Connect with us

Education

దేశంలోనే నంబర్‌ వన్‌ విద్యా సంస్థకు ఎందుకీ పరిస్థితి!

Published

on

దేశంలోనే ఇంజనీరింగ్‌ కు నంబర్‌ వన్‌ విద్యా సంస్థ ఏదంటే అందరూ చెప్పేమాట.. ఐఐటీ బాంబే. ప్రపంచంలోనే టాప్‌ 200 విద్యా సంస్థల్లో ఇండియా నుంచి చోటు దక్కించుకుంటున్న సంస్థ కూడా ఇదే. ఏటా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తొలి ప్రాధాన్యం కూడా ఐఐటీ బాంబేనే. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ లో చేరడమే తమ తొలి ప్రాధాన్యమని జేఈఈ ఆలిండియా టాపర్లు వెల్లడిస్తుంటారు. ఇక్కడ చదివితే బహుళ జాతి సంస్థల్లో ఏడాదికి కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు ఖాయమనే నమ్మకమే ఇందుకు కారణం.

అలాంటి దిగ్గజ సంస్థ ఐఐటీ బాంబేలో ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు ఏటా డిసెంబర్‌ నుంచి మరుసటి ఏడాది ఫిబ్రవరి వరకు క్యాంపస్‌ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగాలు దక్కలేదనే వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. ఐఐటీ బాంబేలో ఏటా నూటికి నూరుశాతం అందరికీ మంచి వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తుంటాయి. ఏటా వందలాది అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ కంపెనీలు స్వయంగా ఐఐటీ బాంబేకు వచ్చి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నాయి.

అయితే గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏకంగా 36 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదనే వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సంవత్సరం ఐఐటీ బాంబేలో 2024 ప్లేస్మెంట్ల కోసం నమోదు చేసుకున్న 2,000 మంది విద్యార్థులలో 712 మంది (36 శాతం) ఆశావహులు ఇప్పటికీ జాబ్‌ ఆఫర్‌ల కోసం ఎదురు చూస్తున్నారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్లేస్మెంట్‌ సీజన్‌ మే నెల నాటికి ముగియనుండడంతో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించాయి.

మొత్తం మీద ఈ సీజన్‌లో ఉద్యోగాలు లేకుండా మిగిలిపోయిన విద్యార్థుల సంఖ్య 35.8 శాతానికి చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2.8 శాతం ఎక్కువని అంటున్నారు.

Advertisement

2023 గణాంకాల ప్రకారం.. ఐఐటీ బాంబేలో 2,209 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉద్యోగాలు పొందారు. మరో 32.8 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదు. 380 కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం రాగా ఇందులో ఎక్కువ శాతం దేశీయ కంపెనీలే కావడం గమనార్హం. కొద్ది సంఖ్యలో మాత్రమే అంతర్జాతీయ కంపెనీలున్నాయి.

ఉద్యోగాలు సాధించనివారిలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు కూడా ఉండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. యావరేజ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్సు కోర్సు చేసినా ఉద్యోగం ఖాయం. అలాంటిది ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్సు చేసినవారికయితే కోట్లలో వేతన ప్యాకేజీలు లభిస్తాయి. అలాంటిది కొందరు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్‌ లభించలేదని అంటున్నారు.

కోవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌ – హమాస్‌ యుద్ధం, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ పరస్పర దాడులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్లేస్మెంట్స్‌ తగ్గుదలకు కారణమని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్తవ్యస్త పరిస్థితులతో కంపెనీల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం వల్లే భారీ జీతాలు ఇచ్చి ఉద్యోగులను నియమించుకోవడానికి అవి వెనుకాడుతున్నాయని పేర్కొంటున్నారు.

మరోవైపు 36 శాతం మందికి ఉద్యోగాలు రాలేదనే వార్తలను ఐఐటీ బాంబే వర్గాలు ఖండించాయి. కోర్‌ బ్రాంచ్‌ ల్లో ఉద్యోగాలు, భారీ జీతాలను కోరుకోవడం వల్లే విద్యార్థులు తమకు వచ్చిన ఆఫర్లను తిరస్కరించారని చెబుతున్నాయి. నూటికి నూరు శాతం మందికి అవకాశాలొచ్చాయని.. మరింత మెరుగైన ఉద్యోగాలు, జీతభత్యాలను కోరుకున్నవారు తాజా ఆఫర్లను తిరస్కరించారని పేర్కొంటున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..

Published

on

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పేస్ట్, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందివ్వనున్నారు. అయితే గతంలోనూ విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందించేవారు. అయితే నేరుగా ఇవ్వకుండా వారి తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తూ వచ్చారు. అయితే ఈ ఛార్జీలు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్ వస్తువులను విద్యార్థులకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా.. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కాస్మొటిక్ వస్తువులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Continue Reading

Andhrapradesh

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Published

on

ఆమరావతి, జూన్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం (జూన్‌ 24) కొలువైన మంత్రిమండలి మెగా డీఎస్సీ పాటు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కూడా నిర్వహించేందుకు అమోదం తెలిపింది.
ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారితో పాటు, ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా మెగా డీఎస్సీ రాసేంందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ జులై 1వ తేదీన విడుదలకానుంది. కొంచెం అటుఇటుగా టెట్ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నారు. కొంచెం తేదీల మార్పుతో ఒకేసారి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్సీ కంటే ముందే మొదట టెట్‌ పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత డీఎస్సీ పరీక్ష ఉంటుంది.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే జులై 1వ తేదీనే మెగా డీఎస్సీతోపాటు టెట్‌కు కూడా ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా.. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా పరీక్ష నిర్వహించకుండానే వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచి.. మెగా డీఎస్సీకి నోటిఫికేసన్‌ వెలువరించనున్నట్లు ప్రకటించింది.

