Connect with us

National

JEE Advanced 2024: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఆఖరి నిమిషంలో ఈ పొరబాట్లు చేయకండి!

Published

on

దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష ఈ రోజు (మే 26) ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఆదివారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. ఒక్కొక్క పేపర్‌ రాసేందుకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు దాదాపు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్ధులు అడ్వాన్స్‌డ్ రాయనున్నారు. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ర్యాంకు పొందిన వారిని మాత్రమే ఈ పరీక్షకు అనుమతిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణులైతే ఐఐటీల్లో బీటెక్‌ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు పరీక్ష రాసేందుకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..

  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకన్నఅడ్మిట్ కార్డును తమతోపాటు ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అలాగే ఒక ఒరిజినల్ ఫొటో కూడా తీసుకెళ్లాలి.
  • ఆధార్ కార్డ్, పాఠశాల/ కాలేజీ లేదా ఏదైనా విద్యా సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాస్‌పోర్టు, పాన్ కార్డు తదితరాల్లో ఏదైనా ఒకటి కచ్చితంగా తమతోపాటు తీసుకెళ్లాలి.
  • పెన్నులు, పెన్సిళ్లు, తాగునీటి బాటిల్స్‌ లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
  • పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే అభ్యర్ధులు ధరించాలి.
  • దుస్తులపై బంగారు లేదా ఇతర మెటల్‌ ఆభరణాలు, నగలు ఉంటే అటువంటి వారిని లోనికి అనుమతించరు.
  • స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు వంటివి ధరించరాదు.
  • బూట్లు, మందమున్న చెప్పులు వేసుకున్న వారిని కూడా అనుమతించరు.
  • ఎలాంటి లోహాలతో కూడిన వస్తువులనైనా ఒంటిపై ధరించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లరాదు.
  • ఉంగరాలు, గాజులు, మెట్టెలు, మెడలో చైన్లు వేసుకున్న వారిని కూడా అనుమతించారు.
  • మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.
  • Continue Reading
    Advertisement
    Click to comment

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    National

    Monsoon Travel Tips: మనదేశంలో ఈ ప్రదేశాలను సరస్సుల నగరాలు అని అంటారు? ఈ సీజన్‌లో పర్యటనకు బెస్ట్ ఆప్షన్

    Published

    on

    ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. తమ ఆర్ధిక పరిస్తితికి, సమయానికి తగిన విధంగా అందమైన ప్రదేశాలను ఎంచుకుని పర్యటించడానికి ఇష్టపడరు. నది ఒడ్డున లేదా సముద్ర తీరంలో విహరించాలని తమ నచ్చిన వారితో ప్రకృతి అందాలను వీక్షించాలని కోరుకుంటారు. ఒంటరిగా వెళ్ళినా.. ఫ్యామిలీ, స్నేహితులు, లేదా జీవిత భాగస్వామితో వెళ్ళినా నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ అందమైన క్షణాలను గడపవచ్చు. ఇలాంటి చిరస్మరణీయ క్షణాలు మాత్రమే జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. కనుక ఎప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పచ్చని ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్న అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సరస్సుల నగరం అని పిలుస్తారు.

    ప్రజలు స్వతహాగా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్ళేవారు నదులు, సరస్సులను ఇష్టపడతారు. మీరు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలని.. విహారయాత్రను ప్లాన్ చేస్తుంటే సరస్సులు, ప్రకృతి అందాలతో నిండి పోయిన ఆ నగరాల పేర్లను తెలుసుకుందాం..

    నైనిటాల్ సరస్సుల నగరం: సరస్సుల గురించి మాట్లాడినట్లయితే చాలా మంది ప్రజలు మొదట నైనిటాల్ పేరును తలచుకుంటారు. పర్యాటకులకు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ ఏడు పరస్పర అనుసంధాన సరస్సులు కూడా ఉన్నాయి. భీమ్టాల్ అతిపెద్ద సరస్సు. అంతేకాదు నౌకుచియాటల్, మల్వ తాల్, లోఖంతాల్, హరిష్టల్, నల దమయంతి సత్తాల్, ఖుర్పటల్ వంటి అనేక సరస్సులు ఉన్నాయి.

    ఉదయపూర్ : రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరం కూడా సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ ఏడు సరస్సులు ఉన్నాయి. వాటిలో ఐదు ప్రధాన సరస్సులు ప్రధానంగా వినిపిస్తాయి. ఇందులో పిచోలా సరస్సు, రంగ్ సాగర్ సరస్సు, దూద్ తలై సరస్సు , ఫతేసాగర్ సరస్సు ఉన్నాయి.

