరించాల్సిందే. అసలు ఈ ఏడాది అమెరికాలో జరగబోయే ఎన్నికలపై కూడా రష్యా, చైనా ప్రభావం చూపబోతున్నాయి. 2016లో ట్రంప్ గెలుపుకు పుతిన్ సహకరించారన్న ప్రచారం ఉంది. అదే తరహాలో ఈ సారి కూడా బైడన్‌ను గద్దెదింపి ట్రంప్‌కు అమెరికా అధికారపీఠం కట్టబెట్టాలని పుతిన్, జిన్‌పింగ్ భావిస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. మొత్తంగా ఇతర దేశాలకు అధినేతలను నియమించే స్థాయి నుంచి అమెరికా తమ దేశ ఎన్నికలనూ శత్రుదేశాలు ప్రభావితం చేసేస్థాయికి దిగజారిపోయింది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

International

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియామకం- ప్రమాణ స్వీకారం అప్పుడే!

Published

on

Nepal New Prime Minister : చైనా అనుకూలవాది!, CPN-UML చైర్మన్ కేపీ శర్మ ఓలీను నేపాల్​ కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76-2 ప్రకారం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఓలీని కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. నాలుగోసారి ప్రధానిగా నియమితులైన ఓలీ, మంత్రివర్గంతో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల, నేపాల్ ప్రధానిగా ఉన్న పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.

నేపాల్​లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, పాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ప్రచండ, ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలికి చెందిన పార్టీ సీపీఎన్‌-యుఎంఎల్‌ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కూలింది. యుఎంఎల్, నేపాల్​ కాంగ్రెస్ పార్టీ కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Continue Reading

International

ఎక్స్​లో 100 మిలియన్ల ఫాలోవర్స్​- ప్రపంచ నేతల్లో మోదీయే టాప్​!

Published

on

PM Modi followers on X : ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఫీట్​ సాధించారు. మైక్రో బ్లాగింగ్​ సైట్ ఎక్స్​లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) దాటింది. గతంలో తనను ఫాలోవర్స్​ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పిన మోదీ, ఇప్పుడు ఆ రికార్డును ఆయనే బద్దలుగొట్టారు. దీనిపై ప్రధాని మోదీహర్షం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో ఉండటం, ఈ సామాజిక మాధ్యమం వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు తదితర వాటికి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని పోస్ట్‌ చేశారు. 2009లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్‌ వినియోగించడం ప్రారంభించారు. అనతికాలంలోనే 2010లో ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ఈ స్థాయి ఆదరణ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎక్స్‌లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Continue Reading

International

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైరల్

Published

on

Donald Trump Injured in Shooting : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పై కాల్పులు జరిపారు. ట్రంప్ చెవికి బుల్లెట్ తగలడంతో తీవ్ర గాయమైంది. స్టేజీపైనే ట్రంప్ కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి భద్రత కల్పించారు. ఈ కాల్పుల్లో ట్రంప్ గన్ మెన్ సహా, ఎన్నికల సభలో పాల్గొన్న పౌరుడు మరణించినట్లు తెలిసింది. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

దుండగులు కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ చెవికి గాయమై రక్తస్రావం కావడంతో ఆయన్ను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మాజీ అధ్యక్షుడిపై కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చికిత్స అనంతరం ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒక దుండగుడిని హతమార్చగా.. మరో దుండగుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఆస్పత్రిలో చికిత్స అనంతరం కొద్ది గంటలకే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు.


కాల్పుల ఘటనపై ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. మన దేశంలో ఇలా జరగడం నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం మరణించిన షూటర్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. నా కుడి చెవి పైభాగానికి బెల్లెట్ తగిలింది. బుల్లెట్ గాయం కాగానే ఏదో తప్పు జరిగిందని నాకు వెంటనే అర్ధమైంది. ఎందుకంటే నేను పెద్దశబ్దం విన్నాను. తుపాకి కాల్పులు మోతతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారని ట్రంప్ చెప్పారు.


ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో స్పందించారు. అమెరికాలో హింసకు చోటు లేదు. ఇలాంటి ఘటనలు ఖండించేందుకు అందరం ఏకంగా కావాలని బైడెన్ అన్నారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల ద్వారా ఆయన వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. అమెరికాలో హింసకు తావు లేదని అన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Continue Reading
Agriculture4 hours ago

ఎన్నో ఏళ్లుగా తండ్రి, తల్లి పేరుతో భూమి ఉన్న వారికి ఈ రోజే కొత్త ఆర్డర్

Political4 hours ago

ఏపీలో మధ్యంతర ఎన్నికలు?: హింట్ ఇచ్చిన సాయిరెడ్డి

Andhrapradesh19 hours ago

బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ఆదాయం

Andhrapradesh19 hours ago

AP Private Universities Fee : ఏపీలోని ప్రైవేట్ వ‌ర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖ‌రారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి

International19 hours ago

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియామకం- ప్రమాణ స్వీకారం అప్పుడే!

International19 hours ago

ఎక్స్​లో 100 మిలియన్ల ఫాలోవర్స్​- ప్రపంచ నేతల్లో మోదీయే టాప్​!

International1 day ago

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైరల్

Business1 day ago

పోస్టాఫీసులో ఖాతా ఉన్న వారికి నిర్మలా సీతారామన్ ఊహించని శుభవార్త

Weather1 day ago

హెచ్చరిక: బంగాళాఖాతంలో అల్పపీడనం

Spiritual1 day ago

Puri Jagannath Temple: తెరుచుకున్న పూరీ జగన్నాథ రత్న భాండాగారం.. దేశం చూపు మొత్తం అక్కడే!

News1 day ago

Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు

Salaries2 days ago

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు

News2 days ago

Ambani Wedding Gifts: రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్.. బాక్సులో వెండి నాణెలు సహా..!

Career2 days ago

Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్‌

Spiritual2 days ago

తిరుమల వసతి గదుల బుకింగ్‌లో సమూల మార్పులు: భారీగా ప్రక్షాళన

Andhrapradesh2 days ago

ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

National3 days ago

Monsoon Travel Tips: మనదేశంలో ఈ ప్రదేశాలను సరస్సుల నగరాలు అని అంటారు? ఈ సీజన్‌లో పర్యటనకు బెస్ట్ ఆప్షన్

International3 days ago

విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ‘ప్రచండ’ ఓటమి- తదుపరి పీఎం ఎవరంటే?

National3 days ago

2060 నాటికి భారత జనాభా 170 కోట్లు- 63.3 కోట్లకు పడిపోనున్న చైనా! – un report on population

National3 days ago

Anant Ambani Radhika Wedding : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం.. గణేష్ స్థాపన నుంచి పాగ్ ఫెరా వరకు సాంప్రదాయ గుజరాతీ షాదీ ఆచారాలివే..!

National3 days ago

Trainee IAS: తుత్తర ఎన్ని తిప్పలు తెస్తుందో చెప్పడానికి ఈమె ప్రత్యక్ష ఉదాహారణ

National3 days ago

Delhi: కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..

Education3 days ago

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..

Andhrapradesh3 days ago

ఏపీలో స్దానిక సంస్థలకు గుడ్ న్యూస్- మరో హామీ నెరవేర్చిన కూటమి సర్కార్..!

Railways3 days ago

తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!

National4 days ago

Agniveer Scheme: అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. ఇక సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో రిజర్వేషన్లు

Andhrapradesh4 days ago

Tirumala PrankVideo: తిరుమల క్యూలైన్లలో యూ ట్యూబర్‌ ప్రాంక్ వీడియో, నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలకు టీటీడీ ఆదేశం

National4 days ago

NEET UG Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్‌!

Andhrapradesh4 days ago

రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు.. అప్పటి నుంచే అందుబాటులోకి..

National4 days ago

పాక్ యుద్ధ విమానం ఎఫ్ 16ను లాక్ చేసి… దాయాదిని వణికించిన కార్గిల్ హీరో

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National2 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education1 month ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National1 month ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News1 month ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Spiritual1 month ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National1 month ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh1 month ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh1 month ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

National1 month ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh1 month ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Political4 weeks ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh1 month ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh1 month ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh1 month ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Political1 month ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Railways4 weeks ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Andhrapradesh3 weeks ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh1 month ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Spiritual1 month ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Business2 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh4 weeks ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Trending