National
ఒక్కరోజు నా స్థానంలో కూర్చుంటే తెలుస్తుంది..! సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ తీవ్ర అసహనం
Chief Justice DY Chandrachud : పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని అన్నారు. న్యాయవాదులు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే ఎంత ఒత్తిడితో పని చేస్తున్నామో అని తెలుస్తుందని అన్నారు. ఒక్కసారి కూర్చుంటే మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారుని సీజేఐ వ్యాఖ్యానించారు.
ముంబై చెంబుర్ కాలేజీలో విద్యార్ధినిలు బురఖా, హిజాబ్ రద్దు చేసిన వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని సీజేఐ అన్నారు. ప్రతిఒక్క పిటిషన్‌పై విచారణ చేస్తాము.. దానికి ఒక తేదీ ఇస్తాము.. కానీ న్యాయమూర్తులను, కోర్టును శాసించవద్దు అంటూ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు.
ఏక్ నాథ్ షిండే గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి మహారాష్ట్ర స్పీకర్ నిరాకరించినందుకు వ్యతిరేకంగా శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని న్యాయవాది కోరారు. ఈరోజు ఈ అంశం జాబితా చేయబడినప్పటికీ ధర్మాసనం పాక్షికంగా విని మరో అంశాన్ని విచారిస్తున్నందున అది తీసుకోలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ముందస్తు విచారణ తేదీ కావాలని న్యాయవాది అభ్యర్థించారు. ప్రతివాదులు డాక్యుమెంట్ల సంకలనానికి సమయం కావాలని కోరడంతో కోర్టు వచ్చే గురువారం వరకు గడువు ఇచ్చింది. మూడు రోజుల్లో సంకలనాన్ని రూపొందించవచ్చునిన న్యాయవాది ముందస్తు తేదీ కోరినప్పుడు సీజేఐ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.