Connect with us

National

లోక్​సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెర- తమిళనాడుపై ఫుల్​ ఫోకస్​! – Lok Sabha Election 2024

Published

on

Lok Sabha Election First Phase Polls : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరగనున్న తొలి విడత పోలింగ్‌కు ప్రచార పర్వం ముగిసింది. మొత్తం 102 నియోజకవర్గాల్లో కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52 నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు EC పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 19 నుంచి జూన్ ఒకటి వరకు 44 రోజులపాటు ఏడు విడతల్లో పోలింగ్‌ ప్రక్రియ జరగనుండగా, తొలి విడత కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. EVMలు, VVప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

తమిళనాడు, ఉత్తరాఖండ్‌ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్‌ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్‌లో 5, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్‌, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఈ నెల 19న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మణిపుర్‌లో రెండు స్థానాలకు తొలివిడతలోనే పోలింగ్‌ జరగాల్సి ఉన్నప్పటికీ, ఔటర్‌ మణిపుర్‌ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్‌ నిర్వహిస్తారు. 80 స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌, 40 సీట్లు ఉన్న బిహార్‌, 42 సీట్లు ఉన్న బంగాల్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్‌ ఉండగా, తొలివిడత యూపీలో 8, బిహార్‌లో 4, బంగాల్‌లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసోంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్‌ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి ఈనెల 19న పోలింగ్‌ జరగనుంది.


తమిళనాడుపై అందరి దృష్టి
తొలి విడత పోలింగ్‌లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్‌ నటి రాధిక బీజేపీ తరఫున విరుధ్‌నగర్‌ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా DMDK వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బిహార్‌లోని జమూయ్ నియోజకవర్గం నుంచి LJP వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాసవాన్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ పోటీలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫీలీబీత్‌లో వరుణ్‌ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు అవకాశం కల్పించింది.

పోటీలో 8మంది కేంద్రమంత్రులు
తొలివిడతలో 8 మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటరు తీర్పు కోరుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్‌పుర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ ప్రదేశ్‌ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2004 నుంచి ఆయన ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిజిజుకు పోటీగా మాజీ సీఎం, కాంగ్రెస్‌ అరుణాచల్‌ప్రదేశ్ అధ్యక్షుడు నబం టుకీ ఎన్నికల బరిలో నిలిచారు. మరో కేంద్ర మంత్రి, మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రుగఢ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ ముజఫర్‌ నగర్‌ బరిలో నిలిచారు.


మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధమ్‌పgర్‌ నుంచి హ్యాట్రిక్‌ కొట్టాలని యత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు అయిన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బికనీర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి ఎల్.మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా నిలిచారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్‌ ప్రామాణిక్‌ బంగాల్‌లోని కూచ్‌బిహార్‌ నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరి భవితవ్యం జూన్ 4న తేలనుంది.



National

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Published

on

Zomato Delivery Boy : అదో మురికివాడ.. అందరూ ముంబై స్లమ్ ఏరియాగా పిలుస్తారు.. ఆ ప్రాంతంలో కాసేపు నిలబడటమే కష్టం.. అలాంటిది అక్కడే నివాసముంటున్న వారి పరిస్థితి ఇంకెంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. వారికి అదే నివాసం.. మనుగడ కోసం ఏదో ఒక పని చేసుకుంటూనే పోరాడుతుంటారు.

అలాంటి ముంబై మురికివాడలో ఓ యువకుడు తన మనుగడ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ వచ్చిన జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తాను ఉండేది చాలా చిన్న గది.. ఆ గదికి నెలకు రూ. 500 అద్దె చెల్లిస్తున్నాడు. ఇదంతా తన ఇన్‌స్టా‌‌గ్రామ్ అకౌంట్‌‌లో వీడియో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ గురించి అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

ముంబై స్లమ్ ఏరియాలో తన జీవిత కష్టాల గురించి జొమాటో డెలివరీ బాయ్ వీడియో ద్వారా తెలిపాడు. ‘రూమ్ టూర్’ పేరుతో చేసిన ఆ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ నేమ్ ‘qb_07’ పేరుతో చేసిన పోస్ట్‌‌కు “ముంబయిలో కష్టపడుతున్న కళాకారుడు” అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. అది చూసిన తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ తమదైన శైలీలో స్పందిస్తున్నారు. మొత్తం రెండు వీడియోలను పోస్టు చేసిన డెలివరీ బాయ్.. తాను నెలకు రూ. 500 అద్దెగా చెల్లిస్తానని చెప్పాడు. తాను ఉండే చిన్న గదికి ఇరుకైన సందులో నుంచి వెళ్లాడు.