    భోపాల్‌ : మధ్యప్రదేశ్ లోని భోపాల్ కూడా అందమైన సరస్సులు ఉన్న నగరం. ఇక్కడి ప్రధాన సరస్సుల గురించి చెప్పాలంటే, మోతియా తలాబ్, లాండియా సరస్సు, సారంగపాణి సరస్సు, మనిత్ సరస్సు, షాహపురా సరస్సు, నవాబ్ సిద్ధిఖీ హసన్ ఖాన్ సరస్సు, మున్షీ హుస్సేన్ ఖాన్ సరస్సు వంటి అనేక సరస్సులు ఉన్నాయి. భోపాల్ కు వెళ్ళిన వారు తప్పని సరిగా ఈ ప్రదేశాలను సందర్శించండి. విశ్రాంతిగా సమయాన్ని గడపండి.

    Advertisement

    బుండి: రాజస్థాన్‌లో వేడి వాతావరణం ఉన్నా.. ఇక్కడ అనేక సరస్సులు మాత్రమే కాదు అనేక జలపాతాలు కూడా ఉన్నాయి, వీటిని సందర్శించడం ఎవరికైనా చిరస్మరణీయంగా ఉంటుంది. ప్రస్తుతం కనక సాగర్, జైతాసాగర్, సుర్సాగర్ మొదలైన సరస్సులు ఉండగా నావల్ సాగర్ సరస్సు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

    Continue Reading

    National

    2060 నాటికి భారత జనాభా 170 కోట్లు- 63.3 కోట్లకు పడిపోనున్న చైనా! – un report on population

    Published

    on

    India Population Report : గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్‌, ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో భారత్‌ జనాభా 145 కోట్లని అంచనా వేసింది. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. భారత జనాభా 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. తర్వాత 12శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది.

    2100 నాటికి చైనా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ
    ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది. 2100 నాటికి అది 63.3 కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది. 2100 నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపింది. 2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుందని ఐరాస నివేదిక పేర్కొంది. జపాన్‌, రష్యాలోనూ జనాభా వేగంగా దిగొస్తుందని వెల్లడించింది. ఐరాస నివేదిక అంచనా ప్రకారం 2024-54 మధ్య చైనా జనాభా 20 కోట్లు, జపాన్‌ జనాభా 2 కోట్లు, రష్యా జనాభా కోటి తగ్గనుంది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది.

    సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే కారణం
    2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080ల్లో గరిష్ఠానికి చేరుతుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. వచ్చే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుకుని అక్కడి నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణమని ఐరాస నివేదిక వివరించింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవితకాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు తెలిపింది. సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాసలో జనాభా విభాగాధిపతి జాన్‌ విల్మోత్‌ తెలిపారు. 1.8 లేదా 1.5 కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అదే జరుగుతోందని వివరించారు.

    Continue Reading

    National

    Anant Ambani Radhika Wedding : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం.. గణేష్ స్థాపన నుంచి పాగ్ ఫెరా వరకు సాంప్రదాయ గుజరాతీ షాదీ ఆచారాలివే..!

    Published

    on

    Anant Ambani Radhika Wedding : ప్రస్తుత రోజుల్లో వివాహాలు 3 నుంచి 4 రోజుల పాటు నైట్, కాక్‌టెయిల్ రిసెప్షన్‌లు వంటి వివిధ కార్యక్రమాలతో సాగడం సర్వసాధారణం. కానీ, ఏడు నెలల పాటు వివాహ వేడుకలను జరుపుకోవడం నిజంగా అసాధారణమైనదే.

    జూలై 12న అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎట్టకేలకు రాధికా మర్చంట్‌ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ప్రతి ఆరు వారాలకు ఒకసారి జరిగే ఈవెంట్‌లతో అంబానీ ఫ్యామిలీ జనవరి నుంచి అనంత్ అంబానీ పెళ్లి వేడుకులను అబ్బురపరిచేలా జరుపుకుంటున్నారు.

    అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి రోజు. ఊహించిన దానికంటే గ్రాండ్‌గా జరిగింది. జూన్ నుంచి ఈ జంట తమ వివాహానికి ముందు జరిగే అన్ని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు-రోజుల సుదీర్ఘ జామ్‌నగర్ పర్యటన నుంచి యాంటిలియాలో ప్రత్యేక పూజ వరకు-అంతా కలల వేడుకలా జరిగింది. ఇప్పుడు, పెళ్లిరోజు రానే వచ్చింది. సాంప్రదాయ గుజరాతీ వివాహానికి సంబంధించిన అసలు ఆచారాలను ఎలా పాటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

    గణేష్ స్థాపన :
    గుజరాతీ షాదీ గణేష్ స్థాపనతో మొదలవుతుంది. ఇక్కడ రెండు కుటుంబాలు విడివిడిగా గణేశుడిని పూజిస్తారు. ఎలాంటి అడ్డంకులు లేని వేడుకను నిర్వహించి దైవానుగ్రహాన్ని పొందాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం.

