Spiritual
రామనామం తారక మంత్రం ఎలా అయ్యింది.
మన భారతదేశంలో రామ్ అనే పేరు ఎంతో ప్రసిద్ధి చెందినది. రామ్ అనే పేరు సంస్కృత పదం.. ఇది ఎంతో శక్తివంతమైనదని పురాణాలు చెబుతున్నారు. ఎందుకంటే రామ్ అనే పేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది.
రామ్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శ్రీరాముడు, ఆయనే రామాయణ కథానాయకుడు.. ధర్మానికి కట్టుబడి రాజ్యాన్ని పాలించిన ధర్మ రక్షకుడు… పురుషులలో సర్వోన్నత గుణాలు కలిగిన పురుషోత్తముడు.. . ఇలాంటి గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షాత్ భగవంతుని స్వరూపాలే, అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన పేరు నేటికీ నిలిచి ఉంది.
ప్రత్యేకంగా హిందువులలో రామ్, శ్రీరామ్, జానకీరామ్, తారకరామ్ అంటూ రాముని పేరును తమ పేర్లుగా పెట్టుకుంటారు. మంచి గుణవంతుడు అయిన వారిని ‘రాముడు మంచి బాలుడు’ గా అభివర్ణిస్తారు. సిద్ధ యోగ మార్గంలో జపించే నామసంకీర్తనలలో మనకు తరచుగా వినిపించే భగవంతుని సంస్కృత నామాలలో రాముని పదం కూడా ఒకటి. రామ అనే పేరు సంస్కృత పదం రామ్ నుండి వచ్చింది. ఈ పదానికి ప్రశాంతత, విశ్రాంతి, ఆనందం, సంతోషపరచడం’ ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా సంతోషపెట్టువాడు, ఆనందకారకుడు, ప్రశాంత వదనుడు, ప్రకాశవంతుడు రాముడు అవుతాడు. దశరథుడి ఆనందం శ్రీరాముడే కాబట్టి దశరథ నందనుడిగా, వెన్నెల వంటి చల్లని ప్రకాశాన్ని పంచుతాడు కాబట్టి రామచంద్రుడు.. రామచంద్ర ప్రభువులా, రఘు వంశానికి చెందిన వాడు కాబట్టి రాఘవగా శ్రీరాముడిని వివిధ పేర్లతో పిలుచుకుంటారు.
వాల్మీకి మహర్షి రచించిన గొప్ప సంస్కృత పురాణ కావ్యమైన రామాయణం శ్రీరాముని జీవితాన్ని వివరిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని నమ్ముకొన్నాడు, యుద్ధాన్ని గెలిచి వీరుడనిపించుకున్నాడు, శత్రువులను సైతం కరుణించే కరుణామయుడయ్యాడు, ధర్మసంస్థాపనకు వచ్చిన సాక్షాత్ విష్ణువు ఏడవ అవతారంగా కీర్తి పొంది, దేవుడయ్యాడు. అందుకే రామ నామం ఒక మంత్రం అయింది. ఆపదల నుంచి కాపాడే శ్రీరామ రక్ష అయింది.
రామ నామం తరచుగా తలుచుకునేందుకు తమ పిల్లలకు పేర్లుగా పెట్టుకుంటారు. కేవలం దీనిని పేరుగా మాత్రమే కాకుండా శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా శ్రీరామ్ లేదా సియా రామ్ లేదా సీతా రామ్ అంటూ అభినందించుకుంటారు. అలాగే ‘జై శ్రీరామ్’ అంటూ నమస్కారం పెడుతూ తమ అత్యుత్తమ సంస్కారాన్ని ప్రదర్శిస్తారు
Spiritual
తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అందులో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించటం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పాటు లాబ్ రిపోర్టులు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగినట్లుగా హైందవ సమాజం భావించింది.
దేశ వ్యాప్తంగా ఆలయాలలో ప్రసాదాలపై దృష్టి:
హిందువుల నుండి ఈ ఘటన నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు గతంలో జగన్ సర్కార్ హయాంలో తిరుమలలో లడ్డూలలో కల్తీ జరిగిందని, తిరుమలలో అన్నప్రసాదం కూడా నాణ్యత లేకుండా పోయిందని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ దేశవ్యాప్తంగా అనేక ఆలయాలలో ప్రసాదాల తయారీపైన దృష్టి సారించారు.