“ఈ ప్రదేశంలో నడుస్తున్నప్పుడు నేను ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది” అని చెప్పాడు. రెండు నిమిషాల తర్వాత.. లేన్ చివరకి వచ్చి తన చిన్న గదికి వెళ్లేఇనుప మెట్లపైకి ఎక్కాడు. ముంబైలో ఇంటిని వెతికిపెట్టిన తన స్నేహితుడు సోనుని కూడా ఫాలోవర్లకు పరిచయం చేశాడు. చుట్టుపక్కల వస్తువులతో పాటు తన గది పరిస్థితిని కూడా వీడియోలో చూపించాడు. అక్కడే సోనూతో పాటు, బిర్యానీ తిన్నాడు. ‘‘నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు.. నా కుటుంబం నా కోసం చాలా ఖర్చు చేసింది. నేను వాళ్లను డబ్బు అడగలేను” అని డెలివరీ బాయ్ ఆవేదనను వెలిబుచ్చాడు.

అందుకే పిల్లిని పెంచుతున్నాను : డెలివరీ బాయ్
ఈ నెల 23న మరో వీడియోను పోస్టు చేయగా.. తన గదిలో స్థలం లేక తాత్కాలిక బాత్రూమ్ నిర్మించుకున్నానని చెప్పుకొచ్చాడు. “మరుగుదొడ్డి బయట ఉంది. ఈ గదిలో వెంటిలేషన్ కూడా లేదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని తన రోజువారీ కష్టాలను చెప్పుకొచ్చాడు జొమాటో డెలివరీ ఏజెంట్.

Advertisement

ఇలాంటి ఇబ్బందుల మధ్య తాను ఎలా జీవిస్తున్నాడో తన ఫాలోవర్లకు చెబుతూనే ఒక పిల్లి పిల్లను కూడా పెంచుకుంటున్నట్టుగా తెలిపాడు. “అలాంటి ప్రదేశంలో పిల్లి జీవించడం కూడా కష్టమే. కానీ, అది బయట మనుగడ సాగించదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అందుకే నేను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను, ”అని తెలిపాడు.


ఈ వీడియోకు దాదాపు 5 మిలియన్ల వ్యూస్ రావడంతో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియా యూజర్లు ఇంత చిన్న వయస్సులోనే ఇన్ని కష్టాలా? అంటూ అతడిని అభినందిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిల్లి పిల్లను చూసుకున్నందుకు అతనితో పాటు అతని స్నేహితులను పలువురు ప్రశంసించారు.

“పిల్లి పిల్లని కూడా చూసుకుంటున్నారు. ప్రేమకు లోటు లేదు” అని ఒక యూజర్ కామెంట్ పెట్టగా.. “రాక్‌స్టార్ చేయడానికి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఆల్ ది వెరీ బెస్ట్.” మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అంతేకాదు.. ఈ డెలివరీ బాయ్ పాటలు కూడా బాగా పాడగలడు. తన మధురమైన స్వరానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన వీడియోల్లో ఎక్కువగా పాపులర్ హిందీ పాటలను పాడుతూ తన ఫాలోవర్లను అలరిస్తుంటాడు.

Advertisement
Continue Reading

National

సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

Published

on

Tomato Prices In Telangana Today : రాష్ట్రంలో టమాటా ధరలు విపరితంగా పెరిగాయి. కూరలోకి టమాటా కొనాలంటే సామాన్య ప్రజలు ఒక్కటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టమాట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటుగా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుంచి టమాటాల సరఫరా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్​లో ధరలు భారీగా పెరిగాయి.

సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 చేరువవ్వడంతో టమాటాకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చిందంటున్నారు. రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తున్నారు.

దిగుబడి తగ్గడంతో ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కింది. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముంది. శివార్లలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా టమాట పెద్దగా రావడం లేదు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్‌ నుంచి వచ్చే టమాటా 60శాతం తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు.

‘ మార్కెట్​లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. కూరగాయలు కొనే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గుతుంటాయి కానీ ఈ ఏడాది మాత్రం భగ్గుమంటున్నాయి. అయినా ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టడం లేదు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రంలో ఎక్కువగా పండించే అవకాశం ఉంటుంది. కానీ, అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అందుకే కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టి కూరగాయల ధరలను అదుపులోకి తేవాలి’- వినియోగదారుడు.

Continue Reading

National

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

Published

on

Centre Financial Support to Polavaram Project : ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం తేల్చిచెప్పడంతో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పోలవరానికి పెద్ద భరోసా దక్కింది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని యావద్దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఆశలకు కేంద్రం ఊపిరి పోసింది.

జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీలినీడలు : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చే విషయంలో ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే 33 వేల కోట్లు అవసరమవుతాయని 2017-18లోనే తేల్చారు. ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని వాదించింది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, సీఎం చంద్రబాబు మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.

2013-14 ధరలతో నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం 20,398 కోట్లు రూపాయలు మాత్రమే ఇస్తామని, అంతకు మించి ఇవ్వబోమని కేంద్రం చెబుతూ వచ్చింది. 2020 అక్టోబరులోనూ దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కొర్రీ వేసి ఆ నిధులే ఇస్తామంటూ పేర్కొంది. ఇప్పటి వరకు తాజా డీపీఆర్​ ఆమోదం పొందకపోవడంతో ఈ అంశంలో అనుమానాలు అలానే ఉన్నాయి.

