National
Kerala: వయానాడ్‌లో సీపీఐపై రాహుల్ పోటీ.. కేరళ సీఎం సీరియస్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయానాడ్‌లో పోటీ చేయడంపై కేరళ సీఎం పినరయి విజయన్ హాట్ కామెంట్స్ చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేతిలో ఓడిపోతానని తెలుసుకున్న రాహుల్..
కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారని ఆయన ఆరోపించారు. ఇక, వయానాడ్‌లో కమ్యునిస్టుల మద్దతుతో రాహుల్ గాంధీ ఎంపీగా విజయం సాధించారని పేర్కొన్నారు. కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మరోసారి వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీతో పొత్తులో భాగంగా వయనాడ్ పార్లమెంట్ సీటును సీపీఐ జాతీయ నాయకురాలు అన్నీ రాజాకు కేటాయించింది. అయినా కూడా ఇదే స్థానం నుంచి మరోసారి పోటీకి రాహుల్ రెడీ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇక, కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కేరళకు వచ్చి అన్నీ రాజాపై పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. మణిపూర్ సమస్య సమయంలో బీజేపీ ప్రభుత్వ అకృత్యాలను తీవ్రంగా ఎండగట్టినందుకు ఆమెను దేశ వ్యతిరేకి అనే ముద్ర వేశారన్నారు.. దేశం ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు అన్నీ రాజా అక్కడ ప్రత్యక్షం కావడం మనం నిత్యం చూస్తూనే ఉంటామన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎక్కడైనా చూశామా? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నిర్ణయించుకోండి అని సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.