Health
China Teen Zhou Chuna : అభిమాన నటిలా కనిపించాలని 100కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు.. రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన యువతి
China Teen Zhou Chuna : చైనాలోని 18 ఏళ్ల యువతి తన అభిమాన నటిగా కనిపించడం కోసం 100 కన్నా ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. ఈ సర్జరీల కోసం దాదాపు 563వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 4 కోట్లకు పైగా) ఖర్చు చేసింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఝౌ చునా.. 13 ఏళ్ల వయస్సులో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఎంతో ఇష్టమైన చైనీస్ నటి ఎస్తేర్ యు అందాన్ని ఎలాగైనా పొందాలని భావించింది. కొన్ని ఏళ్లుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి 4 మిలియన్ యువాన్ల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకుని మరి 100 ప్లాస్టిక్ సర్జరీల కోసం ఖర్చు చేసింది.
తన రూపం తనకు నచ్చలేదని :
ఆమె చిన్నతనం నుంచే చునా తన రూపాన్ని ఇష్టపడేది కాదు. తాను అందంగా లేనని ఆందోళన, నిరాశతో జీవించేది. ఆమె అందంగా కనిపించడం లేదని బంధువులు, కుటుంబ స్నేహితులు చెప్పినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యేది. షాంఘైలోని అంతర్జాతీయ పాఠశాలలో చదవినప్పుడు తన సహవిద్యార్థులు అందంగా ఉండటం చూసి తాను కూడా వారిలానే ఉండాలని భావించింది. అప్పటినుంచి ఆత్మన్యూనతాభావం, అసూయ ఆమెలో పెరిగాయి. అవే తన రూపాన్ని మార్చుకోనేలా ప్రేరేపించాయి.
అప్పుడే యువతి చునాకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనే ఆలోచన పుట్టింది. అలా చిన్న వయస్సులో ప్లాస్టిక్ సర్జరీ ప్రయాణం ప్రారంభమైందని నివేదిక వెల్లడించింది. మొదటి ఆపరేషన్‌లో డబుల్ కనురెప్పల సర్జరీకి ఆమె తల్లి అనుమతించింది. అప్పటినుంచి యువతి తన రూపాన్ని మార్చుకోవడంలో నిమగ్నమైపోయింది. ఇతర వైద్య విధానాల కోసం తన చదువును కూడా పక్కన పెట్టేసింది.
సర్జరీలతో ఇబ్బందిపడినా ప్రయత్నాలు ఆపలేదు :
ఔట్‌లెట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను దాదాపు అన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాను. అందులో రినోప్లాస్టీ, బోన్ షేవింగ్ వంటివి ఉన్నాయి’ అని ఆమె చెప్పింది. 10 సర్జరీల వరకుభరించినప్పటికీ ఆమె కళ్ళు పెద్దవి చేయడానికి ఇకపై ఎలాంటి సర్జరీలు వద్దని ఆమె వైద్యులు హెచ్చరించారు. కానీ, ఆమె వాటిని విస్మరించింది. అత్యంత బాధాకరమైన శస్త్రచికిత్స బోన్ షేవింగ్ చేయించుకున్నానని చైనా యువతి వెల్లడించింది. 10 గంటల పాటు సాగిన ఈ సర్జరీ కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితం అయింది. అయినా కొంచెం కూడా భయపడకుండా అలాంటి సర్జరీలను మళ్లీ చేయించుకుంటూనే వచ్చానని చెప్పుకొచ్చింది.
వైద్యులు వద్దని వారించినా వినలేదు :
చునాకు రెండో ఆపరేషన్ చేసేందుకు ఏ వైద్యుడు సిద్ధంగా లేరు. ఇలా ప్రతిసారీ కొత్త వైద్యుడి కోసం వెతికినట్టు అవుట్‌లెట్ నివేదించింది. అలా 100కు పైగా ప్లాస్టిక్ సర్జరీలను పూర్తి చేసింది. ఇప్పుడు తన ముఖాన్ని ఎవరూ గుర్తించలేనంత మారిందని తెలిపింది. పాత స్నేహితులు నన్ను ఇప్పుడు గుర్తించడం లేదని చెప్పింది. తనకు ఇంకా స్టార్ కావాలనే తన కలను కోరిక మాత్రం అలానే ఉందని పేర్కొంది.