తెలంగాణా రాష్ట్రంలోనూ ప్రసాదాల తయారీపై ఫోకస్:
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆలయాలలోని ప్రసాదాలను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి ల్యాబ్ కు పంపించారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలలో ప్రసాదాల తయారీ విషయంలో నాణ్యత పైన, ఆలయాల పవిత్రతను కాపాడడం పైన దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది
Spiritual
కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు
శ్రీకృష్ణుడు అత్యంత ప్రీతిపాత్రుడు. చాలా మంది విదేశీయులు కూడా శ్రీకృష్ణునిపై భక్తి విశ్వాశాలను కలిగి ఉంటారు. ఎంతో భక్తిశ్రద్దలతో పూజిస్తారు. భగవంతుడిని ఎప్పుడైనా పూజించవచ్చు. అయితే హిందూ మతంలో కొంత మంది దేవుళ్ళను తిధుల ఆధారంగా ప్రత్యేకంగా పూజిస్తారు. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పండుగలు ఉన్నాయి. ఉదాహరణకు చైత్రమసంలోని నవమిని శ్రీరామ నవమి అని.. భాద్రప్రదమాసం లోని చతుర్ధిని వినాయక చవితి అని శ్రీ కృష్ణుడి పుట్టిన తిధిని జన్మాష్టమి అని ఇలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. శ్రీకృష్ణుని జన్మదినాన్ని.. కృష్ణ జన్మాష్టమిగా 2024లో కూడా ఘనంగా జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.
మధురలో కృష్ణ జన్మాష్టమి
మధురలోని ప్రతి అణువణువున శ్రీకృష్ణుడు ఉన్నాడని విశ్వాసం. ఇక్కడ జన్మాష్టమి పండుగను రెండు భాగాలుగా జరుపుకుంటారు. మొదటి వేడుకగా ఝులన్ ఉత్సవం, రెండవ ఉత్సవం ఘాట్. ఝులన్ ఉత్సవం సందర్భంగా, మధురలోని ప్రజలు తమ ఇళ్లలో ఊయలలను ఏర్పాటు చేస్తారు. వాటిలో బాల కృష్ణుడి విగ్రహాలను ఉంచుతారు. ఈ ఊయలలో శ్రీకృష్ణుడు ఊగుతూ భక్తులు చేసే సేవలను అందుకుంటాడు. స్వామికి పాలు, తేనె, నెయ్యి, పెరుగుతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు, నగలు ధరింపజేస్తారు.
రెండవ భాగం ఘాట్ సంప్రదాయం ప్రకారం,.. ఆ ప్రదేశంలోని ప్రతి ఆలయానికి ఒకే రంగులో లేదా కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రతి ఆలయంలో పూజలు ఏకకాలంలో జరుగుతాయి. ఆలయ గంటలు ఏకకాలంలో మోగుతాయి. భక్తులు రాధ కృష్ణ నామాలను జపిస్తారు. ఈ సమయంలో మధుర, బృందావన్ దేవాలయాలలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది.
మధ్యప్రదేశ్ లో కృష్ణ జన్మాష్టమి
మధ్యప్రదేశ్‌లో కూడా కృష్ణ జన్మాష్టమి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఈ పండుగను కాస్త భిన్నంగా జరుపుకుంటారు. గత 100 సంవత్సరాలుగా శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత అతని జాతకాన్ని తయారు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి నామకరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో శ్రీకృష్ణునికి రకరకాల పేర్లు పెడతారు.
ద్వారకలో కృష్ణ జన్మాష్టమి
ద్వారక గుజరాత్‌లో ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత, శ్రీకృష్ణుడు ఇక్కడ స్థిరపడ్డాడని.. తన పరివారంతో చాలా సంవత్సరాలు నివసించాడని చెబుతారు. ఈ ప్రదేశం గొప్ప పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నగరాన్ని శ్రీకృష్ణుడి అన్న బలరాముడు నిర్మించాడని కూడా నమ్ముతారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరం మొత్తం అందంగా అలంకరించబడుతుంది. ఇక్కడి ఆలయాల వైభవం కూడా పూర్తిగా భిన్నమైన రీతిలో కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో దేవాలయాలలో భజన, కీర్తన, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలు కూడా గర్భా నృత్యం చేస్తూ కనిపిస్తారు.
ముంబైలో కృష్ణ జన్మాష్టమి
సర్వసాధారణంగా ముంబైలో గణేష్ చతుర్థి సందర్భంగా విభిన్నమైన ఉత్సాహం ఉంటుంది అని అనుకుంటారు.. అయితే ఇక్కడ జరిగే శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా తక్కువేం కాదు. దహి అండి .. అంటే ఉట్టి కొట్టే కార్యక్రమం ముంబైలో చాలా వైభవంగా, అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడి పిరమిడ్లను తయారు చేస్తారు. ఈ సమయంలో భిన్నమైన వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తోంది. ముంబైలోని జన్మాష్టమి కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని infoline.one ధృవీకరించడం లేదు
Spiritual
ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?ఆగస్టు 26నా, 27నా? మధుర, బృందావనంలో ఎప్పుడు జరుపుతారంటే?
కృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది శ్రీ మహా విష్ణువు 10 అవతారాలలో ఎనిమిదవ అవతారం.. ఇరవై నాలుగు అవతారాలలో ఇరవై రెండవది అయిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకునే వార్షిక హిందూ పండుగ. కృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో ముఖ్యమైన పండుగగా పరిగణించబడుతుంది.. మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాలలో కన్నయ్య భక్తులు వైభవంగా కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని భక్తులు ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎంతో ఇష్టంగా ఎదురుచుస్తారు.
ప్రపంచంలో అధర్మం, పాపం పెరినప్పుడు ధర్మ స్థాపన కోసం విష్ణువు భూమి మీద కృష్ణుడిగా అవతరించినందుకు చేసుకునే పండగ. ద్వాపరయుగంలో కంసుని అరాచకాలు భూమ్మీద పెచ్చుమీరినప్పుడు అతని నుంచి ప్రజలను విముక్తి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ఎనిమిదవ సంతానంగా మధురలోని చెరసాలలో జన్మించాడు. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. జన్మాష్టమి రోజున కూడా జయంతి యోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో, జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండటం ద్వారా శాశ్వతమైన పుణ్యాన్ని పొందవచ్చు. శ్రీకృష్ణునికి శరణాగతిని కోరిన వారు మృత్యులోకములో స్వర్గము వంటి సుఖములను పొందుతారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం.
కృష్ణ జన్మాష్టమి తిథి 2024:
ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 3.39 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీమర్నాడు ఆగస్టు 27 మధ్యాహ్నం 2:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో 26 ఆగస్టు 2024న కృష్ణ జన్మాష్టమి ఉపవాసం చేస్తారు.
ఈ సంవత్సరం 2024 జన్మాష్టమి ఎప్పుడంటే:
ఈ సంవత్సరం 2024లో జన్మాష్టమి ఆగస్టు 26, 27 తేదీలలో జరుపుకోనున్నారు. ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 26న జన్మాష్టమి వ్రతం జరుపుకుంటారు. అదే సమయంలో ఆగస్టు 27న గోకులం, బృందావనాలలో కృష్ణ జన్మోత్సవాన్ని నిర్వహించనున్నారు.
జన్మాష్టమి ప్రాముఖ్యత
శ్రీకృష్ణుని బాల రూపాన్ని జన్మాష్టమి రోజున పూజిస్తారు. జన్మాష్టమిని శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిధి రోజున జరుపుకుంటారు. ఈ తేదీన కృష్ణుని జన్మదినం సందర్భంగా, దేవాలయాలలో వివిధ ప్రదేశాలలో కీర్తనలు, భజనలు చేస్తారు. రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండి స్వామివారికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. తర్వాత మర్నాడు ఉదయం నుంచి నంద మహోత్సవాన్ని జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుని లడ్డూ గోపాల రూపాన్ని లేదా బాల గోపాల రూపాన్ని పూజించడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని విశ్వాసం. అలాగే శ్రీకృష్ణుని అనుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేరి..ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాదు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
జన్మాష్టమి ఎలా జరుపుకుంటారు?
ఈ రోజున శ్రీకృష్ణుని భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి సమయంలో శ్రీకృష్ణుని పూజిస్తారు. స్వామికి పసుపు, పెరుగు, నెయ్యి, గంగాజలం మొదలైన వాటితో స్నానం చేయించి తర్వాత చందనం పూస్తారు. భక్తీ పారవశ్యంతో కీర్తిస్తారు. అనంతరం శ్రీ కృష్ణుడి ఆలయాలను అందంగా అలంకరించి భజనలు, కీర్తనలు చేస్తారు. ఈ రోజున శ్రీమద్ భగవత్ పారాయణం కూడా జరుగుతుంది.
మధుర-బృందావనాలలో జన్మాష్టమి
జన్మాష్టమి పండుగను మధుర, బృందావన ప్రదేశాలలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ-కృష్ణ హరే హరే అని జపిస్తారు. జన్మాష్టమి పండుగ తర్వాత మరుసటి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
శ్రీ కృష్ణ మంత్రాలు
క్రీం కృష్ణాయ నమః
ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ విద్మహే తన్నో కృష్ణ:ప్రచోదయ
ఓం క్లీం కృష్ణాయ నమః
ఓం గోకుల నాథయ నమః
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని infoline.one ధృవీకరించడం లేదు
-
Business7 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career7 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News7 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business7 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National8 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business7 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International7 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education6 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National6 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh6 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News6 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana7 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National7 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National6 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh6 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National6 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh6 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National6 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National7 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Political6 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National7 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business7 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International7 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh6 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh5 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Railways5 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
International7 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh7 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business7 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh6 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema7 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?