Connect with us

Spiritual

Ganga Dussehra: గంగా దసరా రోజున 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు.. ఈ సమయంలో చేసే స్నానం, దానాలకు రెట్టింపు ఫలం..

Published

on

సమస్త మానవాళి క్షేమం కోసం భగీరధుడి కోరిక మేరకు దివి నుంచి భువికి ఏతెంచింది గంగా దేవి. అలా భూమి మీదకు గంగమ్మ అడుగు పెట్టిన రోజుని గంగా దసరగా జరుపుకుంటాము. ఈ ఏడాది జూన్ 16, 2024 ఆదివారం రోజున గంగా దసరా వచ్చింది. అయితే ఈ రోజున 100 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం ఏర్పడనుంది. జూన్ 16వ తేదీన హస్తా నక్షత్రంలో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం అనే శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాల కలయికతో గంగా దసరా రోజున చేసే స్నానానికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజున చేసే నదీ స్నానం, పూజలు, దానాలకు అత్యంత ఫలవంతం అని నమ్మకం. అంతేకాదు తెలిసి, తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ఇక ఆ రోజున ఏర్పడే శుభ యోగాల కొన్ని రాశులపై అంటే మేష రాశి, మిధున రాశి, కుంభం వంటి రాశులకు చెందిన వ్యక్తులపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. వీరు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు పొందుతారు. గంగా దసరా రోజున చేసే స్నానం దానాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.

గంగా దసరా 2024 శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం గంగా దసరా రోజున గంగా స్నానం లేదా నదీ స్నానం చేయడానికి, పూజకు దానాలకు శుభ సమయం ఉదయం 4:03 నుంచి 4:43 వరకు.. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:50 వరకు ఉంటుంది. ఇక సంధ్యా ముహూర్తానికి అనుకూలమైన సమయం.. సాయంత్రం 7:20 నుంచి 7:40 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో గంగానదిని పూజించడం, నదీ స్నానం చేయడం వల్ల పూర్వీకులకు సుఖం, మోక్షం కలుగుతాయని నమ్మకం.

గంగా దసరా ప్రాముఖ్యత
గంగా దసరా పండుగ రోజున స్వర్గం నుంచి గంగాదేవి శరవేగంగా భూమి మీదకు దూసుకు వస్తుంటే.. శివుడు తన శిగలో బంధించి గంగమ్మ భీకర వేగాన్ని తగ్గించి భూమిపైకి విడిచినట్లు.. తద్వారా శివుడు భగీరథుడి చేసిన తపస్సును మెచ్చి తపః ఫలాలను ఇచ్చాడని నమ్మకం. పూర్వీకులు మోక్షాన్ని పొందేందుకు.. గంగా దసరా పరమ పవిత్రమైన రోజుగా నమ్ముతారు. ఈ రోజున చేసే నదీ స్నానం.. మనసు స్వచ్ఛత, మోక్షం, పుణ్యాన్ని పొందేందుకు మార్గాన్ని సూచిస్తుంది.

గంగా దసరా పూజా విధానం
గంగా దసరా రోజున సూర్యోదయ సమయంలో నిద్రలేచి గంగా నదిలో స్నానం చేయాలి. గంగా నదికి చేరుకోవడం సాధ్యం కాకపోతే.. ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగాజలం కలపండి. ఆ తర్వాత గంగామాత విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి, పుష్పాలను సమర్పించి, గంగా స్తోత్రాన్ని పఠించండి. ఈ రోజున నీరు, ధాన్యాలు, వస్త్రాలు , డబ్బును అవసరమైన వారికి దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొంది జీవితం ఆనందంగా సాగుతుందని విశ్వాసం.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని Infoline.one ధృవీకరించడం లేదు

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Spiritual

పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఆయుధాలు

Published

on

వనేశ్వర్, జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉంది. ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి కటక్‌లోని తన నివాసంలో ఒక టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ… తాము రహస్యగది నుంచి తాత్కాలిక ఖజనాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతోపాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామగ్రి భద్రంగా ఖజనాలో ఉంచి సీల్‌ చేయించామని, ఇదంతా వీడియో తీయించామన్నారు. పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపట్టనున్న రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు.

ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయన్నారు. రహస్యగదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు.. లేజర్‌ స్కానింగ్‌ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతే జరుగుతుందని జస్టిస్‌ రథ్‌ పునరుద్ఘాటించారు.

Continue Reading

Spiritual

TTD: తిరుమలలో భక్తులు ఫుల్ హ్యాపీ, అన్నప్రసాదంలో రాజీ లేదు, రోజుకు!

Published

on

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మంచి రోజులు వస్తున్నాయని భక్తులు అంటున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించలేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీటీడీ ఈవోగా జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమలలో పరిస్థితులు మారుతున్నాయి.

టీటీడీలో ప్రక్షాళన మొదలైన తరువాత మొదట శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం పెద్దఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విరివిగా అన్నప్రసాదం అందిస్తున్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో విరివిగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.

అయితే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదంలో నాణ్యతలేదని గత కొంతకాలంగా భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జే. శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్నప్రసాద నాణ్యతపై ఎక్కువ దృష్టి సారించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఈవో శ్యామలరావు అన్నప్రసాదం ఎలా ఉంది అంటూ శ్రీవారి భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు

Continue Reading

Spiritual

Jageshwar Mandir: శివలింగాన్ని పూజించడం ఎక్కడ నుంచి మొదలైందో తెలుసా..! ఆ ఆలయ విశిష్టత, విశేషాలు ఏమిటంటే?