ఇప్పుడు, చునా తల్లి కుమార్తె అందం పట్ల వ్యామోహానికి సపోర్టు చేయడం మానేసింది. ఆమె తండ్రి కూడా ఆమె కొత్త రూపాన్ని అంగీకరించలేదు. వైద్యులు ఇంకా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవద్దని గట్టిగానే హెచ్చరించారు. ఎట్టకేలకు యువతి చునా సర్జరీ ప్రయత్నాలను విరమించుకున్నట్టు ప్రకటించింది.
Health
ప్రతి ఒక్కరూ డాక్టరే.. సొంత వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న వైనం
మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఎవరో ఏదో చెప్తే..అలాగే ఫాలో అయిపోతే అంతా సెట్ అవుతుందనేది భ్రమ. కొన్నిసార్లు వైద్య నిపుణులు ట్రీట్‌మెంట్ ఇచ్చినా బాడీ రెస్పాండ్ కాదు. అలాంటిది గూగుల్ సమాచారమో లేక ఇంకేవరో స్వయం ప్రకటిత మేధావులు చెప్పినట్లు చేస్తే బాగుంటామని.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కావాల్సినంతే తినాలి. తిన్నది అరిగించడం కోసం ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలని చెప్తున్నారు.
సీజనల్ వ్యాధులకు అయితే సొంత వైద్యం చేసుకోవద్దనేది వైద్య నిపుణుల సూచన. జ్వరం వచ్చిన వెంటనే పారాసిటమాల్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడటంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. డాక్టర్ల సూచన లేకుండా ట్యాబ్లెట్లు వాడటం చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. రెండుమూడు రోజులు కంటిన్యూగా జ్వరం ఉంటే కచ్చితంగా టెస్టులు చేయించుకోవాల్సిందేని చెబుతున్నారు.
బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా..
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు వేర్వేరు రోగ లక్షణాలు ఉంటాయి. కొందరు యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతుండటంతో అవి వ్యాధి లక్షణాలను బయటపడకుండా చేస్తాయని అంటున్నారు డాక్టర్లు. బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా..లోపల మాత్రం డెంగ్యూ ముదిరి ప్లేట్‌లెట్స్ పడిపోతాయని అలర్ట్ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ బాడీలోని ఊపిరితిత్తుల్లోకి, లివర్‌లోకి చేరిన తర్వాత హాస్పిటల్‌కు వెళ్తున్నారు. రెండుమూడ్రోజుల్లో కోలుకోవాల్సిన వారు..అప్పుడు వారాలపాటు చికిత్స పొందాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్లు.
డెంగ్యూ అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపుతుందని అనుకోవడం భ్రమ అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. పెయిన్ కిల్లర్లు, ఆకు రసాలు తాగి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి ట్యాబ్లెట్లు కూడా ఎంతవరకు పనిచేస్తాయో క్లారిటీ లేదంటున్నారు వైద్య నిపుణులు. సొంత వైద్యం మీద ఆధారపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దనేది వాళ్ల సూచన.
మరికొందరు.. ఫెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల్ని వాడుతుంటారు. అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఏ మందులైతే మంచిదో..డాక్టర్లు నిర్ధారించి రాసిన మెడిసిన్ అది. అదే ప్రిస్క్రిప్షన్ మిగతా వారికి పనికి రాదు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి చాలామంది ఆస్పిరిన్, ఎకోస్పిరిన్‌లు వాడేస్తున్నారు. ఇక కొంతమంది విటమిన్ సీ, డీ, జింక్ మందులను రోజువారీ మందుల మాదిరిగా వేసుకుంటున్నారు. మీతి మీరిన మెడిసిన్ కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్లు. సొంత వైద్యంతో చాలామందికి బీపీ, షుగర్ అటాక్ అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.
మితిమీరిన మందులు వాడటంతో
మితిమీరిన మందులు వాడటంతో దీర్ఘకాలిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకరమైన జన్యువులు పాడై.. రాబోయే తరాలకు ఇప్పటి రోగాలను వారసత్వంగా అందించే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకినప్పుడు మాత్రమే యాంటీ వైరల్ డ్రగ్స్‌ని వాడాలని సూచిస్తున్నారు. లేకుంటే బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అజిత్రోమైసిన్ వంటి యాంటి బయాటిక్ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
సొంత వైద్యం పెరగడానికి అందరికీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడమే కారణంటున్నారు ఎక్స్ పర్ట్స్. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు.. యూట్యూబ్, గూగుల్‌లో సెర్చ్ చేసి ఇష్టం వచ్చిన ట్యాబ్లెట్లు, ప్రకృతి వైద్యం అంటూ ఏది పడితే అది వాడేస్తున్నారు. అదే అనారోగ్యానికి కారణం అవుతోంది.
