National
భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ, నారాయణపూర్, బస్తర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
పలు ఆటోమేటిక్ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్, బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్ సిన్హా ధ్రువీకరించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇవాళ పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం కూడా ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.