Published

on

దేవభూమిని ఉత్తరాఖండ్ ను సాంస్కృతిక నగరంగా కూడా పిలుస్తారు. హిందూ మతపరంగా ముఖ్యమైన అల్మోరా జిల్లాలో అనేక పౌరాణిక , చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జగేశ్వర్ ధామ్ ఆలయం. ఇక్కడ నుంచి శివలింగ ఆరాధన ప్రారంభమైనదిగా పరిగణించబడుతుంది. దేవాలయాల్లో జగేశ్వర ఆలయం విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆలయం పేరు చరిత్రలో నమోదు చేయబడింది. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల నాటిది.

ఇక్కడి నుంచి శివలింగ పూజ ప్రారంభమైంది జగేశ్వర ధామ్ శివుని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటి. జగేశ్వర ధామ్ శివుని తపస్సు చేసే ప్రదేశంగా పరిగణించబడుతుంది. లింగ రూపంలో శివుడిని ఆరాధించే సంప్రదాయం భూమి మీద మొదట ప్రారంభమైన మొదటి ఆలయం ఇదేనని పురాణాల కథనం. జగేశ్వర్‌ను ఉత్తరాఖండ్‌లోని ఐదవ ధామ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని ఎనిమిదవ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. దీనిని యోగేశ్వర అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం పురాణాలలో కూడా ప్రస్తావించబడింది.

కాంప్లెక్స్‌లో మొత్తం 124 దేవాలయాలు పార్వతి, హనుమంతుడు, మృత్యుంజయ మహాదేవుడు, భైరవ, కేదార్నాథుడు, దుర్గ వంటి మొత్తం 124 ఆలయాలు ఈ ఆలయ సముదాయంలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో నేటికీ పూజలు జరుగుతాయి. నమ్మకం ప్రకారం శివుడు, సప్తఋషులు ఇక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ ప్రదేశం నుండే శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక విశేషమేమిటంటే.. ఎవరైనా ఈ ఆలయ నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. దీని నిర్మాణం సరిగ్గా కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది.

శివుని పాదముద్రలు అల్మోరాలోని జగేశ్వర్ దేవాలయం కొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో భీమా దేవాలయం సమీపంలో శివుని పాదముద్రలు ఉన్నాయి. పాండవులకు కనపడకుండా ఉండేందుకు పరమశివుడు ఒక పాదాన్ని ఇక్కడ, మరో కాలు కైలాసంపై ఉంచాడని చెబుతారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని infoline.one ధృవీకరించడం లేదు

Advertisement
Continue Reading
International2 hours ago

‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

National2 hours ago

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Telangana2 hours ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

National12 hours ago

RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

International12 hours ago

అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

International12 hours ago

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

Andhrapradesh12 hours ago

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

National12 hours ago

Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

Business2 days ago

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Andhrapradesh2 days ago

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

International2 days ago

మోదీకి మస్క్‌ అభినందనలు!

Education2 days ago

తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు

Spiritual2 days ago

పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఆయుధాలు

National3 days ago

‘బ్రాండెడ్’ షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

National3 days ago

UPSC ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా!- IAS పూజా ఖేడ్కర్‌ వివాదంతో!!

National3 days ago

పూజా ఖేడ్కర్‌కు UPSC షాక్​- అభ్యర్థిత్వం రద్దు? పరీక్షలు రాయకుండా బ్యాన్​పై షోకాజ్​ నోటీసులు – pooja khedkar ias controversy

National3 days ago

స్ట్రాంగ్ రూమ్‌కు జగన్నాథుని అమూల్య సంపద.. త్వరలోనే విగ్రహాల విలువ లెక్కింపు

Agriculture3 days ago

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం బయలుదేరనున్న స్వామివారి పుష్పరథం..భారీగా తరలివస్తున్న భక్తగణం..

National4 days ago

Ashwini vaishnaw: మైక్రోసాఫ్ట్‌తో సంప్రదించాం.. సర్వర్ల అంతరాయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Andhrapradesh4 days ago

Indrakeeladri: ఇంద్రకీలాద్రి‌పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. దుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. వర్షాల నేపధ్యంలో ఘాట్ రోడ్డు మూసివేత

International5 days ago

చందమామపై గుహను గుర్తించిన సైంటిస్టులు- ఫ్యూచర్​లో మనుషులు ఉండొచ్చు!

International5 days ago

అంతుచిక్కని మాథ్యూ క్రూక్స్ స్టోరీ – ట్రంప్‌పై హత్యాయత్నం ఇంకా మిస్టరీనే! – Donald Trump Attacked

National5 days ago

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఘాతుకం – ఐఈడీ పేలి ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

National5 days ago

పూరీ రత్నభాండాగారం రీఓపెన్- ఆభరణాలన్నీ బయటకు!

International5 days ago

Ex-Rolls-Royce Designer : జర్మనీలో రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ దారుణ హత్య.. ఇయాన్ కామెరూన్ ఎవరంటే?

Weather5 days ago

ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.

Andhrapradesh6 days ago

Andhra News: ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే?

Andhrapradesh6 days ago

దేశవ్యాప్తంగా FasTag ఉన్నవారి కోసం కొత్త నిబంధనలు! ఈ రోజే కొత్త ప్రకటన

International6 days ago

ట్రంప్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడి వాన్స్.. అతని సతీమణి భారత సంతతి మహిళ.. ఆమె ఎవరంటే?

Hashtag6 days ago

బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National3 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education1 month ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National1 month ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News1 month ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh1 month ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

National1 month ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Spiritual1 month ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Andhrapradesh1 month ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National1 month ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh1 month ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political1 month ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh1 month ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh1 month ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh1 month ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh4 weeks ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Political1 month ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Railways1 month ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Andhrapradesh2 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Andhrapradesh1 month ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Spiritual1 month ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Andhrapradesh1 month ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

Trending