    మండప పూజ :
    అప్పుడు కుటుంబాలు మండప పూజను నిర్వహిస్తారు. దీనిని మండప ముహారత్ అని కూడా పిలుస్తారు. ఫేరాలు జరగబోయే ఈ పవిత్ర మండపంలో పూజ నిర్వహిస్తారు.

    Advertisement

    గ్రహ శాంతి :
    దీని తరువాత, గ్రహ శాంతి పూజ నిర్వహిస్తారు. దీనిని అనంత్, రాధిక కూడా చేశారు. దంపతులకు సంతోషకరమైన, ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని పొందడానికి గ్రహ శాంతి పూజ కచ్చితంగా అవసరం.

    మెహందీ వేడుక :
    పెళ్లికి రెండు రోజుల ముందు వధువు ఇంట్లో మెహందీ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, వధువు సోదరీమణులు, బంధువులు, స్నేహితులతోపాటు కుటుంబంలోని మహిళలందరూ తమ అరచేతులకు హెన్నా పూయడానికి ఒక చోట చేరుతారు.

    హల్దీ, మామెరు :
    అప్పుడు హల్దీ వేడుక వస్తుంది. దాని తర్వాత మమేరు తంతు జరుగుతుంది. వధువు మేనమామ ఆమెకు ఏమి కానుకగా ఇచ్చాడో చూడటానికి అందరూ వచ్చే ఆచారం మామేరు.

    వివాహం :
    అసలు పెళ్లి వేడుకకు ముందు, వధువు తన చేతి ముద్రలను గోడపై ఉంచే కంకు తాప అనే ఆచారం నిర్వహిస్తారు. దీని తరువాత, ప్రధాన వివాహం జయమాల వేడుకను నిర్వహిస్తారు. ఇక్కడ జంట దండలు మార్చుకుంటారు. ఆ తరువాత కన్యా దాన్, మంగళ్ ఫెరాస్ నిర్వహిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గుజరాతీ వివాహంలో, ఎప్పుడూ 7 ఫేరాలు ( సప్తపది) ఉండవు. దానికి బదులుగా ఎల్లప్పుడూ 4 ఫెరాస్ (ప్రమాణాలు) ఉంటాయి. విదై జరుగుతుంది. చివరకు వధువు కుటుంబం వారి యువరాణిని వరుడికి అప్పగిస్తారు.

    పాగ్ ఫెరా :
    వివాహానంతరం, పాగ్ ఫెరా అనే ఆచారం నిర్వహిస్తారు. అక్కడ వధువు సోదరుడు ఆమెను ఇంటికి తీసుకువెళ్లడానికి వస్తాడు. ఆ తర్వాత భర్త ఆమెను తన కొత్త ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్తాడు.

    Advertisement

    అనంత్, రాధిక పెళ్లి వేడుకలు :
    ఈ జంట సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటవుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జరిగింది. సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాలకు కట్టుబడి వివాహ వేడుకలను అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేసింది. జూలై 3న అంబానీలు మమేరు లేదా మౌసలు వేడుకను నిర్వహించారు.

    జూలై 5 (NMACC)లో గ్రాండ్ సంగీత్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాధురీ దీక్షిత్, ఖుషీ కపూర్, అనన్య పాండే, ఎంఎస్ ధోని, ఆదిత్య రాయ్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్, ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు అంబానీ కుటుంబం జామ్‌నగర్‌లో వివాహానికి ముందు అనేక వేడుకలను నిర్వహించింది.

    Continue Reading
    Spiritual2 hours ago

    Puri Jagannath Temple: తెరుచుకున్న పూరీ జగన్నాథ రత్న భాండాగారం.. దేశం చూపు మొత్తం అక్కడే!

    News4 hours ago

    Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు

    Salaries8 hours ago

    7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు

    News10 hours ago

    Ambani Wedding Gifts: రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్.. బాక్సులో వెండి నాణెలు సహా..!