Health
Caffeine Overdose: అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. మరైతే రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?
కాఫీ చాలా మందికి ఇష్టమైన పానీయం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. వారి జీవిత్తాల్లో కాఫీ అంతగా మమేకమై పోతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరంలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.
శరీరంలో కెఫిన్ స్థాయిలు పెరగడం వల్ల నెర్వస్‌నెస్‌కి దారి తీస్తుంది. ఆందోళన ధోరణి కూడా పెరుగుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫిన్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి.
కెఫీన్ ఆహారం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కెఫిన్ స్థాయిని పెరగడం హృదయనాళ వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కప్పు కాఫీ కూడా తాగకూడదు. ఇది మధుమేహం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కెఫీన్ స్థాయిలు పెరగడం కళ్లకు కూడా మంచిది కాదు. గ్లాకోమాతో బాధపడేవారికి, ఎక్కువ కాఫీ తాగడం వల్ల వారి కంటి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది.
శరీరంలో కెఫిన్ స్థాయిలు పెరగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల యూరినరీ బ్లాడర్ కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 400 మిల్లీ గ్రాములకు మించి కాఫీ తాగకూడదని నిపుణులు అంటున్నారు.
Health
ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?
పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ద్రాక్ష పండు తీపి, పుల్లని రుచితో చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎండుద్రాక్షను చాలా మంది ఇష్టపడే ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ఇది స్వీట్లు, తీపి వంటకాలను అలంకరించడానికి ఉపయోగిస్తారు. ద్రాక్షలో 80 శాతం నీరు ఉంటుంది. అయితే ఎండుద్రాక్షలో నీటి శాతం 15 శాతం మాత్రమే. అయితే, ప్రజలు ద్రాక్ష, ఎండుద్రాక్ష రెండింటినీ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ పండ్లు, డ్రై ఫ్రూట్స్‌లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
ద్రాక్ష, ఎండుద్రాక్ష రెండూ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు, ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది..? అంటే.. ద్రాక్ష కంటే ఎండుద్రాక్షలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వాస్తవానికి, ద్రాక్షను ఎండబెట్టిన తర్వాత ఎండుద్రాక్ష తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో, చక్కెర, యాంటీఆక్సిడెంట్లు ఉపయోగించబడతాయి. ఇవి కేలరీల రూపంలోకి మార్చబడతాయి. అరకప్పు ద్రాక్ష పండ్లను తింటే కేవలం 30 క్యాలరీలు, అదే మోతాదులో ఎండుద్రాక్ష తింటే 250 కేలరీలు శరీరానికి అందుతాయి.
ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఎండుద్రాక్ష ఫైబర్ గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా,ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఈ డ్రై ఫ్రూట్‌లో కనిపిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది పేగులోని బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ..
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉంటాయి. ఈ రెండు పోషకాలు మన చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని క్యాన్సర్‌కు కారణమయ్యే కిరణాల నుండి కూడా రక్షిస్తుంది. మీరు ద్రాక్షను తీసుకుంటే, ముఖం నుండి నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి.
ఎండుద్రాక్ష, ద్రాక్షలో ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది?
ఈ రెండు ఆహార పదార్థాలు వారి స్వంత మార్గంలో ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ద్రాక్ష మరింత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే తక్కువ కేలరీలు ఉన్న వస్తువు ఆరోగ్యానికి మంచిది. అందువలన దాని అసలు రూపంలో పండు తినడానికి ప్రయత్నించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు infoline.one బాధ్యత వహించదు.)
-
Business4 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career4 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
National5 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business4 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
News4 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business4 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education4 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
International5 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National4 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh3 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Spiritual4 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh4 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana4 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Crime News4 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
National4 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways4 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National4 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National4 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh4 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National4 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh4 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh4 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political4 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political4 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh4 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh4 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National4 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh4 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Education4 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather4 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
National5 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Business4 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh4 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News4 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Cinema7 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh4 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh4 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
International5 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh8 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
News5 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Railways3 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh4 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh4 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News4 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh4 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Spiritual4 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Cinema4 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Spiritual4 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
International4 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Business4 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?