నిధులు ఎప్పటి నుంచో పెండింగ్​ : పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్​ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వడం లేదు. కొత్త డీపీఆర్​కు ఆమోదం లేకపోవడంతో 2000 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 ధరలతో రూ. 55,548.87 కోట్ల రూపాయలతో రెండో డీపీఆర్​కు ఒక దశ ఆమోదం సాధించింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో రూ. 47,725.47 కోట్ల రెండో డీపీఆర్​కు ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ రూ.20,398.81 కోట్లే ఇస్తామంటూ లేఖ రాయడంతో రాష్ట్రం గుండెల్లో రాయిపడింది.

తొలిదశ పేరుతో కొత్త డీపీఆర్​ సమర్పించాలని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తొలిదశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవుతాయో చెప్పాలని కోరింది. ప్రస్తుతం రూ.30,436.95 కోట్లకు పోలవరం తొలిదశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలిదశకు మరో డీపీఆర్​ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే రూ.12,157 కోట్లు అందుబాటులోకి వస్తాయి.

Advertisement

తొలగిన సందేహలు : 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. దాని ప్రకారం పోలవరం ప్రాజెక్ట్​కు భూసేకరణ వ్యయం, పునరావాస వ్యయం పెరిగిపోయాయి. ఈ రెండింటికే 33 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దీంతో 2017-18 ధరల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 55,457 కోట్ల రూపాయలకు రెండో డీపీఆర్​ను పంపింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం దక్కినా కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇస్తుందా లేదా, ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు తొలగిపోలేదు. ఇన్నాళ్లుగా రెండో డీపీఆర్‌ అంశం కేంద్రం తేల్చనేలేదు. అలాంటి సంక్షుభిత పరిస్థితుల్లో తాజాగా మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్‌తో పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి.

“పోలవరం జాతీయ ప్రాజెక్ట్​. దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. 2014లో కేబినేట్​ ఆమోదం తీసుకొని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్​కు కాబినేట్​ నిర్ణయాల ప్రకారం ఎంత నిధులు ఆమోదం పొందితే అంత ఇస్తూ వచ్చాం. ఈ క్రమంలో కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని రాష్ట్రం ప్రభుత్వం చర్చించి, పోలవరం ప్రాజెక్ట్​ను పూర్తి చేస్తాం”_నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

అవసరమైన నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ మరీ ఈ విషయం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్​ హామీ ఇచ్చారు.

Continue Reading
National12 hours ago

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Telangana12 hours ago

అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

National1 day ago

సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

National1 day ago

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

International1 day ago

ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్​ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్​ బెలూన్స్​! – Korean Countries Balloons War

National1 day ago

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ – తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు – Union Budget 2024

International1 day ago

మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

National1 day ago

కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

International1 day ago

US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

International3 days ago

‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

National3 days ago

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Telangana3 days ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

National3 days ago

RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

International3 days ago

అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

International3 days ago

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

Andhrapradesh3 days ago

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

National3 days ago

Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

Business4 days ago

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Andhrapradesh5 days ago

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

International5 days ago

మోదీకి మస్క్‌ అభినందనలు!

Education5 days ago

తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు

Spiritual5 days ago

పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఆయుధాలు

National5 days ago

‘బ్రాండెడ్’ షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

National5 days ago

UPSC ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా!- IAS పూజా ఖేడ్కర్‌ వివాదంతో!!

National5 days ago

పూజా ఖేడ్కర్‌కు UPSC షాక్​- అభ్యర్థిత్వం రద్దు? పరీక్షలు రాయకుండా బ్యాన్​పై షోకాజ్​ నోటీసులు – pooja khedkar ias controversy

National5 days ago

స్ట్రాంగ్ రూమ్‌కు జగన్నాథుని అమూల్య సంపద.. త్వరలోనే విగ్రహాల విలువ లెక్కింపు

Agriculture5 days ago

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం బయలుదేరనున్న స్వామివారి పుష్పరథం..భారీగా తరలివస్తున్న భక్తగణం..

National6 days ago

Ashwini vaishnaw: మైక్రోసాఫ్ట్‌తో సంప్రదించాం.. సర్వర్ల అంతరాయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Andhrapradesh6 days ago

Indrakeeladri: ఇంద్రకీలాద్రి‌పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. దుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. వర్షాల నేపధ్యంలో ఘాట్ రోడ్డు మూసివేత

International1 week ago

చందమామపై గుహను గుర్తించిన సైంటిస్టులు- ఫ్యూచర్​లో మనుషులు ఉండొచ్చు!

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National3 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education2 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National1 month ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News2 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National1 month ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh1 month ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Andhrapradesh2 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

National2 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Political1 month ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh1 month ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh1 month ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh1 month ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Political1 month ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Railways1 month ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Andhrapradesh1 month ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh2 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Andhrapradesh1 month ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

National2 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Trending