    Career12 hours ago

    Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్‌

    Spiritual21 hours ago

    తిరుమల వసతి గదుల బుకింగ్‌లో సమూల మార్పులు: భారీగా ప్రక్షాళన

    Andhrapradesh21 hours ago

    ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

    National1 day ago

    Monsoon Travel Tips: మనదేశంలో ఈ ప్రదేశాలను సరస్సుల నగరాలు అని అంటారు? ఈ సీజన్‌లో పర్యటనకు బెస్ట్ ఆప్షన్

    International1 day ago

    విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ‘ప్రచండ’ ఓటమి- తదుపరి పీఎం ఎవరంటే?

    National1 day ago

    2060 నాటికి భారత జనాభా 170 కోట్లు- 63.3 కోట్లకు పడిపోనున్న చైనా! – un report on population

    National1 day ago

    Anant Ambani Radhika Wedding : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం.. గణేష్ స్థాపన నుంచి పాగ్ ఫెరా వరకు సాంప్రదాయ గుజరాతీ షాదీ ఆచారాలివే..!

    National1 day ago

    Trainee IAS: తుత్తర ఎన్ని తిప్పలు తెస్తుందో చెప్పడానికి ఈమె ప్రత్యక్ష ఉదాహారణ

    National1 day ago

    Delhi: కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..

    Education2 days ago

    విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..

    Andhrapradesh2 days ago

    ఏపీలో స్దానిక సంస్థలకు గుడ్ న్యూస్- మరో హామీ నెరవేర్చిన కూటమి సర్కార్..!

    Railways2 days ago

    తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!

    National2 days ago

    Agniveer Scheme: అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. ఇక సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో రిజర్వేషన్లు

    Andhrapradesh2 days ago

    Tirumala PrankVideo: తిరుమల క్యూలైన్లలో యూ ట్యూబర్‌ ప్రాంక్ వీడియో, నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలకు టీటీడీ ఆదేశం

    National2 days ago

    NEET UG Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్‌!

    Andhrapradesh2 days ago

    రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు.. అప్పటి నుంచే అందుబాటులోకి..

    National3 days ago

    పాక్ యుద్ధ విమానం ఎఫ్ 16ను లాక్ చేసి… దాయాదిని వణికించిన కార్గిల్ హీరో

    Andhrapradesh3 days ago

    Vizag Steel Plant : అలాంటి ప్రశ్నే లేదు…! వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

    International3 days ago

    ‘ప్రపంచానికి భారత్‌ బౌద్ధాన్నిచ్చింది – యుద్ధాన్ని కాదు’- ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ – PM Modi Foreign Tour

    International3 days ago

    సముద్రంలోనే 37గంటలు- 80కి.మీ దూరం కొట్టుకుపోయిన యువతి- అయినా సేఫ్! – sea japan swimmer rescue

    National3 days ago

    లద్దాఖ్‌ బోర్డర్‌లో డ్రాగన్‌ కుట్రలు.. ఆ బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది.. కవ్వించే ప్రయత్నంలో భాగమా?

    National3 days ago

    పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్న అంబానీ ఫ్యామిలీ

    Andhrapradesh3 days ago

    Srisailam: మలన్న భక్తులకు అలెర్ట్.. భారీగా భక్తుల రద్దీ, దర్శనానికి 4 గం. ల సమయం..

    National4 days ago

    Supreme Court: ముస్లిం మహిళలకు భరణం.. హైదరాబాద్ దంపతుల కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

    National4 days ago

    Assembly Bypoll : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్

    International4 days ago

    రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే- ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? – Russian Army Shoes

    Business2 months ago

    Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

    Career2 months ago

    విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

    Business2 months ago

    ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

    Business2 months ago

    ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

    National2 months ago

    IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

    News2 months ago

    జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

    Education1 month ago

    వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

    National1 month ago

    Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

    Crime News1 month ago

    జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

    Andhrapradesh1 month ago

    250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

    National1 month ago

    నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

    National1 month ago

    ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

    Andhrapradesh1 month ago

    పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

    Spiritual1 month ago

    Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

    Andhrapradesh1 month ago

    ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

    Political4 weeks ago

    కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

    National2 months ago

    అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

    Telangana2 months ago

    Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

    Andhrapradesh1 month ago

    SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

    Andhrapradesh1 month ago

    ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

    National1 month ago

    కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

    Railways4 weeks ago

    పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

    Political1 month ago

    పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

    International2 months ago

    Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

    Andhrapradesh1 month ago

    ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

    Andhrapradesh1 month ago

    వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

    Andhrapradesh3 weeks ago

    జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

    Andhrapradesh4 weeks ago

    సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

    Spiritual1 month ago

    Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

    Andhrapradesh3 weeks ago

    రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

    Trending