సోమవారం మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలను ఎప్పటికప్పుడు అవసరం మేరకు డీఎస్సీ నిర్వహించాలనే యోచన కూడా చేస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచాలంటే రాష్ట్రంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలని నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

Continue Reading

Education

ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

Published

on

ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకుండా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రస్తుం విద్యార్థుల అభ్యున్నతికి తొలి అడుగు వేసింది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్కులను పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. టెక్ట్స్ బుక్స్‌తో పాటు నోట్‌బుక్‌లు, బ్యాగ్‌లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు.

Continue Reading
Spiritual3 hours ago

Puri Jagannath Temple: తెరుచుకున్న పూరీ జగన్నాథ రత్న భాండాగారం.. దేశం చూపు మొత్తం అక్కడే!

News4 hours ago

Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు

Salaries9 hours ago

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు

News11 hours ago

Ambani Wedding Gifts: రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్.. బాక్సులో వెండి నాణెలు సహా..!

Career13 hours ago

Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్‌

Spiritual21 hours ago

తిరుమల వసతి గదుల బుకింగ్‌లో సమూల మార్పులు: భారీగా ప్రక్షాళన

Andhrapradesh21 hours ago

ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

National1 day ago

Monsoon Travel Tips: మనదేశంలో ఈ ప్రదేశాలను సరస్సుల నగరాలు అని అంటారు? ఈ సీజన్‌లో పర్యటనకు బెస్ట్ ఆప్షన్

International1 day ago

విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ‘ప్రచండ’ ఓటమి- తదుపరి పీఎం ఎవరంటే?

National1 day ago

2060 నాటికి భారత జనాభా 170 కోట్లు- 63.3 కోట్లకు పడిపోనున్న చైనా! – un report on population

National1 day ago

Anant Ambani Radhika Wedding : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం.. గణేష్ స్థాపన నుంచి పాగ్ ఫెరా వరకు సాంప్రదాయ గుజరాతీ షాదీ ఆచారాలివే..!

National1 day ago

Trainee IAS: తుత్తర ఎన్ని తిప్పలు తెస్తుందో చెప్పడానికి ఈమె ప్రత్యక్ష ఉదాహారణ

National1 day ago

Delhi: కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..

Education2 days ago

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..

Andhrapradesh2 days ago

ఏపీలో స్దానిక సంస్థలకు గుడ్ న్యూస్- మరో హామీ నెరవేర్చిన కూటమి సర్కార్..!

Railways2 days ago

తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!

National2 days ago

Agniveer Scheme: అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. ఇక సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో రిజర్వేషన్లు

Andhrapradesh2 days ago

Tirumala PrankVideo: తిరుమల క్యూలైన్లలో యూ ట్యూబర్‌ ప్రాంక్ వీడియో, నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలకు టీటీడీ ఆదేశం

National2 days ago

NEET UG Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్‌!

Andhrapradesh2 days ago

రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు.. అప్పటి నుంచే అందుబాటులోకి..

National3 days ago

పాక్ యుద్ధ విమానం ఎఫ్ 16ను లాక్ చేసి… దాయాదిని వణికించిన కార్గిల్ హీరో

Andhrapradesh3 days ago

Vizag Steel Plant : అలాంటి ప్రశ్నే లేదు…! వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

International3 days ago

‘ప్రపంచానికి భారత్‌ బౌద్ధాన్నిచ్చింది – యుద్ధాన్ని కాదు’- ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ – PM Modi Foreign Tour

International3 days ago

సముద్రంలోనే 37గంటలు- 80కి.మీ దూరం కొట్టుకుపోయిన యువతి- అయినా సేఫ్! – sea japan swimmer rescue

National3 days ago

లద్దాఖ్‌ బోర్డర్‌లో డ్రాగన్‌ కుట్రలు.. ఆ బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది.. కవ్వించే ప్రయత్నంలో భాగమా?

National3 days ago

పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్న అంబానీ ఫ్యామిలీ

Andhrapradesh3 days ago

Srisailam: మలన్న భక్తులకు అలెర్ట్.. భారీగా భక్తుల రద్దీ, దర్శనానికి 4 గం. ల సమయం..

National4 days ago

Supreme Court: ముస్లిం మహిళలకు భరణం.. హైదరాబాద్ దంపతుల కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

National4 days ago

Assembly Bypoll : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్

International4 days ago

రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే- ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? – Russian Army Shoes

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National2 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education1 month ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National1 month ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News1 month ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

National1 month ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh1 month ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

National1 month ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh1 month ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Spiritual1 month ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Political4 weeks ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh1 month ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh1 month ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh1 month ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Railways4 weeks ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Political1 month ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Andhrapradesh1 month ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh1 month ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Andhrapradesh3 weeks ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh4 weeks ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Business2 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Spiritual1 month ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Trending